My Blog List

Sunday, December 30, 2012

దేవుడా! నా బిడ్డలకు వెలుగు ప్రసాదించు!

దేవుడా!
నా బిడ్డలకు వెలుగు ప్రసాదించు!
నా చిన్నారులు
చి . జ్ఞాపిక , మెకానికల్ ఇంజినీరింగ్ ఆఖరి సం .
చి . అనామిక, పశువైద్య విద్య ,మూడవ సం .
చి . వెంకటేశ్వర రావు , ఇంటర్ మొదటి సం . చదువుతున్నారు.
వారికీ విద్య అభ్యసించటం లో ఎట్టి  అవరోధాలు కలిగించకు. నా కోరిక తీరుస్తావు కదూ ........

                   చదువు అయిపోయిన తరువాత వారి  కోరికలు పండించు . ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దు .
                  వారికి  తల్లిని ఆదరించే మనసు నివ్వు.
                  నా బిడ్డలకు మనుషులను ప్రేమించే గుణం ఇవ్వు. ద్వేషించే వారిని సైతం ఆదరించే మనసు నివ్వు . సర్వ జీవుల పట్ల ప్రేమానురాగాలు పంచుతూ ఆనందంగా జీవించే వెలుగు ప్రసాదించు.  ఈ ప్రపంచం లో పుట్టినందుకు జన్మ సార్ధక్యాన్ని ప్రసాదించి పునీతులను చేయి.
దేవుడా!
నా బిడ్డలకు వెలుగు ప్రసాదించు!



                                                 

Saturday, December 29, 2012

దేవుడా! దేవుడా!  మేలుపొద్దులు
నాకు చక్కని జీవితాన్ని ఇచ్చావ్ . ఇంత కాలం నన్ను ప్రత్యేక వ్యక్తిగా తీర్చి దిద్దావ్ .
నేను కోరుకున్న లక్షణాలతో కూడిన ' జానకి' ని నా జీవిత భాగస్వామిని చేసావ్ .
జ్ఞాపిక , అనామిక , వెంకటేశ్వర రావు లను నాకు బిడ్డలుగా ప్రసాదించావ్.
నా బిడ్డలకు సాదారణ విద్యాలయాల్లో చదివించి, మంచి చదువులలో రాణించే విధంగా రూపొందించావ్ .
అలాగే మంచి భవిష్యత్తును కూడా ప్రసాదిస్తావ్ .
నా జీవిత భాగాస్వామినికి నావల్ల ఆనందం కలగ చేసావ్ .
నేను ఏది కోరితే అది నాకు ప్రసాదించావ్ .
ఎన్ని ఇచ్చావ్ నాకు.
నేనంటే ఎందుకు ఇంత ఇష్టం నీకు.
ఈ సృష్టి లో అద్భుతమయిన  పనులు నా చేత చేయించావ్.
చిత్రకారుడిని చేసావ్ , రచయితని చేసావ్,  రంగస్థలం -రేడియో - టివి లలో నటింపచేసావ్.
నాకోరికమీద చివరికి ఒక సినిమాలో కూడా నటింపచేసావ్.
నా చేత తెలుగు భాషకు సేవ చేయించావ్ . తల్లికి ,తండ్రికి సేవ చేయించావ్.
ఎన్నో సాహిత్య సంస్థలకు ముఖ్య భాద్యుడుగా చేసి అద్భుతాలు చేయించావ్.
పిన్న వయసులో సాహిత్య మాసపత్రికకు 'సంపాదకుడు' చేసావ్.
అమ్మ భాష అంతరించి పోయే దశలో , నన్ను మేలుకొలిపి తెలుగు భాష బతకాలంటే తెలుగు జానపద కళలు వర్ధిల్లాలని , ముందుగ అందుకు సంబందించిన కార్యక్రమం,  ప్రపంచంలోనే "తొలి జానపద కళా  చైతన్య యాత్ర "ను నాచేత నడిపించావ్ . అందుకు పెద్దలు , రాజకీయ నాయకులూ , ప్రభుత్వాలు సహకరించక పోయినా , నా స్వంత నిధులు తోడుతో ముందుకు వెళ్ళేలా చేసావ్. ఇంత ధైర్యాన్ని , వ్యూహ చతురతను నాకు ప్రసాదించావ్ . ఎన్ని పుస్తకాలు నాచేత రాయించావ్ .  పుస్తకాలకు,  సంపా దకత్వం వహించిన ఆకర గ్రంధాలకు  ముద్రణ కూడా చేయించావ్. 
దేవుడా ! నా చేత ఎన్ని చేయించావ్!
అల్పుడి చేత అనల్ప కార్యాలు చేయించావ్ .
ఇదంతా లోక కళ్యాణం కోసమే చేయించి వుంటావ్
ఈ విశాల విశ్వం లో నాకు ఒక ప్రత్యేకతను కల్పించావ్ .
ఎంత గొప్ప సంకల్పం నీది.
దేవుడా! నీకు నా మప్పిదాలు !

