ఈ ప్రసంగాలు, 2010 సం . ఫిబ్రవరి 9 , 16 , 23 తేదిలలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారం అయినాయి. వారి సౌజన్యం తో ...........
గుడివాడ నాటక రంగం
ఒకటిన్నర శతాబ్దాల తెలుగు నాటక రంగ వనం లో విరబూసిన నటకుసుమం గుడివాడ నాటక రంగం. వెండితెర కంఠానికి తలుకులీనే తారలను ,నేపధ్య సంగీతానికీ,గానానికి అజరామరమైన స్వరాన్ని అలంకరించింది గుడివాడ. అందుకేనేమో దృశ్య శ్రవ్య కావ్యాలలో 'నాటకం' రమ్యమై గుదివాడను తన శిగలో తురుముకుంది, పౌరాణిక ,చారిత్రాత్మక ,సాంఘీక నాటకాలు ప్రదర్శించ టంలో ప్రత్యేకంగా నిలచింది. ఎంతో మంది నటులు ,నటీమణులు,సంగీత విద్వాంసులు, నృత్యకారులు,రచయితలు,చిత్రకారులు,జానపద కళాకారులు,నాటక సంస్థలు,డ్రామా డ్రెస్ కంపెనీలు,వివిధ వాయిద్య కారులతో సుసంపన్న మయి తెలుగు నాటక రంగాన మకుటాయమానం గా నిలచింది గుడివాడ.
కళలకు కాణాచిగా,కాకలు తీరిన నటులను అందించి కళామతల్లికి నీరాజనాలు సమర్పించింది. నటగాయకుదుగా అమర గాయకుడు ఘంటసాలను ప్రపంచ గాత్ర తోరణంగా ,మహా గాయకుడి గా అందించినా ,దాదా సాహెబ్ ఫాల్కిఅవార్డు గ్రహీత పద్మశ్రీ అక్కినేని నాగేశ్వర రావు చే రంగస్థల అరంగేట్రం చేయించినా ,నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యన్నారాయణ నటనకు నడకలు నేర్పించినా ,నట గేయ రచయితగా జాలాది కి బీజం వేసినా ,రేడియో ఏకాంబరం గా వి.సత్యన్నారాయణ ప్రసిద్దులు అయినా ,ఆయన నడకే నక్యత్యం గా భావ నాట్యానికి ఊపిరి పోసిన 'బాలభందు' బి.వి.నరసింహా రావు లాంటి కీర్తి గడించిన ఎందరికో పురుడు పోసి బుడి బుడి నడకల నటనను నేర్పి దిగ్గజాలు గా మలచింది గుడివాడ నాటక రంగం.
'అచట పుట్టిన నటులు ఏ పాత్రకు అయినా ఓడిగిపోవు' అన్నట్లు గా ,గుడివాడ నాటక రంగాన పురుషులు,స్త్రీ పాత్ర ధరించటం-స్త్రీలు పురుష పాత్ర ధరించటం మరో ప్రత్యేకత . అందరూ స్త్రీ లతో రంగూన్ రౌడి ,సతిసక్కుబాయి,రామాంజనేయ యుద్ధం,తదితర నాటకాలు ప్రదర్శించి ఇక్కడి నటీమణులు తమ నటనా సామర్ధ్యాన్ని 'ఔరా' అని చాటుకున్నారు.
కాగా,అక్కినేని నాగేశ్వర రావు,దేవరకొండ రామారావు ,బాలభందు బి,వి,నరసింహ రావు,తుమ్మలపల్లి సాంబశివరావు,దావులురి రామారావు, పెండ్యాల నాగేశ్వర రావు,మొదలైనవారు స్త్రీ వేషం కట్టి హొయలు ఒలికిస్తే,గుంటూరు కోమలి,పువ్వఅనసూయ,నాగరాజకుమారి,కోతిస్వరి,మొదలైనవారు పురుష వేషం వేసి దడ దడ లాడించారు.
పదకొండు ఏళ్ళ ప్రాయం లోనే అక్కినేని నాగేశ్వర రావు మాతంగి కన్య,లోహితాస్యుడు వేషాలు వేయించారు.కోడూరు అచ్చియ్య వీరికి గురువు, వై.భద్రాబాడి హరిచ్చంద్రుడు గా ,వీరి సతిమని అమ్మని బాయి చంద్రమతి గా నటిస్తుంటే చూడటానికి రెండు కన్నులు చాలేవి కావట.గుడివాడ దగ్గర రామాపురం లో జన్మించిన అక్కినేని గుడివాడ వచ్చి రంగస్థలం పయి నటించే వారు. సూరపనేని శోభన రావు రచించిన 'సత్యాన్వేషణ ' నాటకం లో అక్కినేని ఒక క్రిస్తావ యువతీ గా వేషం కట్టారు.దేవుడు ఎవరు? ఎక్కడ? అనే సంభాషణతో మొదలయ్యే ఈ నాటకం ఒక పల్లె లో ప్రదర్శిస్తుండగా తెర లాగే వాడిని తెలు కుట్టిన దట. ఒక గ్రామం లో ఆడుతుండగా ఒక గేదె మరణించిందట. దేవుడు లేదని చెప్పటం వల్లనే ఈ అనర్థాలు జరిగాయని అప్పటి ప్రజలు చెవులు కోరుక్క్కున్నారు.హర్మోనిస్ట్ మోటూరు వీర రాఘవయ్య చౌదరి అక్కినేని కి పద్యాన్ని పాడటం నేర్పించారట.
