My Blog List

Sunday, February 14, 2010

శుభాకాంక్షలు ,అభినందన పత్రాలు-రెండువేల ఏడు

ఇరవై ఎనిమిది డిసెంబర్ ఆంద్ర భూమి దినపత్రిక లో ఈ పుస్తక ఆవిష్కరణ విశేషాలు ప్రచురించింది .చదవండి .

విద్యార్థులలో నిబిదిక్రుతం అయన కళాసక్తిని బహిర్ఘతం చేసినందుకు ఆనందంగా వుందని గుడివాడ మున్సిపల్ కమిషనర్ గొట్టిపాటి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మునిసిపల్ కౌన్సిల్ హాల్లో ప్రముఖ రచయిత తాతా రమేశ్ బాబు రూపొందించిన 'శుభాకాంక్షలు ' పుస్తకావిష్కరణ మహోత్సవం లో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులలో సృజనశక్తిని ,కలాహృదయాన్ని వేలికితియాల్షి ఉందన్నారు. సాధారణంగా బర్తడే ,మదర్స్ డే ,ఫతేర్స్ డే , వాలంటైన్స్ డే లాంటి సందర్భాలను శుభాకాక్షాల ద్వారా తెలియచేసుకున్తామన్నారు. ఈ పత్రాలను ఎంపిక చేసుకోవటానికి ప్రత్యక మయిన శ్రద్ధ ,సమయాలను కేటాయిష్తు ఉంటామన్నారు. ఈ పత్రాల తయారికి సంబందించిన ఆధునిక సంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. అయినప్పటికీ చేతులతో తయారు చేసిన శుభాకంక్షల పత్రాలు కు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఈ దృష్ట్యా రంగులు కుంచెలు వుపయోగించి శుభాకంక్షల పత్రాల త్తయారి లో విద్యార్థుల కు శిక్షణ ఇవ్వడం అభినందనియమని ఈ సందర్భం గా 'శుభాకాంక్షలు' పుస్తకాన్ని రూపొందించిన రమేశ్ ను కమిషనర్ శ్రీనివాసరావు అభినందించారు. సభ కు అధ్యక్షత వహించిన మునిసిపల్ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు మాట్లాడుతూ తక్కువ ఖర్చు తో విద్యార్ధులు రుపొందిచిన శుభాకంక్షల పత్రాళ్ళు ఎంతో ఆహ్లాదం గా ఉన్నాయన్నారు .తమ ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్య శాల శిక్షకులు తాతా రమేశ్ అభినందనియుదని కొనియాడారు .ఉదయం జరిగిన శుభాకంక్షల పత్రాల కార్యశాలను చైర్మన్ లంకదాసరి ప్రారంభించారు. మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యుడు యలవతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని పురపాలక సంఘ పాటశాలల విద్యార్థుల కిసం రూపొందించి నిర్వహించడం ద్వార గుడివాడ పురపాలక సంఘం ,కలవనరుల కేంద్రం తమ ప్రత్యకతను ప్రదర్శించాయని అన్నారు.

పుశాకాన్ని రూపొందించిన రమేశ్ బాబు మాట్లాడుతూ పాటశాలల్లో చిత్రలేఖనానికి సముచిత స్థానం లేదన్నారు. ఈ లోటు భట్ర్తి చేయడానికి కలవనరుల కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అబినందనియమని అన్నారు. ప్రతి ఏటా విద్యార్థులకు సెలవు దినాలలో చిత్రకళా ను నేర్పిస్తున్నమన్నారు. ఇందుకోసం అయిదు పుస్తకాలను ప్రచురించా మన్నారు. మొత్తం ఏభయ్ మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కర్యసలలో విద్యార్థులు శుభాకంక్షల పత్రాల ప్రదర్శన జరిగింది.

No comments:

Post a Comment