Tuesday, August 14, 2012

తెలుగు జానపద కళా చైతన్య యాత్ర -సమీక్ష,కొన్ని ఫోటోలు

తెలుగు జానపద కళా చైతన్య యాత్ర -సమీక్ష,కొన్ని ఫోటోలు









యాత్ర లో కొన్ని ఛాయాచిత్రాలు
















Monday, August 13, 2012

స్పాట్ పెయింటింగ్ మరియు మ్యూ జికల్ వాయిద్యముల పోటీ




స్పాట్ పెయింటింగ్  మరియు మ్యూ జికల్ వాయిద్యముల పోటీ గురించిన సమాచారము కృష్ణా జిల్లాలో మీకు తెలిసిన వారందరికీ తెలియ చేసి ప్రోత్సహించగలరు.

Saturday, July 28, 2012

తెలుగు "జానపద కళా చైతన్య యాత్ర'- 07, 08, 09 ఆగస్ట్ -2012 తేదీలలో

తెలుగు "జానపద కళా చైతన్య  యాత్ర'- 07, 08, 09 ఆగస్ట్ -2012  తేదీలలో...

తెలుగు ప్రజలందరికీ ఆహ్వానం .కరపత్రం చూడండి.







ఈ యాత్రను తెలుగు ప్రజలు జయప్రదం చేస్తారని కోరుకొంటూ .........
తాతా  రమేశ్  బాబు 

Saturday, July 21, 2012

"వసతి గృహం "- రేడియో నాటికలో నేను

"వసతి గృహం "- రేడియో నాటికలో నేను  ఇంటి యజమాని "సదాశివ' గా నటించాను. ఈ నాటిక విజయవాడ రేడియో కేంద్రం లో ది . 17 . 07. 2012 న రికార్డ్ చేసారు.  ది . 26.07.2012 న రాత్రి 8.15 ని. లకు ప్రసారం కానుంది.
" అద్దె ఇళ్ళలో వున్న వారికి  ,స్వ గృహస్తుల అంక్షలు ,ఇబ్బందులు ,వారి గొంతెమ్మ కోర్కెలు అర్థం అవుతాయి " అనే అంశంతో ఈ కథ వుంటుంది . ఇందులో నటించిన వారి  ఫోటో


ఎడమనుండి...సదాశివ భార్య సరళగా 'మట్టా  విజయ లక్ష్మి',  శ్రీహరి భార్య లక్ష్మి గా 'ఎస్. అమృతవర్షిని ', అద్దె ఇంట్లో వుండే వ్యక్తి శ్రీహరి గా 'వి.వి. నారాయణ పాత్రుడు', ఈ నాటికకు దర్శకులు 'ఆళ్ళ యోగానందీస్వర  రెడ్డి', సదాశివ కుమారుడు యశ్వంత్ గా 'వెంపాటి  రమేష్', ఇంటి యజమాని సదాశివ గా తాతా  రమేష్ బాబు.


                     ఈ నాటిక రచన వి.వి.సత్యనారాయణ , ప్రొడ్యూసర్ శ్రీ 'ఖుద్దూస్ '. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.మరి ఈ నెల 26. గురువారం రాత్రి 8.15ని.లకు రేడియో లో నాటిక విని మీ అభిప్రాయం చెపుతారు కదూ .

