'వికృతి' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
"వికృతి" నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనం, కృష్ణాజిల్లా హనుమాంజంక్షన్ లో జరిగింది. అందులో నేను చెప్పిన కవిత ఇది.
" ఉగాదీ,నువ్వొచ్చేస్తున్నావా?"
ఉగాదీ,నువ్వొచ్చేస్తున్నావా?
విరోధం లేదంటూ
వేషం మార్చుకొని వస్తున్నావా
కాదు,వికృతం గా దయ చేస్తున్నావా
ఓహో ,'వికృతి ' పేరుతో వస్తావా
అన్నీ తలకిందులయ్యాక వేంచేస్తున్నవా
నువ్వు వికృతం కాదు
నువ్వు వచ్చి చెసేదీ లేదు
'విరోధ ' మే 'వికృత ' మైంది
ఇప్పటికే ఇక్కడంతా
వికృతంగా ,విచిత్రంగా వుంది
ప్రతీ వ్యక్తికీ ఒక జేబు వుంది
ఆ జేబు లో ఒక 'జె ఎ సి ' వుంది
ఉద్యమం గాల్లో ఉంది
పోలీసు కాల్పులూ గాల్లోనే
విద్యార్థులు మాత్రం దుర్మరణం
పోలీసు విచారణలో ప్లాస్తిక్ బుల్లెట్లు
తిమ్మిని బమ్మి చేసే రాజకీయ అగచాట్లు
ఎవడెక్కడ ఎందుకు చచినా
ప్రాణ త్యాగమే ,స్వరాష్ట్రం కోసమే
మళ్ళీ వూరేగింపులూ ,రాస్తారోకోలు
మళ్ళీ గాల్లో కాల్పులు ,ప్లాస్టిక్ బుల్లెట్లు
చర్విత చరణం
ఇహ చూడు ఊ పే కు హ
చానెళ్ళలో సీరియల్ చర్చలు
స్పాన్సరింగ్ లో సొమ్ము చేసుకుంటూ
వేలికి వుంగరం తొడుక్కుంటూ
అదేమిటంటే
మీఇంటికొస్థా ,మీ గుమ్మంలో కొస్తా
అంటూ మీ వూర్లోనే చర్చ
ప్రత్యక్ష ప్రసారం షరా మామూలే !
పది దృశ్యాల మషాలా అద్ది
ఒక చానెల్ సత్యాన్ని వెలికి తవ్వి తీస్తే
మరో చానెల్ వెంఠనే సత్యాన్ని భూస్థాపితం చేస్తుంది
మధ్యే మధ్యే కామానందస్వామి లీలే ,రంజితేంద్రియే
అర్థరాత్రి దాకా వేచివుండనవుసరం లేదు!!
ఇంకా నయం
ఆలస్యంగా వచ్చావు సంతోషం
విధ్యార్థులు పరీక్షలు రాస్తున్నారు !
ఇంతలో అమ్మ బాషకు నూటయాభై కోట్లంట
ఎవరెంత బొక్కాలో ప్రణాలికల సిగ పట్లంట
మేమే ఏలికలం
అన్నిటికీ చీలికలం
ప్రజాసేవే పరమార్ధం
జనం నెత్తిన శఠగోపం
నేతల మద్యే రహస్య పత్రం
కుంటుపడింది అభివృద్ద్ది మంత్రం
వుద్యమాలు వికృతం అవుతున్నయి
బస్సులు బలౌతున్నాయి
ధరల కర్ర
సామాన్యుడి సిగపట్టి ,నడ్డి విరుస్తున్నాయి
ఈ దుస్థితిని బాగు చేస్తానంటే
నువ్వీ దేశం లో అడుగు పెట్టు
ఈ కల్లోలాన్ని కట్టు చేయగలిగితే
ఈ గడ్డ మీద కాలు పెట్టు
అయినా
ప్రతి ఉగాదికీ ఆహ్వానం పలికే కవిని
రావద్దంటం నాకెందుకూ
రా, వస్తే నీకు 'జె ఏ సి 'సభ్యత్వం ఇస్తారు
రాపాడి తాట తీస్తారు
మళ్ళీ అరవయ్యేళ్ళు దాక కనపడవు!
********* *********** ************
No comments:
Post a Comment