My Blog List

Tuesday, December 27, 2011

వ్యర్థానికో అర్థం

వ్యర్థానికో అర్థం 
              ప్రత్యేక సందర్భాల్లో ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలపటం మన సంస్కృతి . మూడు రోజుల్లో రాబోయే నూతన సంవత్సరానికి వినూత్నంగా  శుభాకాంక్షలు తెలపటానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వ్యర్థంగా పారవేసే వాటితో అందంగా గ్రీటింగ్స్ తయారుచేస్తే..... పైసా ఖర్చు లేకుండా ..... మనకు తృప్తి  .. అందుకున్నవారికి సంతృప్తి  కదా!
              మరీ ముఖ్యంగా ఆ కార్డులను తయారు చేయటానికి ఉపయోగించే నూతనత్వం , తీసుకున్న వారు పొందే ఆనందం -వెరసి ఇరువురి మధ్య 'అనుబంధం ' పదిలమవుతుంది కదా!
               ఉదాహరణకి 
               సాధారణంగా  పెన్సిల్ చెక్కిన తరువాత ఆ చెక్కుడును పారవేస్తాం . కానీ ఆ వ్యర్థం తో అందమైన గ్రీటింగ్ తయారు చేస్తే ,పై విధంగా వుంటుంది.
                ఇలా చేయటానికి చిత్రకరులే కానవసరం లేదు కుడా . నీటి రంగులు తీసుకుని  ఒక్కో రంగు మీద చూపుడు వేలు తో అద్ది .... ఆ రంగును పువ్వు ఆకారం లో అద్దితే  . అందమైన చిత్రం .
                రకరకాల రంగుల ముఖమల్ పేపర్  ముక్కలను ఒక పద్దతిలో పేర్చితే మరో బొమ్మ 
                 కత్తిరించి పారవేసే ఎలాంటి కాగితాలను అయినా ,ఒకే రంగు కాగితాన్ని ఆయినా ....పారవేసే  నోట్స్ అట్ట పైన  అంటిస్తే ........
                వార్త పత్రికలలో ముద్రించిన 'పువ్వు' బొమ్మను కత్తిరించి ,ఒక  కాగితం మీద పెట్టి ఆ బొమ్మ అంచుల మీద పెన్సిల్ తో రుద్ది ,చూపుడు వేలితో కాగితం మీదకు రాసి , కత్తిరించిన పువ్వు బొమ్మను తెసివేస్తే  మరో సృజన.
                 మనం నిత్యం పారవేసే రకరకాల అట్టలను కత్తిరించి అంటిస్తే . ఆ తరవాత స్కెచ్  పెన్తో  తీర్చి దిద్దితే !ఒక నవ్వుల బొమ్మ .
                 వ్యర్థ కాగితాన్ని తీసుకొని రంగులు చల్లి , మధ్యకు మడతవేసి తీస్తే, చిత్ర విచిత్రమైన ఆకారాలు పరచు కొంటాయి . వాటిని సీతాకోక చిలుక లాంటి ఆకారాలలో కత్తిరించి ,వివిధ కొలతలతో పేరిస్తే .....
                 ఇలా ఎన్నయినా చేయవచ్చు. మనలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి  అబ్బుర  పడనువచ్చు.ఆత్మీయులను ఆనందంలో ముంచవచ్చు.
                 నవ్యతతో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించటానికి కాస్త తీరిక చేసుకొందమా !   






 

Saturday, December 24, 2011

త్రిపురనేని మహారధి జ్ఞాపకాలు నా కవిత్వ నేపధ్యం లో

2007 సం.లో విజయవాడ లో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహకులలో ఒకడిగాఎంతో మంది లబ్ధ ప్రతిష్టులతో మాట్లాడటం , మరెంతో మంది నిర్వాహకుడిగా, కవిగా గుర్తించటం జరిగింది. అక్కడే 'మహారధి' గారితో వ్యక్తిగతంగా నాకు పరిచయ మయినది. నాది గుడివాడ అనగానే దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు . తరవాత అప్పుడప్పుడు ఫోనులో మాట్లాడుకునే వాళ్ళం . నేను రాసిన 'నా దేశం ' దీర్ఘ కవిత పంపాను. అది చదివీ బహుళ ఆశీస్సులు ఇస్తూ, ద్వితీయ భాగాన్ని రాయమని ,అందుకు అవసరమయిన స్ఫూర్తి కొరకు ధ్యానం చేయమని రాసారు. వ్రాత ప్రతిని పంపితే తానే ముందుమాట రాస్తానని కూడా రాసారు. ఇంతలోనే ఆయన మృతి చెందటం నాకుతీరని లోటు.
'నా దేశం ' దీర్ఘ కవితలో 'త్రిపురనేని మహారధి' గారు స్పందించిన తీరు చదవండి.