నటులు దావులురి రామారావు చంద్రమతి గా ఆడవేషం వేసేవారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత జాలాది నటిస్తూ ,పాటలు రాసి పాడే వారట. పంతొమ్మిది వందల అరవై రెండు లో కవిరాజ కళామందిరం లో కవిరాజ త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన ఖూని నాటకాన్ని ప్రదర్శించారు. కోడూరు అచ్చయ్య ,చల్లగుల్ల సుబ్బారావు ,వీరస్వామి తదితరులు నటించారు.
గుడివాడలో విద్యా రంగాన్ని అభివృద్ది చేయాలనే సంకల్పం తో అక్కినేని లక్ష రూపాయలు ఆర్ధిక వనరులను సమకూర్చి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల గా తీర్చి దిద్దటానికి కృషి చేసారు. రెండు వేల తొమ్మిది నవంబరు ఇరవై తేదిన అక్కినేని సంత వూరు రామాపురంలో అక్కినేని నట జీవితాన్ని ప్రతి బిమ్బించే చాయా చిత్ర శాశ్విత ప్రదర్శనను అక్కినేని చేతుల మీదుగా ప్రారంభించారు.
పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభయ్ ఆరు వరకూ గుడివాడ లో పలు నాటక ప్రదర్శన లలో ముఖ్య పాత్రలు ధరించారు కైకాల సత్యన్నారాయణ . ఆత్రేయ రాసిన ఎవరు దొంగ లో ఎస్సయి గా ,పినిశెట్టి రాసిన పల్లెపడుచు లో హీరో చంద్రం గా ,కొర్రపాటి గంగాధరరావు రాసిన బంగారు సంకెళ్ళు ,తెలుగు కోపం ,మొదలైన నాటకాలలో నటించారు. పంతొమ్మిది వందల దేభ్భయ్ ఆరు లో గుడివాడ కైకాల కల మందిరం నిర్మించటానికి ఇరవయ్ అయిదు వేల రూపాయలను ఆర్ధిక వనరులను అందించారు.
పంతొమ్మిది వందల ఇరవైతొమ్మిది స. లో ఆంధ్ర నాటక కలాపరిస్హాడ్ కార్యాలయం ,గుడివాడ శాఖ ను కాజ వెంకట్రామయ్య ,సిని నిర్మాత దుక్కిపాటి మధు సూధనరావు ,నట న్యాయ నిర్ణేత పోలవరపు సూర్య ప్రకాశరావు ,వైణికులు త్రిపురనేని శివ ప్రసాద రావు ,ఏర్రోజు మాధవా చార్యులు, మొదలైన వారు స్థాపించారు. ఈ కార్యాలయానికి ఆచార్య ఆత్రేయ కార్యదర్శిగా పనిచేసారు. ఆయన ఎందఱో నటీనటులకు శిక్షణ ఇచ్చారు .ఎన్జీవో ,ఎవరు దొంగ ,నాటకాలు రాసి ప్రదర్శించారు. పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లో ఆంధ్ర నాటక కల పరిషత్తు పోటిలలో ఎవరు దొంగ నాటకానికి ప్రదర్శన ,దర్శకత్వం, ఉత్తమ నటనలకు బహుమతులు వచ్చాయి .
పంతొమ్మిది వందల నలభయ్ ఆరు లో గుడివాడ లో నిర్వహించిన ఆంధ్ర నాటక కళాపరిషద్ సభలు చరిత్ర లో మైలురాయి గా నిలచాయి. ఏడు నాటకాలను ఎంపిక చేసి ఒతిలు నిర్వహించారు. పోటికి వచ్చన నాటకాలతో పాటు పిల్లలు ప్రదర్శించిన అనార్కలి నాటిక, కల్పకం అనే బాలిక నృత్యం,బోలోనాథ్-సరోజమ్మల రాధాకృష్ణ నృత్యం.,పాముల వాళ్ళ నృత్యం,ఒక బాలుడు ప్రదర్శించిన కథక్ నృత్యం ఏర్పాటు చేయడం విశేషం. పంతొమ్మిది వందల నలభయ్ నాలుగు లో పరిషత్ పునర్వ్యవస్తికరించటం వాళ్ళ నటులు ,న్యాయ నిర్ణేత పోలవరపు సూర్య ప్రకాశ రావు క్రియా శీలక పాత్ర ను పోష్ణ్చారు. పరిషత్ కార్యక్రమాలలో ,పరిషత్ పోటిలకు వచ్చన నాటకాలను ప్రాధమిక పరిశీలనలో ఎంపిక చేసే భాద్యత సమర్హంగా నిర్వహించారు. పంతోమ్మితి వందల ఎనభై మూడు పరిషత్ ప్రధాన కార్య దర్శిగా ఎంపికై పత్తేనిమిది స.లు ,ఆ పదవి లో వుంది ,పరిషత్ ప్రగతికి కృషి చేసారు.
