
























డిసెంబర్ రెండువేల తొమ్మిది ,విజ్ఞానసుధ

గ్రంధావిష్కరణ సభలు ఎన్నో జరిగాయి .-జరుగుతున్నాయి . కాని 'లయ' గ్రంధావిష్కరణ సభ వినూత్న వరవడి లో సాగి-ఇటువంటి సభలకు నుతనోత్సహాన్ని కలిగించింది.
వినోద,విజ్ఞానాల మేలవింపుతో కూడిన గ్రంధాలు ప్రజా బాహుళ్యాన్ని విజ్ఞానవంతుల్ని చేసి జాగ్రుత పరుస్తాయి . ఈ గ్రందాల కోవలోకి ఇటివల గ్రంధ సమీక్షల ఐ'లయ' మయిన గ్రంధాలు చేరాయి. ఆకాశ వాని గ్రంధ సమీక్షల నుప్రసారం హేయడానికి నంది పలికి...గ్రందాల ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టి..శ్రోతల సంఖ్యా ను పెంచ్కుంది.
వివిధ భాషా సంస్కృతులకు చెందినా అనువాద గ్రంధాలను తెలుగు గ్రందాలును, వైవిధ్య భరితంయన సపుతాలను ఆకాశవాణి ద్వార సమీక్షించిన ప్రముఖ రచయిత ,శ్రీ తాతా రమేశ్ బాబు గ్రంధ సమీక్షలు కృష్ణ జిల్లా కైకలూరు లోని 'సాహితీ మిత్రులు' ఆధ్వర్యం లో గ్రంధరుపం దాల్చి వారి ఆధ్వర్యం లోనే గ్రంధావిష్కరణ జరుపుకున్నాయి.
ఈ ఆవిష్కరనోత్సవ సభ కు స్వాగత వచనాలు పలికిన కైకలూరు సాహితీ మిత్రులు ప్రధాన కార్యదర్శి శ్రీ చింతపల్లి వెంకట నారాయణ కొల్లేటి పక్షుల మృత్యు ఘోష ను కవిత పతనం తో కన్తనిరు తెప్పించారు. సభాధ్యక్షులు మాజీఎమేల్సి శ్రీ కంమిలివితల్ రావు 'ఎలూరు ఫ్లడ్ లైట్ లు మమ్మల్ని వెక్కిరిస్తున్నాయి ' అంటూ నాటి శాసనసభ్యులు ,తమ తండ్రి స్వర్గీయ కంమిలి అప్పారావు శాసనసభ లో ప్రస్తావించిన వైనాన్ని ,ఆనాటి విద్యుత్ శాఖా మాత్యులు స్వర్గీయ గౌతు లచ్చన్న ,నియోజక వర్గ ముఖ్య కేంద్రాలన్నితికి విద్యుత్ సౌకర్యం కల్పించిన వైనాన్ని కవితాత్మకం గా విన్పించి..లయ గ్రంధ సమీక్షలను సోదాహరణలతో వివరించి ...లయ గ్రంధ సమీక్షా ల కర్తకు అభినందనలు తెలియచేసారు.
ముఖ్య అతిధి గా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్దప్రసాద్ లయ గ్రంధావిష్కరణ చేసి గ్రంధకర్త ను 'బహునుఖ ప్రజ్ఞాశాలి' అని కొనియాడారు. తెలుగు వారందరూ సంకుచిత భావాలు విడనాడి విశాల దృక్పథం అలవరచుకోవాలని తెలుగు భాషనీ పరిరక్షించుకొనే కార్యక్రమాలని చేపట్టి ,సవాళ్ళను ఎదుర్కొని మనా భాషనూ రక్షించుకోవాలని ఉద్భోదించారు.
విస్హిష్ఠ అతిధి గా పాల్గొన్న ఆకాశవాణి సంచాలకు లు శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ 'ఆధునిక సంగీతం లో రాగాలు-ప్రయోగాలు' అనే అంశం గురించి ప్రస్తావించి రాగాభారితంగా ప్రసంగించటం విశేషం . రాబింద్రనాథ్ టాగోర్ ,పంకజ్ మల్లిక్, అనిల్భిష్వాష్ ,సాలూరి రాజేశ్వర రావు ,పెండ్యాల నాగేశ్వరరావు వంటి వారి సంగీత వైశిస్త్యాన్ని -ఘంటసాల రాగ సృష్టిని -రాగాలాపనలను సోదాఫ్హ్రనలతో వివరించి ప్రేక్షకులను తన్మయులను చేసారు.
తరం మారుతున్నపుడు వచ్చే మార్పులను స్వాగతించవలసిన అవసరమున్నదని, ఆకసవాని ద్వారా ప్రముఖ గ్రంధాల సమీక్షలను ప్రసారం చేసి- గ్రంధ పరిచయం చేయడం వలన గ్రంధ కర్తలు, సమీక్షకులు, వారి కుటుంబాలు, స్నేహితులు, సంనిగితులు, పుస్త ప్రియులు వంటి వారందరూ ఆకసవాని పట్ల మక్కువను పెంచుకుని....ఆకాశవాణి శ్రోతల సంఖ్యా పెరగటానికి దోహదపడిందని శ్రీ ఆదిత్యప్రసాద్ అన్నారు. ఇంతే గాక ఈ సమీక్షలు గ్రంధ రూపం లో రావడం ముదావహమని పేర్కొన్నారు.
గ్రంధ కర్త శ్రీ తాతా రమేశ్ బాబు స్వర్గీయ మండలి వెంకట కృష్ణ రావు ఇంట్లో తన బాల్యస్మ్రుతులను నేమరువేసుకొంటు, బుద్దప్రసాద్ గారితో తన సాన్నిహిత్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ,తనని జాతీయ తెలుగు రచయితల మహాసభలు, ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు, ఇంకా అనేక జాతీయ సదస్సులు, సమావేశాలలో కార్యకర్త గా మలచిన ఆత్మీయ మిత్రులు గుత్తికొండ సుబ్బా రావు గారికి ధన్యవాదాలు తెలియ చేసారు.
తన లయ ఆవిర్భావం ప్రస్తావిస్తూ -తనకు గ్రంధ సమీక్షా లు చేసే అవకాశాన్ని కల్పించటం వల్ల ఆయా గ్రంధాలు పటించి ,అవగాహన చసుకుని జ్ఞానసముపార్జన చేసుకుని విశ్లేషించటానికి అవకాశమిచ్చిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి, వాటిని ముద్రించి ప్రచురించిన సాహితీమిత్రులు కైకలూరు వారికి ధన్యవాదాలు తెలియచేసారు తాతా రమేశ్ బాబు.

books are so nice and they are interested to read.
ReplyDeleteమద్దిరాల వారు,
ReplyDeleteలయ వ్యాసాలు చదవటానికి ఇంట్రెస్ట్ గా వున్నాయన్నారు.ఇందులో మీ బాల సాహిత్యం సమీక్ష వుంది.దానిపై మీ అభిప్రాయాన్ని పొస్ట్ చెయండి. మప్పిదాలు