'నీరసంగా గుంపులు గుంపులు గా
నుదుట పట్టిన చెమట బిందువులో
సూర్యుడు '
మహారధి : గొప్ప భావం , శ్రమశక్తి కి పట్టాభి షేకం
'రా మిత్రమా,
కరిగిపోయిన జ్ఞాపకాలను త్రవ్వు కుంటూ
శ్రమించిన
స్పర్శలో ఊరడింపును వెతుక్కుందాం
రా నేస్తమా
ఒకానొక అణచరాని సామాజిక కసిలో
విరిగిపోయిన అవయవాలను అతికించుకుంటూ
ధైర్యాన్నిచ్చిన
జీవితానికి కృతజ్ఞత చెప్పుకుందాం
రా దోస్త్
ఒకానొక రస్తాపై రేగిన అలజడిలో
సమకాలీనతను సాధించుకుంటూ
చైతన్యాన్ని
భవిష్యత్తుకు బహుమతిగా ఇద్దాం
రా కామ్రేడ్
ఒకానొక కొలిమిలో మండిన ఇనుములా
దగ్ధమై
ఆయుధంగా మారిపోయే
ఉద్యమాన్ని ఆహ్వానిద్దాం'
మహారధి : ఓహో ! ఇక్కడ ఆరంభ మైంది మహత్తర ఆశావహ దృక్పధం . ఇది విప్లవాగ్ని
'బడిని చూస్తే
ఆటపాటల అందాల తోటలై
నవ్వుల కేరింతల రంగుల హరివిల్లులై
విజ్ఞాన వికాసాల అంతరిక్షం లో విహరిస్తూ
చెంగున దూకే బాల్యం ఉంటుందనుకున్నా
.............................................................
ఇప్పుడు
బడిని చూస్తుంటే
మోయలేని భారాన్ని భుజాలకెత్తుకొని
నడుము వంగి శక్తులుడిగిన
వెట్టి చాకిరీల వృద్ధాప్యం ఉంది '
మహారధి : కళలు కనే కాలం యోధుడా ! నీ కలల బరువుని కాలమే మోస్తున్నది.
' ఒక ధాన్యపు గింజను విత్తి
వంద గింజలను పండించటమే
ప్రతి సృష్టి
ఒక నిజాన్ని ఎలుగెత్తి
వంద నిజాలను నినదించటమే
పోరాటం '
మహారధి : శెభాష్ ! ప్రకృతి సత్యాన్ని ఆవిష్కరించావ్ : అద్భుతం -
' అక్షరాన్ని మీటినా
చెదిరిన జీవన గమ్యమై
ఒక దుఖ్ఖాన్ని ఆలపిస్తుంది'
మహారధి : అందని ఆకాశాన్నే కాదు అడుగు లేని పాతాళాన్ని కూడా దర్శించావ్
'మౌన పోరాటాలతో తడారిన మనసు
చెరిగిన విశ్వాసమై పగుళ్ళిస్తుంది
నువ్విదే సరైన దారనుకుని
వెర్రిగా ఓడిపోవటానికి అలవాటు పడతావు '
మహారధి : బలహీన వర్గాల బలహీనపు ఆలోచనలకు అద్దం
"పగుళ్ళని పద్యాలతో అతికిస్తు "
మహారధి : ఆఖరి శ్వాస వరకూ ఇలాగే అతికించు
'బాబూ నాయనా.....
నువ్వూ మనిషి వేగా
అమ్మానాన్నలకు పుట్టినోడివేగా
తల్లి పాలను తాగి ఎదిగిన నీ నాలుకను
రెండుగా చీల్చి విష నర్తనం చేయిస్తావేం
బాల్యంలో లేని కాఠిన్యాన్ని
మొఖానికి వికృతంగా పులుము కుంటావేం ?
నీచానికయినా దిగజారే మృగత్వాన్ని
శరీరానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తావేం'
మహారధి : అబ్బ! ఎంత కసి ! ఇదే కావాలి కవికి
'రాత్రంతా బీటు వేసిన వెన్నెల నేత్రాలు
చింత నిప్పులై ఉదయాన మొలుచు కొచ్చినప్పుడు
ఒక దుఖాన్ని దిగమింగుకొని
పెదాలపై పలవరించే భవిష్యత్ స్వప్నాలను
నిజం చేసుకో '
మహారధి : శ్రీ శ్రీ గడపిన నిద్ర లేని రాత్రులా ?
'నిజం దర్శించలేని ఇజం
నీలో లేకపోతే
కోపం సంతోషం బాధ
స్పందన ప్రదర్శించలేనితనం
నీలో ఇంకి పోతే
మళ్లీ
తల్లి గర్భం లోకి ప్రయాణించు
తొమ్మిది మసాల చైతన్యాన్ని
తనివి తీరా అనుభవించు '
మహారధి : వాహ్ ! నవ్యత్వానికి నాంది . ఎంత హుందాగా ఉండాలో గొప్పగా చెప్పావ్ !


