My Blog List

Saturday, February 13, 2010

మూడు: విప్లవ రుతువు -వచన కవిత-రెండువేల సంవస్త్సరంలో



విప్లవ రుతువు -
వచన కవితా సంపుటి

నవంబర్ పదకొండు రెండువేల సంవత్సరం లో విశాలాంద్ర దినపత్రిక లో డా. ద్వా.నా.శాస్త్రి రాసిన సమీక్ష

'కాలాన్ని పిండి నిజాలు పలికించేది కవిత్వం' అన్న స్పృహ గల అభ్యుదయకవి తాతా రమేశ్ బాబు . అణువు పగిలింది, పిడికిలి మొదలైన సంపుటాలు ప్రచురించినా ఈ సంపుటితో మంచి కవి గా వెలుగు లోకి వచ్చారు . 'పప్పెత్శౌ' వ్యాప్తి కి రాత్రింబవళ్ళు కృషి చేస్తూనే ,చిత్రకారుని గా సేవ చేస్తూనే కవిత్వాన్ని వదలక పోవడం విశేషం .
ఇందులో నలభయ్ ఒక్క కవితలు వున్నై . అనుభూతికి చెందినా కవితలు కొన్ని వున్నా -ఎక్కువగా సామాజిక పరిశీలన గలవే. సమాజం లోని వికరుతాలపయేధ్వజమెత్తిన తాతా కవిత్వంలో అధిక్షేపణ కుడా వుంది.
'వుహ వాస్తవాల
భాగాహారంలో
మిగిలిపోయిన శేషం లా
ఒంటరిగా నేనోక్కడ్ని
అయితేనేం
ప్రజలన్దరికీ వేలుగిస్తా
తురుపెతూ చూపిస్తా '
అనటంతో ఎవరివంతు వారు కృషి చేయాలని , నేను సైతం సమిధ నొక్కటి ఆహుతిస్తాను అనే ఆశయం వుండాలని కవి భోదిస్తున్నాడు . ఇటువంటి మేని కవితలు బాగున్నాయి . గడ్డిపోచలు స్రమదోపిదిని బంధించటానికి వుద్యమిస్తున్నాయి చూడామణి కళ్ళు తెరిపిస్తాడు.
'తిరగబడితే తరిగేదేముంది
గుండెలమీద గుచ్చు'కొనే '
రెండు బిల్లల బంగారం తప్ప '
అంటూ స్త్రీవాద కవిత రాసాడు.
మతవిద్వేషాల మీద కన్నెర్ర జేశాడు. జనంపదవాలు పోడుచుకోస్తాయ్ ,పాళీ విలన్ సిరా ను చేరచాలని వంటి కొత్త అభివ్యక్థీ వుంది. ఇందులో కొన్ని బాల గేయాలు వున్నై . అభివ్యక్తి పరంగా , శిల్ప పరంగా శ్రద్ధ వహిస్తే వచన కవిత్వం రాసే కవుల్లో మంచి స్థానం సంపాదిన్చుకోగాలరని ఈ సంపుటి సూచిస్తుంది. సమీక్ష కు వచ్చిన పుస్తకం లో కొన్ని కవితలు తలకిందులుగా ప్రచురించటం గమనిస్తాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్. ఆగష్టు,పదకొండు,రెండువేలు .
అందమైన పదబంధాలతో వచన కవిత్వం ,మినీ కవిత్వం రాయడం కవియొక్క మౌలికమైన ప్రతిభకు దృష్టాంతము . చెప్పే వస్తువుప్యే ఎంత నిబత్తత వుందో చెపుతున్న శైలి పయ్ కూడా అంతే జాగ్రత్త పడటం కవికి అవసరము. శ్రీ తాతా రమేశ్ బాబు కు రెండు వున్నై కనుకనే విప్లవరుతువు అనే మంచి కవితా సంపుటి వెలువడింది . స్వతహాగా చిత్రకారుదుఅయినమ్దున ప్రతి కవితకు రిదా చిత్రాలు గీసిపుస్తకానికి అందం పెంచారు. ఇందులో మినికవితలు,వచనకవితలు ,బాలకవితలు,పాటలు వున్నై. మినికవితా లక్ష్మనాలన్ని చక్కగా అధ్యనం చేసిన నగిషి మేనికవితలలో కనిపిస్తింది. సంక్షిపతట, బహులాఅథెఅసాథకథ, నవ్యబందురసైలి, శీర్షిక కవితలో ఉండక పోవడం వంటి అనేక లక్షణాలు ఆధున్నిక విమర్శకులు గుర్తించారు. అవన్నీ రమేశ్ బాబు మినికవిత లో వుండటం ప్రశంసనీయం. ఇందులో తొలి కవిత'ఇంద్రధనుస్సు'
ఎర్ర టోపీ
తెల్లపోపినదిగింది
'నన్నేమ్డుకుశాసిస్తావని'
తెల్లతోపి
చిద్విలాసంతో
'నాలో భాగానివి నువ్వు'-అంది!
ఇంద్రధనుస్సు లోని వర్ణమాల విబ్జియోర్ లోని ఎరుపు రంగు కుడా తెలుపు రంగులో భాగమే అనే శాస్త్రీయ సత్యాన్ని కవిత్వికరించడం విశేషం. శీర్షిక 'ఇంద్రధనుస్సు' అని పెట్టడంతోనే అర్థం చక్కగా గోచరిస్తింది.
'కట్న కల్యాణం' మంచి శక్తివంతంయ్న మినికవిత చూడండి.
ఆమె
తాలిబోట్టును చూశి
సిగ్గు తో తలావంచుకుంది
తాళిబొట్టు
ఆమె గుండెల్ని
బలంగా తన్నింది
స్త్రీ వాడ ధోరణి పుష్కలంగా వున్నా ఈ మినికవితలో కవి వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పట్టిస్తుంది. మంచిచిత్రాలతో చక్కటి పద చిత్రాలతో సాగిన ఈ కవితా సంపుటి లో వాగాకామ్బర ముసుగు, విప్లవతిగేలు వంటి వైరి సమాసాలు పరిహరిస్తే ఎంతో బాగుంటుంది .

No comments:

Post a Comment