My Blog List

Thursday, July 12, 2012

భారతీయ సాంప్రదాయ తెలుగు "జానపద కళా చైతన్యయాత్ర" -కరపత్రం 1

భారతీయ సాంప్రదాయ తెలుగు "జానపద కళా  చైతన్యయాత్ర" -కరపత్రం 1
తెలుగు జానపద కళాకారులకు, కళాభిమానులకు, పరిశోధకులకు, భాష ప్రేమికులకు, చరిత్రకారులకు ,
సగౌరవంగా!
తెలుగు జానపద  కళలకు , తన రాజ్యంలో ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చిన శ్రీ కృష్ణ దేవరాయలు పట్టాభిషిక్తుడైన ఆగష్టు 9 వ తేదిన ...ఆ 'కళా సాహితీ సమరాంగణ సార్వభౌముడి'ని స్మరించు కుంటూ ....  నేడు అవసాన దశలో వున్న తెలుగు జానపద కళా సంపదను కాపాడుకొని మన చిన్నారులకు పరిచయం చేస్తూ,ప్రజలలో తెలుగు కళల, తెలుగు  సంస్కృతి పట్ల , తెలుగు బంధాల పట్ల అవగాహన కల్పించి మమతానురాగాలను తెలుసుకొని ఆరోగ్యకరమైన తెలుగు భారతాన్ని నిర్మించుకొనే దిశగా , తెలుగు ప్రజల కళా హృదయాలను మేలుకొలిపే ఒక కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతున్నాం.
గాన గంధర్వుడు 'ఘంటసాల', తెలుగు భాషను,  అంతర్జాతీయంగా పరిచయం చేసిన వెండి తెర వేలుపు  'నందమూరి తారక రామారావు', తన నటనకు పురుడు పోసుకున్న 'అక్కినేని నాగేశ్వర రావు',  చిత్రకారుడు 'ఎస్.వి. రామారావు' , నవరస నటన సార్వభౌముడు 'కైకాల',   జానపద కళాకారుడు యడవిల్లి  రమణ, మిరియాల శేఖర్ బాబు, కీ . శే. సున్నం వీరయ్య మొదలైన అనేక   జాతీయ అంతర్జాతీయ కళాకారులు జన్మించిన ,నడయాడిన కళలకు కాణాచి గా పిలిచే గుడివాడ అక్కినేని నాగేశ్వర రావు కళాశాల నుండి రాజమండ్రి  [జానపద కళాకారుల కాలని ] వరకూ ప్రముఖ జాతీయ జానపద కళాకారులు, జానపద కళా పరిశోధకులు, వివిధ రంగాల ప్రముఖులు, జానపద కళా సంస్కృతులకు వారసులైన యువతరం తో " జానపద కళా చైతన్య యాత్ర" నిర్వహిస్తున్నాం.
సమయం చాలా తక్కువ!
యాత్ర సాగే వివరాలు:
ఆగస్ట్ 9 న  గురువారం ఉదయం గుడివాడ, అంగలూరు,గుడ్లవల్లేరు, పెదన మీదుగా మచిలీపట్టణం. ఆ తరువాత కూచిపూడి,వుయ్యూరు, కంకిపాడుల మీదుగా విజయవాడ .
ఆగస్ట్ 10 న విజయవాడ నుండి గన్నవరం,చిన అవుటపల్లి , హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు . ఆ తరవాత తాడేపల్లి గూడెం , తణుకు.
ఆగస్ట్ 11 న  తణుకు నుండి రావులపాలెం,ధవళేస్వరం, మీదుగా రాజమండ్రి .
ఎంపిక చేసిన నగరాలూ, గ్రామాలలో పాదయాత్ర , మరియు బహిరంగ సభలు జరుగుతాయి. ప్రతిచోట 'జానపద కళలు ' ప్రదర్శన జరుగుతుంది.
ఈ సందర్భంగా ప్రముఖ రచయితలు, కళాకారులు, ప్రముఖులు యత్రలోను, సభలలోను ,'వీధి సమావేశాల'లోనూ పాల్గొంటారు.
కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో జరిగే ఈ యాత్ర లో ఆయా జిల్లాలలోని ప్రముఖుల పూనికను అనుసరించి ఈ కార్యక్రమం లో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. పూర్తి కార్యక్రమ వివరాలు మీకు ముందుగానే తెలియచేస్తాము.