'

Friday, November 25, 2011

'మన ఊరి కథ '-తరతరాల చరిత్రకు అక్షర రూపం

తరతరాల చరితకు అక్షర రూప శిల్పుల పరిచయం -
'మన ఊరి కథ ' గా ఈరోజు ఈనాడు దిన పత్రిక లో ప్రచురించిన విషయాన్ని పొందు పరుస్తున్నాను.ఇందులో గుడివాడ, మచిలీపట్టణం , హనుమాన్ జంక్షన్ ల రచయితలను పరిచయం చేసారు.' గుడివాడ వైభవం ' పుస్తకాన్ని రాసింది నేనే నని మీకు తెలుసు. మీ అభిప్రాయాన్ని తెలియ చేయండి.

Sunday, November 20, 2011

"తెలుగు నిండుగ వెలుగు "


ది. 20.11..2011 న ఈనాడు దినపత్రిక కృష్ణా జిల్లా 8 వ పేజి లో "తెలుగు నిండుగ వెలుగు " శీర్షిక తో నా తెలుగు సాహిత్యం గురించిన వ్యాసం ప్రచురించింది. అది ఇక్కడ జత పరుస్తున్నాను.

Wednesday, November 2, 2011

సాహితీ ప్రియులకు , సాహితీ వేత్తలకు నమస్కారం.
"జ్ఞాపిక " తర తరాల గుడివాడ ప్రాంత శత కవితా సంపుటి ముద్రణ పూర్తి అయింది.
ఇందులో పదునాలుగవ శతాబ్దం నుండి నేటి వరకూ వందకవుల కవితలు ,వారి వివరాలు చేర్చటం జరిగింది.
నాటి కవులలో మాడయ్య కవి, దగ్గుపల్లి దుగ్గయ్య ,మాడయ్య గారి మల్లన ,సిరిప్రగడ ధర్మన్న, తుమ్మల పల్లి నాగభూషణం,దిట్టకవి రామచంద్రుడు, ఉప్పులూరి కనకయ్య, దాసు శ్రీరాములు , మొదలైన వారు.....
నేటి కవులలో పద్మశ్రీ అక్కినేని నాగేశ్వర రావు ,త్రిపురనేని రామస్వామి, గుడిపాటి వెంకట చలం, విశ్వనాధ సత్యనారాయణ , నార్ల వెంకటేశ్వర రావు , జోసుల సూర్యనారాయణ మూర్తి, బాలబందు బి.వి .,చలసాని ప్రసాద్, రుద్రజ్వాల, కే.జి. సత్యమూర్తి, అనామధేయుడు, ఆత్రేయ, వేలూరి,కాటూరు, జాలాది, ఏర్రోజు ,నండూరి, ద్వానా శాస్త్రి, పద్మశ్రీ ఎస్.వి. రామ రావు, మొదలైనవారు.....
రేపటి కవులలో తాతా జ్ఞాపిక { బి.ఇ, రెండవ సంవత్సరం}, తాతా అనామిక { బి.వి. ఎస్.సి , మొదటి సం. } చుక్కా నాగ దుర్గా ప్రసాద్ {పదవ తరగతి}, జేబు శ్వేతా పద్మావతి{పదవ తరగతి},తాతా వెంకటేశ్వర రావు {పదవ తరగతి}, వెలగడ పార్వతి {పదవ తరగతి} మొదలైన వారు ......
వెరసి వందమంది కవుల కవితలు ప్రచురించడం జరిగింది. డెమ్మీ సైజు లో నూట అరవై పేజీలతో పుస్తకాన్ని , పూర్తి రంగులలో అట్టను తొడగటం జరిగింది. అట్ట మీద ,వెనుక తైల వర్ణ చిత్రాలను నేను చిత్రించాను.