                  నేను గతం లో 'యశోధర ' లో శుద్దోధనుడు గా, 'అపూర్వనరకం' లో తమిళ అయ్యరుగా, 'కూటి  విద్య'లో జర్నలిస్ట్ గా,'నాదయోగి' లో రామరాయుడు,భటుడు గా ,'రాంబాబు కాపురం' లో రాంబాబు గా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి నటించాను.

Thursday, July 12, 2012

భారతీయ సాంప్రదాయ తెలుగు "జానపద కళా చైతన్యయాత్ర" -కరపత్రం 1

భారతీయ సాంప్రదాయ తెలుగు "జానపద కళా  చైతన్యయాత్ర" -కరపత్రం 1
తెలుగు జానపద కళాకారులకు, కళాభిమానులకు, పరిశోధకులకు, భాష ప్రేమికులకు, చరిత్రకారులకు ,
సగౌరవంగా!
తెలుగు జానపద  కళలకు , తన రాజ్యంలో ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చిన శ్రీ కృష్ణ దేవరాయలు పట్టాభిషిక్తుడైన ఆగష్టు 9 వ తేదిన ...ఆ 'కళా సాహితీ సమరాంగణ సార్వభౌముడి'ని స్మరించు కుంటూ ....  నేడు అవసాన దశలో వున్న తెలుగు జానపద కళా సంపదను కాపాడుకొని మన చిన్నారులకు పరిచయం చేస్తూ,ప్రజలలో తెలుగు కళల, తెలుగు  సంస్కృతి పట్ల , తెలుగు బంధాల పట్ల అవగాహన కల్పించి మమతానురాగాలను తెలుసుకొని ఆరోగ్యకరమైన తెలుగు భారతాన్ని నిర్మించుకొనే దిశగా , తెలుగు ప్రజల కళా హృదయాలను మేలుకొలిపే ఒక కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతున్నాం.
గాన గంధర్వుడు 'ఘంటసాల', తెలుగు భాషను,  అంతర్జాతీయంగా పరిచయం చేసిన వెండి తెర వేలుపు  'నందమూరి తారక రామారావు', తన నటనకు పురుడు పోసుకున్న 'అక్కినేని నాగేశ్వర రావు',  చిత్రకారుడు 'ఎస్.వి. రామారావు' , నవరస నటన సార్వభౌముడు 'కైకాల',   జానపద కళాకారుడు యడవిల్లి  రమణ, మిరియాల శేఖర్ బాబు, కీ . శే. సున్నం వీరయ్య మొదలైన అనేక   జాతీయ అంతర్జాతీయ కళాకారులు జన్మించిన ,నడయాడిన కళలకు కాణాచి గా పిలిచే గుడివాడ అక్కినేని నాగేశ్వర రావు కళాశాల నుండి రాజమండ్రి  [జానపద కళాకారుల కాలని ] వరకూ ప్రముఖ జాతీయ జానపద కళాకారులు, జానపద కళా పరిశోధకులు, వివిధ రంగాల ప్రముఖులు, జానపద కళా సంస్కృతులకు వారసులైన యువతరం తో " జానపద కళా చైతన్య యాత్ర" నిర్వహిస్తున్నాం.
సమయం చాలా తక్కువ!
యాత్ర సాగే వివరాలు:
ఆగస్ట్ 9 న  గురువారం ఉదయం గుడివాడ, అంగలూరు,గుడ్లవల్లేరు, పెదన మీదుగా మచిలీపట్టణం. ఆ తరువాత కూచిపూడి,వుయ్యూరు, కంకిపాడుల మీదుగా విజయవాడ .
ఆగస్ట్ 10 న విజయవాడ నుండి గన్నవరం,చిన అవుటపల్లి , హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు . ఆ తరవాత తాడేపల్లి గూడెం , తణుకు.
ఆగస్ట్ 11 న  తణుకు నుండి రావులపాలెం,ధవళేస్వరం, మీదుగా రాజమండ్రి .
ఎంపిక చేసిన నగరాలూ, గ్రామాలలో పాదయాత్ర , మరియు బహిరంగ సభలు జరుగుతాయి. ప్రతిచోట 'జానపద కళలు ' ప్రదర్శన జరుగుతుంది.