ముదినేపల్లి నుండి గుడివాడ కు తరలి వచ్చిన ఎక్షెల్శియర్ నాట్య మండలి లో కోడూరి అచ్చయ్య దర్శకత్వం లో అక్కినేని,దుక్కిపాటి,సూరపనేని,సహా నటులుగా ఆశాజ్యోతి ,సత్యాన్వేషణ ,తెలుగు తల్లి నాటకాలలో శ్రీ పోలవరపు సూర్య ప్రకాశ రావు నటించారు.
పంతొమ్మిది వందల ఎనభై లో నందమూరి తారక రామారావు కలనగర్ పేరుతో గుడివాడ దగ్గరలో వున్నబిల్లపాడు గ్రామం లో యాభై ఏడు మంది కళాకారుల కు నూటయాభై గజాల భూమి ని పంచి ప్రభుత్వం కూడా గుడివాడ రంగస్థలానికి ప్రత్యేకత నిచ్చింది.
దాదాపు ముప్పై నాటక సంస్థలు ,వందల కిఒద్ది నటినటులు,దర్శకులు,ఎంతో మంది హార్మోనియం,మృదంగ ,తబలా ,డోలక్, కీబోఅర్డ్ ,వయోలిన్ ,కళాకారులు,మేకప్మెన్ లు ,రంగాలంకరణ,నేపధ్యగానం,లైటింగ్,కళాకారులు,డ్రామా డ్రెస్ కంపెనీలు,,సిని సెట్టింగ్ కంపెనీలతో అలరారి శోభాయమానంగా వెలుగొందిన గుడివాడ నాటక రంగం గురించి చెప్పలంటే మాటలు చాలవు. బొమ్మాలాట కళాకారులు ,జానపద కళాకారులు,వందకు పయిగా ,నేటికి తమ కళలను నముకొని జీవిస్తున్నారు.
గుడివాడ కు సమీపం లో వున్న బిళ్ళపాడు కళాకారుల కాలనీలో ,పగటి వేషాలు ,బుర్ర కథలు ,తంబుర కథలు,పౌరాణిక నాటకాలు, వీదినాటికలు మొదలైన కళలను ప్రదర్శించే కళాకారులు ఏభై మందికి పయిగా నేటికి వున్నారు. డెబ్బయి రెండేళ్ళ మిరియాల దురగా ప్రసాద్ వీరికి పెద్ద. అనువంశికంగా వస్తున్న కళలను కుటుంబ సభ్యులకు భోధించి పది బుర్ర కథ దళాలను ,మూడు వీధి నాటిక బృందాలను,ఎనిమిది పగటి వేష బృందాలను,మూడు దేవర పెట్టె బృందాలను,తయారు చేసి వృత్తి కళాకారులు గా జీవనం సాగిస్తున్నారు. రామపరశురామ ,భీమాంజనేయ యుద్ధం,రావణ బ్రహ్మ అంగదుడు,శ్రీకృష్ణ జాంబవంత యుద్ధం,మొదలయిన నాటకాలను వీధి లో ప్రదర్శిస్తారు .
మిరియాల శేఖర బాబు ,విశ్వనాథ బాబు,యదవిల్లి రమణ,మిరియాల రవితేజ,యదవిల్లి వీరయ్య ,మిరియాల ప్రశాంత్,యదవిల్లి దుర్గారావు,రమేశ్, మొదలయిన ఇరవై మంది కి పయిగా కళాకారులు ఈ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అరవై ఏళ్ళ కు పయిబడిన యడవల్లి తిరుపతమ్మ ,అచ్చమ్మ,మొదలైనవారు తంబురకత ను చెప్పటం లో ఘనాపాటి లు విజయవాడ ఆకాశవాణి, దూరదర్శన్ నుండి అనేక కార్యక్రమాలను సమర్పించారు.వీరి పగటి వేషాల గురించి నేను ఇంతకు ముందు ఆకాశ వాణి శ్రోతలకు ధారావాహిక ప్రసంగాల ద్వారా తెలియ చేసి వున్నాను.