ఈ పుస్తకాన్ని ప్రత్యేక పద్ధతి లో ఆవిష్కరించాలని ఆలోచన .
అయితే ఎలా చేస్తే క్రొత్తదనం గా వుంటుంది? దయచేసి తెలుపగలరు.

Sunday, July 31, 2011

గుడివాడ వైభవం -ఆవిష్కరణ ఫోటో లు

జనగణమన తో సభ ముగింపు
జానపద కళాకారులు మిరియాల శేఖర్ బాబుబృందం తో యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ,తాతా రమేశ్ బాబు,ఎర్నేని వెంకటేశ్వర రావు
రచయిత తాతా రమేశ్ బాబు ప్రసంగం

పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రసంగం
గుడివాడ వైభవం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్



సభాధ్యక్షులు ఎర్నేని వెంకటేశ్వర రావు తోలి పలుకులు
సభను ప్రారంభిం చేముందు ప్రార్థన గీతం
సభకు స్వాగతం పలుకుతున్న ఏ.ఎన్.ఆర్.కళాశాల ప్రిన్సిపాల్
సభ ప్రారంభానికి ముందు దేశభక్తి గీతాలు ఆలపిస్తున్న మిరియాల శేఖర్ బాబు బృందం
సభకు వచ్చిన వివిధ వర్గాల ప్రజలు
సభ ప్రారంభానికి ముందు గా గుడివాడ చరిత్రను గురించి విద్యార్థులతో ముచ్చాతిస్తున్న తాతా రమేశ్ babu
నవ యుగ వైతాళికుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి కళా వేదిక
విద్య కళా పోషకులు కాజ వెంకట్రామయ్య ద్వారం

Thursday, June 30, 2011

"జ్ఞాపిక" కవిత సంకలనం కోసం

మిత్రులకు
నమస్కారం.


కవితా సంకలనం కోసం ప్రకటన

గత శతాబ్దాల ఆంధ్ర దేశాన్నిప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులంతా ,గుడివాడ పరిసర ప్రాంతాలలో పుట్టారనేది ఒక చారిత్రక సత్యం. ఇక్కడి సాహిత్య రంగం విజయ పదాన పయనిస్తూ ,యువత భవితకు బాటలు పరచి వెలుగు నింపిందన్న విషయం లోక విదితం . అందుకే ఈ ప్రాంత "మొదటి కవితా సంకలనం " గా " నాటి-నేటి- రేపటి " కవుల కవితలను "జ్ఞాపిక" పేర తీసుకు వస్తున్నాను.
గుడివాడ ,మరియు పరిసర ప్రాంతాలకు చెందిన కవులు ప్రస్తుతం ఎక్కడ వున్నా వారి కవితలు ఈ సంకలనం లో ప్రచురిస్తాను.. ఈ ప్రాంత కవుల "మొదటి కవిత సంకలనం " గా వెలువడనున్న "జ్ఞాపిక" ను మన హృదయాలలో ఒక జ్ఞాపకం గా పదిల పరచేందుకు అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను.
సంకలనం కోసం కవితలు పంపే వారికీ సూచనలు :
1 . కీర్తి శేషులయిన కవులచే రచింపబడిన ముద్రిత,ఆముద్రిత కవితలను "నాటి కవుల "విభాగంలోనూ
2 .ఈ సంకలనం కోసం రచించిన ప్రస్తుత కవుల కవితలను "నేటి కవుల " విభాగం లోనూ
3 .యువకులు,పాఠశాల ,కళాశాల విద్యార్థులు, యువకవులు రాసిన కవితలు "రేపటి కవుల" విభాగం లోనూ ప్రచురించ బడతాయి.
4 . ఈ సంకలనం లో చేర్చుకొనే కవితల తుది నిర్ణయం నాదే
5 . ప్రచురించిన ప్రతి కవికీ ,ఈ పుస్తక ఆవిష్కరణ సభ లో గౌరవ పారితోషిక సత్కారం వుంటుంది.
6 . కవిత శీర్షిక ,కవిపేరు,రచనా కాలం ,పుట్టిన తేది,వూరు,తల్లిదండ్రులు,ఫోటో ,రచనలు,ప్రోత్సాహకులు,చిరునామా (సెల్ నే.,ఈమెయిలు ) పంపాలి
హమిపత్రం
............................అను శీర్షిక గల కవితా ను స్వయంగా రచించాను. "జ్ఞాపిక" కవితా సంకలనం కోసం ప్రచురనర్థం పంపుతున్నాను. ఈ కవిత దేనికి అనువాదం ,అనుసరణ కాదని, ప్రచురణకి ఎవరికీ పంపలేదని హామీ ఇస్తున్నాను. పై వివరాలు యదర్ధములని ధ్రువీకరిస్థున్నాను
అనే హామీ పత్రం జత చేసి ది. 05 .08 . 2011 , శుక్రవారం లోగా క్రింది చిరునామా కు పంప కోరుతున్నాను. ఆ తరువాత స్వీకరించా బడవు
ఇట్లు
సాహిత్య సేవ పరంగా
తాతా రమేశ్ బాబు
14 -161 -2 ,స్టేషన్ రోడ్, గుడివాడ-521 301 ,కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
సెల్:9441518715 ,email :rbtata60 @gmail .com

