





































ఈ కథల పుస్తకం మీద జనవరి 2000 సం. లొ ఆకాశవాణి విజయవాడ కేంద్రం లొ
ఇప్పుడు తెలుగు సాహిత్యం లో రెండీల్లుగా కథలు గాలి విజ్రుమ్భించి వేస్తుంది. కవిత్వం గాలి సన్నగిల్లుతోంది ,కథ గాలి విస్తుందన్న విమర్శలు వస్తున్నై .కుంచె ను ఝులిపించే చేత్తోనే కలం పట్టి అణువు పగిలింది,పిడికిలి, అన్న కవితా సంపుటాలను ప్రకటించారు కథ రచయిత తాతా రమేశ్ బాబు రమేష్బాబు పంతోమ్మితి వందల ఎనభి నుంచి పంతోమ్మితి వందల తొంభై ల మధ్య రాసిన పద్నాలుగు కథలను 'తతరమేష్ బాబు కథలు' గా వెలువరించారు. జీవితం గురించి ,బతుకు పొరల గురించి అనువనువునా పరిషీలించ గలిగిన వాడే సమర్తవంతంయ్న కథలు రాయగాలుగుతాడు. స్త్రీ ,పురుష సంబంధాలను మగ పీత్తనం పయ్తన కథలలో విరుచుకపదతారు . మగ పెత్తనానికి నిదర్శనంగా బాగా చదువుకున్న కుటుంబాలకు చెందినా వారు కూడా నేటికిని ఆడవాళ్లును తక్కువగా చూడటమే కాకవారి గురించి తక్కువగా మాట్లాడటం గమనిస్తాము. రమేశ్ బాబు రాసిన 'ఒశేయ్' కథలో ఆడవాళ్లంటే సర్తుకు పోయే మనస్తత్వంతో ఉండాలని ఒక పాత్రతో పలికిస్తాడు. కథ ముగింపుకు వచ్చే సరికి 'ఒశేయ్ ' అన్న పిలుపు ను నిరశిస్తూ పాత్ర మాట్లాడుతుంది.
'అసమానతకు తల వంచితే మేనల్ని పాతాళానికి తోక్కేస్తాయి . తల ఎత్తితే అవే పాతాళానికి తోక్కబడతాయి .
అవును!
ఆశలు వదిలేసి చేతులేత్తిన వారిది కాడి ప్రపంచం
తేమ్పుతో ఎదురొడ్డి నిలిచే వారిదే ఈ ప్రపంచం'
అన్న వాక్యం తో 'ఒసేయ్ ' అన్న కథ ముగింపు బావుంది.
'డైరీ ' అన్న కథ లో ఫెమినిజం పయ్ రమేశ్ డిబేట్ చేస్తూనే స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సిన మానవ సంబందాలను ప్రతిష్టించే పని చేసారు. సమాజం లో పరుష అహంకారం వ్యతిరేకిస్తున్నవాల్లున్నారు . అలాగే స్త్రీ అహంకారాన్ని అంతే ద్వేషించాలి అన్న డా. రావు పాత్ర ద్వారా ఈ కథా రచయిత అనిపిస్తారు. ఫెమినిస్ట్ భావజాలం నిండిన విశాలి మాత్రం 'ఛి.మగ పశువులిన్తే ' అన్న వాక్యం తో కథ ముగుస్తుంది. ఫెమినిజం అన్నది హుమనిజంగా మారాలి కానీ మగ వ్యతిరేక ఇజం మారకుదదన్న భావనను డైరీ కథ లో వాదన చేసారు .
అన్ని కథలలో ప్రేమ గురించి, వివాహం గురించి ,స్త్రీ స్వేచ్చ గురించి ,సామాజిక హింస, పతనమౌతున్న నైతిక విలువల గురించి చెప్పారు.

No comments:
Post a Comment