పంతొమ్మిది వందల తొంభై సం.నుండి నేను, తాతా పప్పెట్ దియేటర్ స్థాపించి తొడుగు,కర్ర బొమ్మలు, మిశ్రమ బొమ్మాలు,తయారు చేసి, నాటికలు రాసి ప్రదర్శన లిచ్చాను. రంగస్థలం పయినే కాకుండా హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుండి ప్రదర్శనలిచ్చాను . దిద్దుబాటు,మొదటికే మోసం,నాన్నో పులి ,ఈ పనులు మా కొద్దు,లాంటి బొమ్మలాట నాటికలు ఎన్నో రచించి ప్రదర్శనలు ఇచ్చాను. బొమ్మలు తయారు చేయటం,రచన చేయటం,బొమ్మాల కదలికలు రూపొందించటం ,లో అక్కినేని కళా పీటం లాంటి సంస్థలలో కార్యశాలలు నిర్వహించాను. అనేక సంఘీక నాటకాలలో పలు పాత్రలతో పాటు ఆకాశవాణి,టివి నటుడు గా భిన్న పాత్రల్లు పోషించాను. లయ ధారావాహిక లో వెంకట్రావు పాత్రలో ,ప్రముఖ టివి లో నటిస్తున్నాను.
సాహిత్య,సంగీత ,శిల్ప,చిత్ర,వాస్తు కళల సమ్మేళనంగా బొమ్మలాట ను రూపొందించాను.
సినిమాలు,టివిలు వచ్చాక గుడివాడలో సంఘీక ,పౌరాణిక ,చారిత్రాత్మక నాటకాలు కుప్పకులిపోయాయి.పండగలప్పుడు,పందిల్లలోను,అడపా దడపా వీళ్ళ మీదా లేక్కిన్చాదగ్గ నాటకాలు మాత్రమె ప్రదర్శిస్తున్నారు. సమీపంలో వున్న పల్లెలలో ప్రదర్శించే నాటకాలు సినిమాకు అనుకరణలుగా, పాటలు, డాన్సులు, చిత్ర విచిరాలుగా ప్రదర్శించ బడుతున్నాయి. ఇందుకు గుడివాడ నుంచే సెట్టింగు డ్రామాల సప్లయ్ కపెనీలుగా సహకారం అందిస్తునారు. ఒక రకంగా పచ్చి రికార్డింగు డాన్సు ద్రామాలాయి పోయాయి. స్థానిక కళాకారులతో పాటు ,వీరికి నాయికలను ,సెట్టింగు లనుందించే కంపెనీలు నీలా మహల్ రోడ్డులోవున్నాయి .
పంతొమ్మిది వందల ఎనభై లో ప్రసాద్ సిని సెట్టింగ్స్, పన్థొమీది వందల తొంభై అయిదు లో భాష సిని సెట్టింగ్స్, ఇటివల పెద్దులు డాన్స్ పార్టీల లాంటివి ప్రస్తుతం పని చేస్తున్నాయి. మొత్తం పది మంది కధానాయిక లున్నారు. ఒక్కో కంపెనీ సం.లో ఏభై నుండి వంద దాకా నాటకాలకు కాంట్రాక్టు కుదుర్చు కుంటారు. ఒక్కో నాటకానికి పది నుండి ఇరవై వేల రూపాయిల దాకా మాట్లాడుకుని ,సంగీతం,స్టేజి దేకరేసన్ ,లిఘ్తింగ్, మేకుప్ వగైరాలను అందిస్తుంటారు. కధానాయికల నటనను బట్టి వెయ్యి నుండి రెండు వేల దాకా దక్కించుకుంటారు. చత్రపతి,రాణాప్రతాప్,నిప్పురవ్వలు,సూర్య సింహాలు,జగత్ కంత్రీలు,మొదలయిన నాటకాలు ప్రదర్శిస్తుంటారు ,ప్రస్తుతం ఈ కంపెనీల మీద ఆధారపడి మూడు వందల మంది కళాకారులు,కార్మికులు బ్రతుకు తున్నారని ప్రసాద్ సిని సెట్టింగ్స్ అధినేత టివి ప్రసాద్ చెప్పారు. కార్మికులు రెండు వందల నుండి మూడు వందల దాకా వేతనాన్ని ఇస్తున్నామని ,ప్రదర్శనలు లేని రోజుల్లో ఎదైనా కూలి కి వెళ్లి జివనానిసాగిస్తూ న్నారు.
గుడివాడ నాటక రంగాన్ని పరి పుష్టం చేసిన కిన్తమంది కళాకారుల గురించి తెలుసుకుందాం.
'బాలభందు' బివి నరశిహారావు : జననం: మరణం :
నటుడు,నాట్యాచార్యుడు,చిత్రకారుడు,బాల గేయ రచయితగా గుడివాడ పేరు ను దేశమంతటా చాటిన వీరి పూర్తి పేరు బాడిగ వెంకట నరసిహారావు . రంగస్థలం మీద స్త్రీ వేషధారణ చేయటం లో ప్రసిద్ద్లు లు పంహోమ్మిది వందల ముప్పయి నెండి పంతొమ్మిది వందల యాభయి ఎనిమిది వరకూ ఎనో ప్రదర్శన లిచ్చిన బివి గారి స్వగ్రామం కౌతవరం అయినా ,గుడివాడ లో స్థిర నివాసం ఏర్పరచుకొని కళాకారునిగా ప్రసిద్ది కెక్కారు.