Saturday, June 25, 2011

గుడివాడ వైభవం -ఆవిష్కరణ ఛాయాచిత్రం

ఈ ఫోటో లో ఎడమ నుండి కురుమద్దాలి సుధాకర్ ,కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు, తాతా రమేశ్ బాబు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, ఎర్నేని వెంకటేశ్వరరావు ,పర్వతనేని నాగేశ్వర రావు.

" గుడివాడ వైభవం " పుస్తక ఆవిష్కరణ విశేషాలు

"గత కాలపు అనుభవాలు,జ్ఞాపకాలు,సంఘటనల సమాహారమే చరిత్ర " అని ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడెమీ చైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. ఈ నెల ఇరవైన సోమవారం గుడివాడ క్లబ్ ఆవరణ లో , విద్యా,కళారంగ పోషకులు కాజ వెంకట్రామయ్య ద్వారం లోపల ,నవయుగ వైతాళికుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి కళా వేదిక పై తాతా రమేశ్ బాబు రచించిన "గుడివాడ వైభవం" పుస్స్తకాన్ని ఆవిష్కరిస్తూ పై విధంగా స్పందించారు. అనంతరం మాట్లాడుతూ,పుస్తక ఆవిష్కర్త తానై నందున తాను మాత్రమే ఆవిష్కరిం చానని ,వేదిక పైనున్న అందరికి పుస్తకాలు ఇచ్చి చూపిస్తే అది సాముహిక ఆవిష్కరణ అవుతుందని ,సినిమా వాళ్ళు కాసేట్ రిలీజ్ చేస్తూ అందరి చేతుల్లో ఉంచే చెడ్డ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. జ్ఞానపీట్ అవార్డ్ గ్రహీత ద.సి.నారాయణ రెడ్డి గారి అంక్ష ఏమిటంటే గ్రంధావిష్కరణ ఎవరూ చేస్తే వారు మాత్రమే ఆవిష్కరించాలని .....పురోహితుడు మంత్రాలు చదువు తుంటే పెళ్లి కుమారుడు మాత్రమే తలి కట్టాలని,మిగిలిన పేదలు అక్షతలు వేయలే గానీ తాళి పట్టుకో కూడదని చమత్కరించారు.


కొన్ని థ్రిల్లింగ్ విషయాలు చెపుతా నంటూ .." యాభై సంవత్సరాల క్రితం ౧౯౬౧ లో అక్కినేని నాగేశ్వర రావు మొదటి సరిగా అమెరిక వెళ్లి వచ్చిన తరువాత గుడివాడ కాలేజి కి వచ్చారు. అప్పుడు నాకు ఎనిమిది సంవత్సరాలు ,మా పిల్ల జట్టంతా ఆయన్ని చూడాలని వెళ్ళాం. ఆ జనం లో ఊపిరి ఆడక నలిగి పొయినా ఆయన్ని చుసిన సంతోషం తో ఇంటికి వేళ్ళను. అలాంటి అక్కినేని నాగేశ్వర రావు గారితో ,కొన్ని సంవత్సరాల అనంతరం ఒకే చోట కలిసి భోజనం చేయటం,కబుర్లు చెప్పుకోవటం ఒక థ్రిల్లింగ్. అలాగే ౧౯౭౧ లో నందమూరి తారక రామారావు ,ఇక్కడి బాలజు థియేటర్ ను ప్రారంభించటానికి వచ్చారు. గుడివాడ మునిసిపల్ ఆఫీసు లో వారికి పౌర సన్మానం చేసారు. అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు నాది . ఆఫీసు వెనుక నున్న పైపు పట్టుకుని వెలది పాకుతూ రామారావు,సావిత్రి లను చూసాను. అప్పుడు కాతరి సత్యన్నారాయణ మునిసిపల చైర్మన్. అలా ఆ సభలో పాల్గొని జీవితం ధన్యమై పోయిందని భావించిన మహత్తర సన్నివేశం అది. అదే ఎన్టిఆర్ తో నాలుగున్నర సంవత్సర పాటు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వారకు తిరగటం ,తాకటం,ఎంత ఉద్వేగా భరితంగా ఉంటుందో ఊహించండి.