ఈ సందర్భంగా ప్రముఖ రచయితలు, కళాకారులు, ప్రముఖులు యత్రలోను, సభలలోను ,'వీధి సమావేశాల'లోనూ పాల్గొంటారు.
కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో జరిగే ఈ యాత్ర లో ఆయా జిల్లాలలోని ప్రముఖుల పూనికను అనుసరించి ఈ కార్యక్రమం లో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. పూర్తి కార్యక్రమ వివరాలు మీకు ముందుగానే తెలియచేస్తాము.
ప్రపంచం లోనే మొదటిసారిగా సాంప్రదాయ జానపద కళల కోసం ప్రజల వద్దకు వెళ్లి ప్రదర్శిస్తున్న ఈ కార్యక్రమం లో కళా కారులు, కళాభిమానులు, తెలుగు భాషాభిమానులు, పాల్గొని విజయవంతం చేయాలని మా విన్నపం.
మరో విన్నపం:
ప్రజలలో సాంప్రదాయ జానపద కళల పట్ల, సంస్కృతి పట్ల అభిమానాన్ని రేకెత్తించటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ యాత్ర.
అన్ని రంగాలకు చెందిన ప్రజలను ఈ యాత్రలో సహకారాన్ని అందించ వలసినదిగా ఆహ్వానిస్తున్నాం. స్థానికంగా జరిగే కళాప్రదర్శన , పాదయాత్ర లలో తమతమ కళాశాలలు,  పాటశాలలు  నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనేలా చేయవలసినదిగా విద్యారంగాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ యాత్ర కి ప్రధాన లక్ష్యం 'యువతే'!.
యాత్ర నిర్వహణలో మీరు ఏదయినా ముఖ్య భాద్యత చేపట్టటానికి సిద్ధంగా వున్నారా? ఏదయినా ఒక అంశం స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తారా?
అవి ....
మూడు రోజులు ఒక బస్సుకు కిరాయి 50 ,000 వెల రూపాయలు. ఒక బస్సు లోని 40 మందికి ౩ రోజులకు టి, ఉపాహారం, స్నాక్స్ , భోజనం వగైరాలకు 16 000  వేల రూపాయలు. కరపత్రాలు, ఆహ్వానాలు, మైక్ ,ఫ్లెక్ష్,విడియో,ఫోటో,బద్గే,పోస్తాగే వగైరా 30 000 వేల రూపాయలు, 10 మంది జానపద కళా పరిశోధకుల  రవాణా చార్జీలు వగైరా 15 000 , ఒక బస్సులోని 40 మంది కి జ్ఞాపికలు ,శాలువలు, ప్రశంస పత్రాలు 20 వేలు,25 మంది జాతీయ జానపద కళాకారులకు ౩ రోజులకు 50 వేలు,పగటివేషాలు-సామాజిక అంశాలు పుస్తకానికి 35 000 వేలు. సావనీర్ కు 30 వేలు అవుతాయని ప్రాధమిక అంచనా.
ఇందులో ఏదయినా అంశానికి స్పాన్సర్ గానీ సావనీర్ కి ప్రకటనల రూపంలోగాని  అందించటానికి ముందుకు వస్తారా?
వెంటనే తెలియచేయ గలరు.
సంప్రదించ వలసిన చిరునామా :
తాతా రమేశ్ బాబు,  రచయిత, చిత్రకారుడు, రేడియో ,టివి నటుడు, జానపద కళాకారుడు.
గౌరవ అధ్యక్షులు
కళా భారతి
సాంప్రదాయ కళాకారుల సంక్షేమ సంఘం [రి.నెం. 426 /2009 ]
14 /161 -2 , స్టేషన్ రోడ్, గుడివాడ-521301 .కృష్ణా జిల్లా. ఆంధ్ర ప్రదేశ్.
సెల్ : 9441518715
ఈమెయిలు : rbtata60 @gmail.com