అభినయం ,సంగీతం,చిత్రలేఖనం,వీరికి ఆజన్మసిడ్డం గా ప్రాప్తించాయి. తోటి పిల్లలతో కలసి ఆవూ పులి,హరిశంద్ర,ధ్రువ,మొదలయిన చిన్న నాటకాలు వేయడంతో ప్రారంభమయినది వీరి రంగస్థల జీవితం. గయోపాఖ్యానం లోని కృష్ణార్జునుల సంవాదాన్ని ,పరబ్రహ్మ శాస్త్రి గారు వేయించారు. ఇందులో అర్జునుడు గా బివి. పదిహేడు గజేంద్ర మోక్షం కథా గీతాన్ని ఆనంద భైరవి రాగాన్ని ,ఆటతాలం లో నేర్చుకొన్నారు. వీరికి రాచప్ప పాడిన 'మగదోచ్చి పిలిచెను' ,వనజాక్షి పాడిన 'ఓరోరి బండివాడ' పాటలు బాగా ఇష్టం. కూచిపూడి భాగవతుల యక్ష గానాలు,దేవదాసి నృత్యం, చూచిందే తడవు గా అభినయించేవారు. మినర్వా సంస్థ తీసిన 'అనార్కలి' ముకి చిత్రాన్ని నాటకంగా మలిచారు వింజమూరి వెంకట లక్ష్మి నరసింహారావు. ఇందులో అనార్కలి పాత్రకు బివి ని ఎంపిక చేసారు. కిలాంబికృష్ణమా చార్యులు వద్ద అనార్కలి నాట్య శిక్షణ తీసుకుంనారు బివి. ఈ నాటకాన్ని పంతొమ్మిది వందల ముప్పయి లో ప్రదర్శించి ప్రసంసలండుకున్నారు. వీరి వద్దే తులాభారం లో సత్య భామ ,రుక్మాంగదలో మోహిని,చింతామణి లో చింతామణి,పాత్ర్రా భినయాన్ని క్షుణ్ణంగా అభ్యసించి ప్రదర్శించారు. నాటకాల్లో వేషాలు వేసి ,నృత్య ప్రదర్శనలు ఇచ్చి సంపాదించిన డబ్బులు ఇంటికి పంపేవారు. పంతొమ్మిది వందల నలభయ్ లో మద్రాసు ఆంధ్ర సంగం లో వీరి సరసన సలీం గా బందా కనక లింగేశ్వర రావు గారు నటించారు. స్థానం నరశింహారావు ,బళ్ళారి రాఘవ,సిఎస్సార్ ,నగరాజారావు,కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య, మొదలయిన గొప్ప నటులతో కలసి ఎన్నో స్త్రీ పాత్రలలో నటించారు. క్షణం లో చీర సింగారించి కోవటం వీరి సొత్తు . సినీ నటి సావిత్రి కి నృత్య శిక్షణ ఇచ్చారు. అక్కినేనికి ఆడవేషాలు వేసే కాలంలో అభినయంలో శిక్షణ ఇచ్చరు. ఆంధ్ర జాలరి సంపత్కుమార్ వీరి ప్రశిష్యులు. శ్రీమాన్ నమ్మాళ్వారు కుమార్తె సత్యరంగా కు జానపద రీతులలో శిక్షణ ఇచ్చరు. అంతర్జాతీయ ఖ్యాతి పొంచిన కోరాడ నరసింహా రావు వీరికి ఏకలవ్య శిష్యులు. ఆచార్య ఖండవల్లి నిరంజనం సంకలన పరచిన 'సంగ్రహ ఆంద్ర విజ్ఞాన సర్వస్వం' లో వీరి వ్యాసం 'జానపద నృత్యాలు' ప్రకటించారు.
