My Blog List

Friday, June 22, 2012

175 వ ఎపిసోడ్ తో ముగియనున్న 'ఎదురీత'

175 వ ఎపిసోడ్ తో ముగియనున్న 'ఎదురీత'
ఈ విషయం తెలియచేయటానికి  చాలా బాధగా వుంది .   ఇందులో నటించిన  అందరి హృదయాలు బరువెక్కాయి. కాని తప్పదు  కదా ! ఎప్పుడో ఒకప్పుడు సీరియల్ ముగియవలసినదే!
ఈ సారి నేను షూటింగ్ కు వెళ్ళగానే 'నా ని ' కనపడ్డాడు. ఎంత సంతోషం కలిగిందో ! నాని అంటే మేకప్ మెన్ . నేను 'లయ' సీరియల్ లో వెంకట్రావు గా నటించినప్పుడు , నాకు మేకప్ వేసినది ఇతనే. చాలా అందంగా వేశాడని అనుకున్నారు అందరు.  పై ఫోటో లో మేకప్ చేస్తున్నాడు .


                                                  షాట్ గ్యాప్ లో సులోచన , నేను, సుగుణమ్మ
                                           మా మధ్య ఏమి జరిగిందో ముందుముందు చూడండి!


             మరో షాట్ గ్యాప్ లో శేషు, వీణ, సత్య , నేను.......... నా ప్రక్కన సత్య వాళ్ళ ఒరిజినల్ ఫాదర్


ఇంతకంటే ఎక్కువ ఫోటోలు పెట్టాలని లేదు. సీరియల్ అయిపోతోందని ............
మీ అభిప్రాయలు చెప్పటంలేదు..... ఈ సారయినా  చెప్పగలరు.

మీ
వెంకట్రావు
[తాతా  రమేష్ బాబు]
 

2 comments:

  1. నేనసలు టి. వి చూడను . అందులోనూ సీరియల్స్ అసలు చూడను . అనుకోకుండా ' రాధా- మధు ' ' లయ ''అమ్మమ్మా.కాం ' చూసాను . మూడూ ,చాలా నచ్చాయి .ఇది కూడా వారు తీసిందే కదా అని చూస్తున్నాను . చాలా నీట్ గా చాలా బాగుంది . అందరూ బాగా చేస్తున్నారు . కాకపోతే ఈ మధ్య కొంచం ఏదైనా డైలాగ్ చెప్పగానే ఒకరినొకరు చూసుకోవటం , పక్కకి తిరిగి నవ్వుకోవటం కాస్త ఎక్కువైనాయి .టి.వి సీరియల్స్ ధోరణి కి వచ్చేసిందే అనుకున్నాను :)కాని బాగానే వుంది . అప్పుడే ఐపోతుందనుకుంటే దిగులుగా వుంది.

    రాధ- మధు టీం తో వారే ఇంకొక యద్దనపూడి నవల సీరియల్ గా తీస్తే చూడాలని వుంది . మా ఈ విష్ మీరు , మా తరుఫున నిర్మాతలకు కాని , ఆజాద్ చంద్రశేఖర్ కు కాని చెప్పండి ప్లీజ్ :)

    ReplyDelete
  2. ఎదురీత గురించి ఇక్కడ రాసాను . మీకు వీలైనప్పుడు చూడగలరు .

    http://sahiti-mala.blogspot.in/2012/07/blog-post.html

    ReplyDelete