ఈ యాత్ర లో జానపదసూచనలు తెలియ చేయండి. ఇంద్రజాల ప్రదర్శన, అర్థనారీశ్వర, పిట్టలదొర, బుడ బుడకల ,చాత్తది వైష్ణవుల,వీర బాహు, మొదలయిన పగటి వేషాలతో పాటు తంబుర కథ, బుర్రకథ, యక్షగానం,బొమ్మలాట, జానపద పాటలు   మొదలయిన జానపద కళలు ప్రదర్శనలు వుంటాయి.
యాత్ర విజయ వంతం కావడానికి మీ సలహాలు ,సూచనలు తెలియ చేయండి.
             ఈ  అంతర్జాల కరపత్రాన్ని మీకు  తెలిసిన వారందరకు పంపి దిగ్విజయం చేయటానికి సహాయపడగలరు 


భారతీయ జానపద కళా సేవపరంగా
తాతా రమేశ్ బాబు





Saturday, July 7, 2012

కళా 'గురు పూజోత్సవం''

కళా 'గురు పూజోత్సవం''
గుడివాడ సమీప గ్రామం 'బిళ్ల పాడు ' గ్రామం లో  రంగస్థల కళా కారుల కాలని వుంది . అక్కడ 2001 జనవరి 24 న  కళా కారులచే ' శ్రీ షిర్డీ సాయిబాబా దివ్యమందిరం ' నిర్మించబడినది.. అప్పటి నుండి ప్రతి సం.. 'గురు పౌర్ణమి ' ఉత్సవాలు  క్రమం తప్పకుండ జరుపుతున్నారు..
ఉత్సవాలలో శ్రీ సాయి నాధుని దివ్య పాలరాతి విగ్రహానికి క్షీరాభిషేకం, విశేష పూజ ,భజనా కార్యక్రమాలు ,ప్రసాద వినియోగం, మధ్యాహ్నం అన్నసమారాదన , భక్తి రంజని సంస్కృతిక కార్యక్రమాలు  జరుగుతాయి.. అంతే కాక  'గురువులను పూజించు కోవటం ' ఆనవాయితీగా వుంటుంది..








ఈ సారి 'కళా గురువు'' గా నన్ను సత్కరించారు..
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ,' గురువులు సమస్త మానవావాళి కి మార్గదర్శకంగ వుంటూ, ప్రపంచానికి మంచి ని అందిస్తారని , తద్వారా  సమ సమాజం నిర్మాణ మవుతుందని , ఇదే మార్గాన్ని షిర్డీ సాయిబాబా అనుసరించారని ' చెప్పాను .
'కళా భారతి ' జానపద కళా కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మిరియాల శేఖర్ బాబు మాట్లాడుతూ, ' బహుముఖ ప్రజ్ఞా శాలి , రేడియో టివి నటుడు,జానపద కళా కారుడు,మా సంఘం 'గౌరవ అధ్యక్షులు ' , మీదు మిక్కిలి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన తాతా రమేష్ బాబు ను సత్కరించు  కోవటం మా అద్రుష్టం గా భావిస్తున్నామని ' చెప్పారు..
ప్రముఖ జాతీయ జానపద కళా కారులు, దేవర పెట్టె ఫేం యడవల్లి రమణారావు మాట్లాడుతూ,' ఎక్కడో మూలన  వున్న  మా కళా కారుల గురించి ఒక పుస్తకం రాస్తూ, తానూ కళా కారుడై వుండి కూడా మా అభ్యున్నతికి పాటు పడుతున్న తాతా రమేష్ బాబు గారికి ప్రతి కళా కారుడు  రుణపడి వుండాలన్నారు.
ఇంకా మాజీ వర్డు సభ్యులు పువ్వుల శోభారాణి,, మిరియాల శ్రీనివాసరావు,యడవల్లి వెంకటేశ్వర రావు , పలువురు కళా కారులు పాల్గొన్న ఈ సభ అర్థవంతంగా జరిగింది..