చల్లపల్లి,ముక్త్యాల, జయంతిపురం,బొబ్బిలి, వేగాయమ్మ పేట, సంస్థానాలలో జానపద నాట్యం చేసారు. బందరు టౌన్ హాల్ లో మునిమాణిక్యం నరసింహారావు వీరి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శనకు చిత్రకారుడు రచయితా అడవి బాపిరాజు వ్యాఖ్యాత. ఈ నాట్యం చుసిన జ్ఞానపిట్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యన్నారాయణ 'భావనాత్యం' అని పేరు పెట్టారు. పంతొమ్మిది వందల నలభయ్ నాలుగు లో బందరు నాటక కల పరిషత్తు లో స్థానం వారు బివి నాట్యానికి ముగ్ధులై బంగారు పతాక మిచ్చారు. ఎంకి పాటలు,కవి కొండల రావు జానపదాలు,బంద్గారి మామ పాటలు,ప్రాచీన జానపదాల తో పటు,భావగీతాలు అయిన శ్రీశ్రీ 'ఆనందం అర్ణవమైతే'కృష్ణ శాస్త్రి 'ఓహో వసంతా,దాసిగా నుండుట కయినా తగునా' తాపీ ధర్మారావు ,వేదుల సత్యన్నారాయణ శాస్త్రి గారి గీతాలతో ఏకబిగిన మూడు గంటల ప్రదర్శన ఇచ్చే వారు. ఈ నాట్యం ప్రత్యేక లక్షణాలను వివరిస్తూ ,'ఈ కళను నేను నేర్చుకొన్నది,ఇతరులకు నేర్ప్న్డీ, కవితా కల్పనా వైఖరి తోనే. నర్తక్నికి ముందు కవి హృదయం వుండాలి. లయ ఆయువు పట్టి ,అందం చిందించటం అభిమాన విషయం కావాలి. పాటలో జీవించాలి. భావ వ్యక్తీకరణకు ,సుకుమార అంగ భంగిమలకు ,వంగే శరీరం కలిగి వుండాలి' అన్నారు.
ఒకసారి వీరి నాట్యాన్ని చూసిన నార్ల వెంకటేశ్వర రావు ,నాట్య కలక్ను చేపట్టి ప్రచారం చేస్తే ,రాణించా గలవని చెప్పారు. పన్థొమీది వందల్ల యభైఎనిమిది నుండి నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ఆపేసి బాల రచయిత గా ఎదిగారు.
సామాన్య కుటుంబం నుండి బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎదిగిన బివి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లో ఉద్యోగ విరమణ చేసి గుడివాడ లో స్థిర నివాసం ఏర్పరచుకొని నృత్య,సంగీత, సాహిత్య, నటనల మేలవిమ్మ్పుతో మధుర జీవితాన్ని గడిపారు. బాలలకోసం బాలుడై ఎన్నో రచనలు బాలలకు అందించి 'బాల బంధు' గా సత్కరించ బడ్డారు. 'భారత కళా నిధి' గా బిరుదు పొందిన బివి ,ఆప్త మిత్రుడు గుడిపాటి వెంకట చలం శత జయంతి సభ కు అధ్యక్షత వహించేందుకు విజయవాడ పుస్తక మహోతవానికి వెళ్లి తీవ్ర అస్వస్థత తో పంతొమ్మిది వందల తొంబై నాలుగు జనవరి ఆరవ తేదిన గుండె పోతూ తో మరణించారు.
బుస్సీ దొరగారు అని పిలుచుకొనే 'మామిడాల వెంకట కృష్ణారావు :
గుడివాడ వాసవాంబ రైస్ మిల్లు లో ఎక్కౌన్తెంట్ గా పని చేస్తూ అనేక నాటకాల్లు ప్రదర్శించారు. 'సక్కుబాయి'లో కాశిపతి గా అమాయకత్వాన్ని ,రెండు రెళ్ళు ఆరు లో మధ్య తరగతి పెద్ద గా, పల్నాటి యుద్ధం లో బ్రహ్మ నాయుడి గా హుందాతనం ప్రదర్శించటం లో ఆరితేరారు.
ముఖ్యం గా వీరు 'బుస్సీ' కృష్ణా రావు గా ప్రసిద్ది చెందారు. బొబ్బిలి యుద్ధం లో 'బుస్సీ' పాత్రను సజేవం గా ప్రేక్షకుల ముందు ఉంచారు. బుస్సీ దొర కోటు ఎలా వేసుకోవాలి,సిగార్ ఎలా పట్టుకోవాలి,హుందా గా ఎలా నడవాలో ,చూడటానికి చల్లపల్లి జమిందారు శ్రేమంతు యార్లగడ్డ అంకినీడు ప్రసాద్, గుడివాడ కు వచ్చి వీరి నాటకాన్ని చుచేవారట. సహనటులు తుర్లపాటి రాధాకృష్ణ, నాజర్వాలి తదితరులతో ప్రదర్శించిన 'బుస్సీ' ,ఫ్రెంచి దొర ,మాట్లాడే భాష ఆంగ్లం,పైగా విదేశీయులు మాట్లాడే రీతిలో వుండాలి. నటనలో కుటిలత్వం ప్రదర్శించటంలో జీవించేవారు. 'బొబ్బిలి యుద్ధం ' నాటకాన్ని ఆంధ్ర ప్రదేశ్ అంతటా పలు ప్రదర్శన లిచ్చారు.