మీలో ఎవరన్న సినీ నటులు నాగార్జున ,బాలకృష్ణ -అలా చేయి ఊపుతూ వెళ్ళిన తరువాత ఓ పడి సంవత్సరాల తరవాత మీ ఇంటికి వారు,వారింటికి మీటు వేల్లెమ్త చనువు ఏర్పడితే ఎంత థ్రిల్లింగ్ గా వుంటుంది.


అనుభవాలే చరిత్ర . మేధామేతిక్స్ లో వృత్తం అంతం . మధ్యబిందువు గుడివాడ గా మనం అనుకుంటే ,అక్కడ నుండి చుస్తే గత శతాబ్దాల ఆంధ్ర దేశాన్ని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులంతా ఈ యభై కిలోమీటర్ల రెడియాస్ పరిధి లో పుట్టరనేది ఒక చారిత్రక సత్యం. మీరు ఏ రంగం అయినా తీసుకొంది ,సిని చరిత్రలో గూడవల్లి రామబ్రహ్మం,నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వర రావు ,దుక్కిపాటి మధుసూధనా రావు ,ఘంటసాల వెంకటేశ్వర రావు -పత్రిక రంగంలో కసినధుని నాగేశ్వర రావు ,ముట్నూరి కృష్ణారావు ,నార్ల వెంకటేశ్వరరావు ,రామోజీ రావు ఆ రంగాన్ని ప్రభావితం చేసిన విశిస్త వ్యక్తులు . సాహిత్య రంగం తీసుకుంటే , కవిరాజు త్రిపురనేని రామస్వామి గొప్ప సంఘ సంస్కర్త . భారత దేశంలో ఆధునిక కాలంలో సమాజ ఉద్దరణకు కంకణం కట్టుకున్న తోలి వ్యక్తి . ఈ రోజున మద్రాసు లో వున్నా ది ఎం కే ,ది కే ,ఏ ది ఎం కే , రాజకీయ పార్టీలకు మూల కారణం రామస్వామి నాయకర్ . అలాంటి రామస్వామి నాయకర్ కు కూడా ప్రేరణ మన కవిరాజు రామస్వామి. అటువంటి వాడు పుట్టింది మన గుడివాడలో . "బ్రహ్మపురం మనదేరా -పర్లాకిమిడి మనదేరా- కాదని వాడుకు వస్తే కటకం కూడా మనదేరా అన్నాడు కవిరాజు. బ్రహ్మపురం అంటే బెర్హంపూర్ . ఒరిస్సా దగ్గర బెర్హంపూర్ లో వివి గిరి గారు పుట్టారు. "బెంగుళూరు మనదేరా -బళ్ళారి మనదేరా- కాదని వాడుకు వస్తే కన్నడ మొత్తం మనదేరా అన్నాడు. బెంగుళూరు మనదే అక్కడ గాలి జనార్ధన రెడ్డి, నాయుడు, మొదలైన మనవాళ్ళు అక్కడ సగం మంది వున్నారు. "చెన్న పట్నం మనదే-చెంగల్పట్టు మనదే- కాదని వాడుకు వస్తే తంజావూరు మనదే "అన్నాడు. చేన్నపత్నాల్ అంటే మద్రాసు గా మరి చెన్నై అయిమ్దిప్పుడు. తంజావూరు సరస్వతి మహల్లో ఇప్పటికి వున్నా తెలుగు తాల పాత్రగ్రంధాలూ తెచ్చుకోలేక పోతున్నాం .