Sunday, July 1, 2012

'జానపద కళోత్సవం' - కార్యక్రమ చిత్రాలు

ప్రాభవాన్ని కోల్పోతున్న 'జానపద కళలు ' ను ప్రజలు కాపాడుకోవాలని ,నేటి చిన్నారులకు పరిచయం చేయాలనే ఆకాంక్ష తో జరిగిన 'జానపద కళోత్సవం '  వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని రాంకి కల్చరల్ ఫౌండేషన్ ,అక్కినేని కళా పీఠం ,కళా భారతి  సంస్థలు ,కృష్ణ జిల్లా  గుడివాడ  లో ఎర్పాటు  చేయగా , కేవలం 2 రోజుల వ్యవధి లో నేను నిర్వహించాను .
ఆ కార్యక్రమ చిత్రాలు కొన్ని.............




ఈ సందర్భంగా జరిగిన సభకు నేను [తాతా రమేష్ బాబు] స్వాగతం పలికాను. వేదిక మీద ఎడమ నుండి కే.ఎస్. అప్పారావు [అక్కినేని కళా పీఠం ], పి .వినయ్  కుమార్ [రాంకి ఫౌండేషన్ ],వెంకటేశ్వరావు , డా.పాపినేని శివశంకర్[రాంకి కల్చరల్ ఫౌండేషన్],ఎం. హరి ప్రసాద్[అక్కినేని కళా పీఠం], మిరియాల శేఖర్ బాబు [కళా 
భారతి ]



'దేవర పెట్టె ' పగటి వేషం - ఎడవల్లి రమణ రావు, మిరియాల రామరాజు, యడవల్లి రాము, డప్పు-మిరియాల ప్రసంత కుమార్, విర్నల దేవి ప్రసాద్.



దేవర పెట్టె-ఎడవిల్లి  రమణ రావు, యదవిల్లి రాము , మిరియాల రామరాజు, తాతా రమేష్ బాబు




'జానపద గీతాలు'  ఆలపిస్తున్న మిరియాల శేఖర్ బాబు, తాతా రమేష్ బాబు, ప్రశాంత్ కుమార్, విశ్వనాద్ బాబు



'తంబుర కథ' చెపుతున్న మిరియాల అచ్చమ్మ , వంతలు తిరుపతమ్మ ,కోటమ్మ : కథ- తాండ్ర పాపారాయుడు '




'పిట్టల దొర' పగటివేషం  లో పాల్గొన్న వారు ఎడమనుండి తాతా రమేశ్ , మిరియాల ప్రశాంత్ కుమార్, యడవల్లి వీరయ్య




'బుడబుడకలు '-పగటి వేషం లో పాల్గొన్న కళాకారులు యడవల్లి ముక్కోటి , యడవల్లి వెంకటేశ్వర రావు




' చాత్తాది వైష్ణవులు ' పగటి వేషం లో పాల్గొన్న కళాకారులు వీరనాల సుబ్బారావు, మిరియాల శ్రీనివాస రావు , మిరియాల విశ్వనాధ బాబు, తిరుపతి కుమార్



నన్ను[తాతా రమేశ్ బాబు ] సత్కరిస్తున్న యడవల్లి రమణ రావు , మిరియాల శేఖర్ బాబు , డా.  పాపినేని శివ శంకర్ , పి . వినయ్ కుమార్, మిరియాల శ్రీనివాస రావు , యెర్నేని వెంకటేశ్వర రావు  , కే.ఎస్. అప్పారావు.

Wednesday, June 27, 2012

"జానపద కళోత్సవం "-ఆహ్వానం

"జానపద కళోత్సవం "-ఆహ్వానం








'జానపద  కళోత్సవ'  ప్రాంగణ ద్వారం
కళా ప్రదర్శన వేదిక 'బానర్'  

Friday, June 22, 2012

175 వ ఎపిసోడ్ తో ముగియనున్న 'ఎదురీత'

175 వ ఎపిసోడ్ తో ముగియనున్న 'ఎదురీత'
ఈ విషయం తెలియచేయటానికి  చాలా బాధగా వుంది .   ఇందులో నటించిన  అందరి హృదయాలు బరువెక్కాయి. కాని తప్పదు  కదా ! ఎప్పుడో ఒకప్పుడు సీరియల్ ముగియవలసినదే!
ఈ సారి నేను షూటింగ్ కు వెళ్ళగానే 'నా ని ' కనపడ్డాడు. ఎంత సంతోషం కలిగిందో ! నాని అంటే మేకప్ మెన్ . నేను 'లయ' సీరియల్ లో వెంకట్రావు గా నటించినప్పుడు , నాకు మేకప్ వేసినది ఇతనే. చాలా అందంగా వేశాడని అనుకున్నారు అందరు.  పై ఫోటో లో మేకప్ చేస్తున్నాడు .