ఒకసారి ఒక పౌరాణిక నాటకం లో దుర్యోధనుని పాత్రను చూడవలసి వచ్చింది. ఆ పాత్ర దారి చూపులు నేలపైన ,చేతులు క్రిందకు చూపించ సాగారు. ఆ నాటక ప్రదర్శనా నంతరం ఆ నటుడ్ని గ్రీన్ రూం లో కలసి,'బాబు ,దుర్యోధనుని మనస్తత్వం నా అంతటి వాడు లేదు అనుకునేది,అందువల్ల ఆ పాత్రను ధరించి ప్రదర్శించే టప్పుడు ,చూపు గాని,చేతి తో చూపించేటప్పుడు కాని క్రింది వైపు కు వుందా కూడదు. ' అని చెప్పారు. ఇలా పత్రాల యొక్క అంతరంగాన్ని తోటి నటులకు చెప్పి అభినయాన్ని సూచించే వారు.
స్త్రీ పురుష పాత్రలకు మని కిరీటం గుంటూరు కోమలా దేవి :
వర విక్రయం నాటకం లో ఘంటశాల వెంకటేశ్వర రావు భ్రమరాంబ గా ఆడ వేషం వేస్తే ,అందులో కాళింది గా నటనారంగేత్రం చేసిన గుంటూరు కోమలా దేవి. యాభై ఏళ్ల గుడి వాడ నాటక రంగానికి నిలువెత్తు సజీవముర్తి . నాటకాలు ఆడాలంటే గుడివాడ లో నే ఉండాలనే ఉద్దేశ్యం తో పంతొమ్మిది వందల యాభై లో గుడివాడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని ,నేటి వరకు నాటక రంగంపై మక్కువతోనే, ఆ జ్ఞాపకాల తోనే జీవిస్తున్నారు. తన కుమార్తె పెళ్లి చేసిన తర్వాత,నాటకాల వాళ్ళంటే కుమార్తె బంధువు లలో వున్నా చిన్న చూపు తో ,ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని పంతొమ్మిది వందల ఎనభై లో త్యాగం చేసారు.
గుడివాడ కు చేరుకొన్న తొలి నాళ్లలో ప్రవాసం నాటకంలో వీరికి దేవరకొండ రామారావు అవకాశం కల్పిచారు.వీరితో పాటు దేవరకొండ రామారావు కూడా స్త్రీ పాత్రలు ధరించేవారు.'తెలుగు తల్లి' నాటకం లో భారతి వేషం వీరికి మంచి నటిగా పేరు తెచ్చి పెట్టింది. స్త్రీ ,పురుష పాత్రలు ధరించటం లో దిట్ట .కృష్ణుడు ,సత్యభామ ,చంద్రమతి ,సక్కుబాయి,వేషాలు వీరికి వెన్న తో పెట్టిన విద్య,'పల్లెపడుచు' లో రమాదేవి గా ,కైకాల సత్యన్నారాయణ హిరో చంద్రం గా అనేక సార్లు ప్రదర్శించారు.
1954 లో గుంటూరు లో జరిగిన అఖిల ఆంద్ర 'రంగూన్ రౌడి ' నాటక పోటిలలో పాల్గొని అన్నపూర్ణ గా నటించి ఉత్తమ నటిగా బహుమతి పొందారు ,ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జమ్మలమడక మాధవరాయ శర్మ ,మహాకవి జాషువా ,కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ,వ్యవహరించారు. పువ్వుల అనసూయ సత్యభామ గా ,వీరు శ్రీ కృష్ణుడు గా ,రంగపుష్ప సత్యభామ గా ,వీరు శ్రీకృష్ణుడు గా అనేక ప్రదర్శన లిచ్చారు . అం దరూ ఆడవాళ్ళ తో రంగూన్ రౌడి ,సక్కుబాయి, రామాంజనేయ యుద్ధం ,తదితర నాటకాలు ప్రదర్శించి పేరు తెచ్చుకొన్నారు. ఖిల్జిరాజ్య పతనం ,చంద్ర గుప్త ,నారాజు నారాణి, మొదలైన చారిత్రిక నాటకాలలో అద్భుతమైన నటన ప్రదర్శించారు.
ఆంద్ర దేశ మంతటా వీరు నాటకాలు ప్రదర్శించే రోజులలో ఏకబిగిన నెల రోజుల పాటు వివిధ ప్రదేశాలలో నాటకాలు వేస్తూ ,ఇల్లు చూడకుండా గడిపేవారు. ఇలాంటప్పుడు ఖైమా ఉండలు ,పిండి వంటలు చేసుకొని క్యానులలో పెట్టుకొని ప్రదర్శనలకు ప్రయాణించే దాననని చెప్పారు. సత్తెనపల్లి లో బుర్ర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సత్య భామగా ,వీరు శ్రీ కృష్ణుడు గా నాటకాన్ని ప్రదర్శించారు. వీరి భర్త శ్రీమన్నారాయణ గారు ,నాటకాల కాంట్రాక్టర్ గా వుండేవారు.