ఇంకా " వీర గంధము తెచ్చినారము -వీరుడెవ్వడో తెల్పుడీ


పూసిపోదుము ,మెడను వైతుము -పూలదండలు భక్తితో "-అని అద్భతమైన స్వాతంత్రోద్యమ గీతాన్ని రాస్తే, , ఆచార్య ఎన్ జి రంగ , బెజవాడ గోపాలరెడ్డి గార్లు ,ఆ గీతాన్ని ఆలపిస్తూ ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జిల్లాకు వెళ్ళారని, అంత స్పూర్తిని రగిలించిన గీతాన్ని రాసిన కవిరాజు ఇక్కడ జన్మిచాడని కొనియాడారు.


ఉ. ఇమ్ముగ కకులమ్ము మోడ్లీ వారకుం గల యాంధ్ర పూర్వ రా


జ్యంముల పేరు చెప్పినా హ్రుడంతారమే లో చాలించి పోవు నా


ర్త్రమగు చిట్టా వృత్తుల పురాభవ నిర్ణయమేనని , నేనని జ


న్మమ్ములు గాక నీ తనువున్ బ్రవహించు నో నందర రక్తముల్ "


- అని చెప్పినా కవిసామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ ఇక్కడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్నా మన నందమూరు లో జన్మిచారు. . ఇంతమంది విఘ్నులు ,కవులు, కళా కారులు - ఒక శతాబ్దాన్ని ప్రభావితం చేసిన మహనీయులు జన్మించిన నెల ఇది. ఈ నెల ఇంత గొప్పదని తాతా తల్లిదండ్రు లింత గొప్పవారని తెలియ చేసే భాద్యత అందరిమీద ఉంది. అటువంటి మహత్తరమైన భాద్యతను చేపట్టాడు మన తాతా రమేశ్ బాబు . అభినందనలు.


వైతాళికులు కవిత సంపుటి ముద్దుకృష్ణ కనక ఈయక పొతే ఎంతోమందిని మరచిపోయే వారము . " -అంటూ తనదయిన శైలిలో ఆకట్టుకొనే ప్రసంగం చేసి ,మన సంస్కృతి ,సంప్రదాయాలు ను పుస్తకాలు ,కలలే కాపాడుతున్న విషయాన్ని తేల్చి చెప్పారు. " గుడివాడ చరిత్ర " ను భావి విద్యార్థులకు తెలియ చేయటానికి ప్రతి ఏట పట్టాన చరిత్ర ,ప్రముఖుల జీవిత విశేషాలపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని సూచించారు.


సభకు అధ్యక్షత వహించిన ఎర్నేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, త్రేతాయుగం లో శ్రీరాముడు లంక పై దండెత్తి రావణాసురిని అంతమొందించి విభీశానుడికి పట్టాభిషేకం చేసినపుడు ,స్వర్ణ మాయమయిన లంక లోనే ఉంది పరిపాలించ వలసినదిగా కోరితే , "ఆపి స్వర్ణ మయి లంక నేమ్ లక్ష్మణ రోచతే " అంటూ - " జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి " అంటూ పుట్టిన వూరు ,కన్నా తల్లి స్వర్గం కంటే గొప్పవని ,తాను అయోధ్య కే తిరిగి వెళ్తానని అనడాని చెప్తూ, మనమంతా ఏదో ఒక ప్రాంతంలో పుడతం, ఎన్నో అనుభవాలు ,అనుభూతులు వుంటై. ఆయా ప్రదేశాల గురించి మన తాతలు ,పెద్ద వాళ్ళు చెప్పేవారు. ఈ చెరువు ఫలానా వారిది ,ఇప్పుడీ స్టేడియం కట్టారని, ఈ చెట్టు, పుట్టల చరిత్ర ఇది అంటూ వాటి వెనకాల కథలు చెప్పేవారు. మేము పెరిగి పెద్ద వాళ్ళం అయినపుడు, మాకవి చెట్టులు, పుట్టలు .చెరువులు గా కనపడేవి కావు. ఆత్మీయ బంధువులు గా ,మా జిఇవితంలో భాగంగా తోచేవి. ఇవాళ కాలం మారింది . పిల్లల్ని కిండార్ గార్డెన్ లో వేసిన దగ్గర నుండి ఇంఫర్మేసన్ తెచ్నోలజి లో గొప్పవాడు కావాలనో ,డాక్టర్,ఇంజనీర్ అవ్వాలని ఆశలు పెట్టుకొంటూ -ఆడుకోవటానికి ,స్నేహంగా ఉండటానికి అవకాసం లేకుండా చేస్తున్నారు. ఎప్పుడూ పాటలు రుబ్బుతూ ప్లే గ్రౌండ్ అంటే ఎలా వుంటుంది,ఎక్క ద వుంటుంది అనుకొనే దుర్కద్రుశ్త వాతావరణం లో పిల్లల్ని పెంచుతున్నారు. ఇలాంటి సందర్భం లో గుడివాడ చరిత్ర-భాష-సాహిత్య-కళారంగా ప్రముఖుల విశేషాలతో పుస్తక రూపంలో అందించిన తాతా రమేశ్ బాబు అభినందనీయులు అన్నారు. గుడివాడ ప్రసస్త్యాన్ని తెలియ చేసిన బృహత్తర గ్రంధం తీసుకు రావాలని, అధ్యయన సదస్సును నిర్వహించ బోతూ వేసిన తోలి గుడివాడ వైభవం గా అభివర్ణించారు.