ప్రపంచం లోనే మొదటిసారిగా సాంప్రదాయ జానపద కళల కోసం ప్రజల వద్దకు వెళ్లి ప్రదర్శిస్తున్న ఈ కార్యక్రమం లో కళా కారులు, కళాభిమానులు, తెలుగు భాషాభిమానులు, పాల్గొని విజయవంతం చేయాలని మా విన్నపం.
మరో విన్నపం:
ప్రజలలో సాంప్రదాయ జానపద కళల పట్ల, సంస్కృతి పట్ల అభిమానాన్ని రేకెత్తించటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ యాత్ర.
అన్ని రంగాలకు చెందిన ప్రజలను ఈ యాత్రలో సహకారాన్ని అందించ వలసినదిగా ఆహ్వానిస్తున్నాం. స్థానికంగా జరిగే కళాప్రదర్శన , పాదయాత్ర లలో తమతమ కళాశాలలు,  పాటశాలలు  నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనేలా చేయవలసినదిగా విద్యారంగాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ యాత్ర కి ప్రధాన లక్ష్యం 'యువతే'!.
యాత్ర నిర్వహణలో మీరు ఏదయినా ముఖ్య భాద్యత చేపట్టటానికి సిద్ధంగా వున్నారా? ఏదయినా ఒక అంశం స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తారా?
అవి ....
మూడు రోజులు ఒక బస్సుకు కిరాయి 50 ,000 వెల రూపాయలు. ఒక బస్సు లోని 40 మందికి ౩ రోజులకు టి, ఉపాహారం, స్నాక్స్ , భోజనం వగైరాలకు 16 000  వేల రూపాయలు. కరపత్రాలు, ఆహ్వానాలు, మైక్ ,ఫ్లెక్ష్,విడియో,ఫోటో,బద్గే,పోస్తాగే వగైరా 30 000 వేల రూపాయలు, 10 మంది జానపద కళా పరిశోధకుల  రవాణా చార్జీలు వగైరా 15 000 , ఒక బస్సులోని 40 మంది కి జ్ఞాపికలు ,శాలువలు, ప్రశంస పత్రాలు 20 వేలు,25 మంది జాతీయ జానపద కళాకారులకు ౩ రోజులకు 50 వేలు,పగటివేషాలు-సామాజిక అంశాలు పుస్తకానికి 35 000 వేలు. సావనీర్ కు 30 వేలు అవుతాయని ప్రాధమిక అంచనా.
ఇందులో ఏదయినా అంశానికి స్పాన్సర్ గానీ సావనీర్ కి ప్రకటనల రూపంలోగాని  అందించటానికి ముందుకు వస్తారా?
వెంటనే తెలియచేయ గలరు.
సంప్రదించ వలసిన చిరునామా :
తాతా రమేశ్ బాబు,  రచయిత, చిత్రకారుడు, రేడియో ,టివి నటుడు, జానపద కళాకారుడు.
గౌరవ అధ్యక్షులు
కళా భారతి
సాంప్రదాయ కళాకారుల సంక్షేమ సంఘం [రి.నెం. 426 /2009 ]
14 /161 -2 , స్టేషన్ రోడ్, గుడివాడ-521301 .కృష్ణా జిల్లా. ఆంధ్ర ప్రదేశ్.
సెల్ : 9441518715
ఈమెయిలు : rbtata60 @gmail.com

ఈ యాత్ర లో జానపదసూచనలు తెలియ చేయండి. ఇంద్రజాల ప్రదర్శన, అర్థనారీశ్వర, పిట్టలదొర, బుడ బుడకల ,చాత్తది వైష్ణవుల,వీర బాహు, మొదలయిన పగటి వేషాలతో పాటు తంబుర కథ, బుర్రకథ, యక్షగానం,బొమ్మలాట, జానపద పాటలు   మొదలయిన జానపద కళలు ప్రదర్శనలు వుంటాయి.
యాత్ర విజయ వంతం కావడానికి మీ సలహాలు ,సూచనలు తెలియ చేయండి.
             ఈ  అంతర్జాల కరపత్రాన్ని మీకు  తెలిసిన వారందరకు పంపి దిగ్విజయం చేయటానికి సహాయపడగలరు 


భారతీయ జానపద కళా సేవపరంగా
తాతా రమేశ్ బాబు





No comments:

Post a Comment