గుడివాడ కళాకారుల సమాఖ్య కార్యదర్శి గా వున్నపుడు ,సినీ నటి జమున గారితో మాట్లాడి కళాకారుల కాలనీకి 53 స్థలాలను ఇప్పించిన ఘనత వీరికే దక్కుతుంది
ప్రముఖ నటులతో కొన్ని వందల నాటకాలు ప్రదర్శించి ,మేటి నటిగా గుర్తింపు పొందిన వీరు ,75 ఏళ్ళ వృద్ధాప్యం లో కూడా ప్రభుత్వం నుండి ఎ విధ మయిన కళాకారుల పెన్షన్ అందటం లేదని చెప్తుంటే హృదయం చలింఛి పోయింది.
అలనాటి మేటి నటుడు
బొక్కా రాజేశ్వర వెంకట సత్యన్నారాయణఆంధ్ర నాటక రంగ చరిత్ర లో గుడివాడ నాటక రంగామికి ఎనలేని కీర్తి నార్జించి పెట్టిన అలనాటి మేటి నటుడు బొక్కా రాజేశ్వర వెంకట సత్యన్నారాయణ . అపర దుర్యోదనుడిగా ఖ్యాతి గడించారు. ఏడేళ్ళ ప్రాయం లో డాక్టర్ గా నటించిన నాటి నుండి రంగస్థలం మీద మక్కువ ఏర్పరచుకునారు .ఏడు దశాబ్దాలుగా పౌరాణిక ,సాంఘీక నాటకాలలో వందలాది పాత్రలు పోషించిన నటుడు.
సత్య హరిచ్చంద్ర లో విశ్వామిత్రుడు గా ,ఉద్యోగ విజయాలు లో దుర్యోధనుడుగా ,రేణుమహత్యం లో జమదగ్ని గా సేతాకల్యాణం లో రావణ బ్రహ్మ గా ,వెంకటేశ్వర మహత్యం లో బృగుడి గా ,కనక దుర్గమహత్యం లో వీరభద్రుడు గా ,రుద్రావతారం లో ప్రతి నాయకుడిగా ,రంగస్థలం మీద తనదయిన ప్రత్యెక ముద్ర వేశారు.
హరిచ్చంద్రుడి సత్యవ్రత నియమాన్ని పరీక్షించే విశ్వామిత్రుడు ,అతి కఠినం గా ఉండే నటనను ప్రదర్శించే టప్పుడు ప్రేక్షకులు విశ్వామిత్రుని నిందిస్తూ కర్రలు తీసుకుని రంగస్థలం పయికి వచ్చిన సందర్భాలు వున్నాయి. రంగస్థలంపై తానూ ప్రదర్శించే పాత్ర స్వభావాన్ని అర్థంచేసుకుని ,ఆ పాత్రని సజీవంగా రంగస్థలంపైకి తీసుకి వచ్చేవారు. గంభీరమైన కంట స్వరం తో ,భావా వేషంతో కూడిన పద్యాల్ని పాదతమ్లొనూ ,రసరమ్యంగా సందర్భోచితం గా పలికేవారు. వీరి నిండైన విగ్రహం ,వాచక ఆహార్యాలను ద్విగుణి కృతం చేసేవి. వేషాల వక్ష స్థలం ,నిండైన భుజాలు, విశాలమైన కళ్ళు ,ప్రత్యేక ఆకర్షణ గా ఉండేవి. తన పాత్రలకు తానె మేకప్ వేసుకునే వారు. 1944 లో దశిక వెంకటేశ్వర రావు వద్ద తబలా, డోలక్ నేర్చుకున్నారు . అనేక నాటకాలకే కాకహరికతలకు,ఖవ్వాలి లకు వాయిద్య సహకారం అందించారు. ఆ సమయంలోనే నటన ,విమర్శక చక్రవర్తి నందుల లక్ష్మి నారాయణ శాస్త్రి వద్ద హావ,భావ,నటనలను అభ్యసించారు. రావుల సుబ్బారావు వద్ద హార్మోనియం తో పటు ,పద్యాలు చదివే పద్దతి,పాటలు పాడే విధానం నేర్చుకున్నారు. రావణ బ్రహ్మ ,వాల్మికి మొదలైన ఏక పాత్రలు రచించి పోషించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వీరి రావణ బ్రహ్మ ఏకపాత్ర పలు సార్లు ప్రసారమైంది .భక్తి గీతాలు రాయటం లోను ,జ్యోతిష శాస్త్రం లోను ప్రవేశం ఉన్న వీరు,బి.వి.రంగారావు ,మల్లాది సూర్యనారాయణ ,జయరాజు,రేబాల రమణ,కాలపర్రు వెంకటేశ్వర్లు మొదలైన నటులతో నటించారు. కళా ప్రపూర్ణ ,నాటక ప్రవీణ బిరుదులతో సత్కరించ బడ్డారు.
తుమ్మలపల్లి సాంబశివ రావు
నటుడు,కళా ప్రోత్సాహకుడు సాంబశివ డ్రామా డ్రస్ కంపెని అధినేత.
No comments:
Post a Comment