గ్రంధ రచయిత తాతా రమేశ్ బాబు మాట్లాడుతూ, గుడివాడ ప్రాంత విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో గుడివాడ చరిత్రను ప్రత్యేక పత్యంసం గా చేసి ప్రభుత్వ పరీక్షలలో మూడు మార్కుల ప్రశ్నగా తప్పనిసరి చేయ గలిగినప్పుడే చరిత్రను తెలుసికోవటానికి ఆసక్తి చూపుతారని , ఇందుకు మేధావులు , విద్యా రంగ నిపుణులు,ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అలాగే ఎక్కడి కక్కడ స్థానిక చరిత్రలు పత్యంశం వుండాలని సూచించారు. తాను గుడివాడ వైభవాన్ని రేఖామాత్రం గానే రాసానని చెప్పారు.


తొలుత ఏ ఎన్ అర కళాశాల విసు ప్రిసిపాల్ స్వాగతం పలుకగా ,ప్రముఖ పగటి వేష కళాకారుడు మిరియ లా శేఖర బాబు బృందం ఆలపించిన దేశభక్తి ,జానపద గేయాలు ప్రక్ష్కులను అలా రిమ్చాయి. ఈ సభలో ఏ ఎన్ అర కాలేజి కర్స్పందేంట్ పర్వతనేని నాగేశ్వర రావు, కోశాధికారి కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు, బిఇడి ప్రిన్స్పాల్ ఎన్ అరుణ కుమారి, వికేఅర్ &విఎంబి పాలి టెక్నిక్ కళాశాల కరస్పన్ దేంట్ కురుమద్దాల సుధాకర్, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మాటూరి రంగనాద్,పులవర్తి కోర్నేలియస్, పిన్నమనేని భూపతి రాయుడు, సజ్జ శివరామ క్రిశ్నైహ్ ,రక్త కన్నీరు ఫేం దాసరి పూర్ణ మొదలయిన వారు పాల్గొనగా పెద్ద సమాఖ్య లో విద్యార్థులు, సాహితీ వేత్తలతో సభ ప్రాంగణం కిక్కిరిసి పోయింది .


మన సంస్కృతి సంప్రదాయాలను పుస్తకాలు, కళలు కాపాడు తయనే నమ్మకాన్ని కలుగ చేసింది ఈసభ.

Saturday, June 18, 2011

"గుడివాడ వైభవం" - ఆవిష్కరణ వేదిక మరియు ద్వారం




ఈ నెల ఇరవై తేదిన జరగ బోయే "గుడివాడ వైభవం" పుస్తక ఆవిష్కరణ వేదికను , ద్వారాన్ని తయారు చేసాము. ఆ ఫోటోలు ఇక్కడ ఇస్తున్నాము. చూడండి.


Tuesday, June 14, 2011

గుడివాడ వైభవం -పుస్తక ఆవిష్కరణ- కరపత్రం






"గుడివాడ వైభవం " పుస్తకం ఆవిష్కరణ ఈనెల ఇరవైన జరుగుతుంది. ఆ కరపత్రా వివరాలు ఇక్కడ జత చేస్తున్నాను. ఈ సభకు రావడానికి ,వీలు కుదిరిన వారందరికీ ఆహ్వానం .



తాతా రమేశ్ బాబు