                                                  షాట్ గ్యాప్ లో సులోచన , నేను, సుగుణమ్మ
                                           మా మధ్య ఏమి జరిగిందో ముందుముందు చూడండి!


             మరో షాట్ గ్యాప్ లో శేషు, వీణ, సత్య , నేను.......... నా ప్రక్కన సత్య వాళ్ళ ఒరిజినల్ ఫాదర్


ఇంతకంటే ఎక్కువ ఫోటోలు పెట్టాలని లేదు. సీరియల్ అయిపోతోందని ............
మీ అభిప్రాయలు చెప్పటంలేదు..... ఈ సారయినా  చెప్పగలరు.

మీ
వెంకట్రావు
[తాతా  రమేష్ బాబు]
 

Wednesday, May 30, 2012

Sunday, May 13, 2012

'ఎదురీత ' షూటింగ్ కబుర్లు

'ఎదురీత ' షూటింగ్  చేసి, ఈ రోజే గుడివాడ వచ్చాను. కొన్ని ఛాయా  చిత్రాలు చూడండి.






          వెంకట్రావు ,బుచ్చి , వీణ, సత్య  లు మెట్ల మీద కుర్చుని ఆలోచనలో పడ్డారు . దేని గురించి?







                                      వీణ, సత్య, వెంకట్రావు ల మెస్ కి సిఐ వచ్చాడు . ఎందుకు? 





                              దర్శకులు వాసు.... షూట్ చేస్తున్న దృశ్యాన్ని మోనిటర్ లో చూస్తున్నారు .




    కేసు వాదించటానికి కోర్ట్ కి వస్తున్న లాయర్ 'భగీరద' గా , ఈ సీరియల్ రచయిత పీ. చంద్రశేఖర ఆజాద్.
    చాలా ఖరీదయిన లాయర్ . ఎవరి తరపున వాదిస్తాడు?  రాజా తరపునా? మంత్రిగారి తరపునా?



వెంకట్రావు ఇక్కడ ఎందుకున్నాడు? లాయర్ భగీరధ ను  'నైవేద్యం ' మెస్ కి ఆహ్వానించటానికి  వచ్చాడా? భాగీరధ మీద తిరగ బడతాడా ? అసలు ఎ  సంబంధం లేదా ?



అరె ! జడ్జ్ గారు , వెంకట్రావు నమస్కారాలు చేసి కొంటున్నారు! పైగా వెంకట్రావు కళ్ళజోడు పెట్టుకొన్నాడు... కొంపదీసి మన వెంకట్రావు కూడా,రాజా కేసు గురించి  'లా ' చదివేశాడా  ఏమిటి?   అసలు ఎ  సంబంధం లేదా ? 



 షాట్ గ్యాప్ లో సరదాగా .... వెంకట్రావు, భాగీరధ, దర్శకులు ఇంటూరి వాసు, బుచ్చి, మేనేజర్ సతీష్ లు 

         

          నిన్న సాయంత్రం హనుమాన్ జంక్షన్ లో నా 'గుడివాడ వైభవం' పుస్తకాన్ని పరిచయం చేసారు.  'రక్త కన్నీరు ' ఫేం దాసరి పూర్ణ - ఈ కార్యక్రమం చేసారు. అభయ ఆంజనేయ స్వామీ దేవాలయం పందిరిలో జరిగిన ఈ కార్యక్రమం  తరవాత ' రక్త కన్నీరు' నాటక ప్రదర్శన జరిగింది. 


                                                         వేదిక పై అమర్చిన బానర్ 



'గుడివాడ వైభవం ' పుస్తకాన్ని పరిచయం చేస్తున్న  దాసరి పూర్ణ , ఆలయ చైర్మన్, తదితరులు ఎడమ నుండి 3వ వ్యక్తి గా నేను.