

జన ప్రభ ,సాహిత్య మాస పత్రిక సంచికల ఛాయాచిత్రము
జన ప్రభ ,సాహిత్య మాస పత్రిక ఆవిష్కరణ విశేషాలు ,చాయాచిత్రాలు
పంతొమ్మిదివందల ఎనభయ్ నాలుగు డిసెంబర్ ఇరవయ్ మూడు ఆదివారం సాయంత్రం మచిలీపట్టణం , జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం లో జనప్రభ సాహిత్య మాసపత్రిక ఆవిష్కరణ సభ నిరాడంబరంగా జరిగింది. శాభకు డా.మాదిరాజు రామలింగేశ్వరరావు అధ్యక్షత వహిస్తూ 'రచయితా నిబద్ధతని పాటించినా సంపాదక్ల్ మాత్రం అన్ని భావాలను సమాదరించే సమదృష్టి కలిగి వుందాల'ని సలహా ఇచ్చారు.
జనప్రభ తొలి సంచిక ను కృష్ణ జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి డా.వెలగా వెంకటప్పయ్య ఆవిష్కరించారు. 'పత్రిక నిర్వహణ అందునా సాహిత్య పత్రిక నిర్వహణ సాహసంతో కూడిన పని' అని చెప్తూ, పత్రిక సంపాదకుల్ని అభినందించారు.
శ్రీ జోరా శర్మ ప్రారంభ సంచికను సమీక్షా చేస్తూ పత్రికల పుట్టు పూర్వోత్తరాలను కూడా వివరించారు. మచిలీపట్టణం పత్రికలకు పుట్టినిల్లని చెప్తూ , పట్టణం లో వేలువరించాబడ్డ పత్రికల వివరాలందించారు. మినికవిత లేలంటివో పత్రికా ప్రపంచంలో చిన్న పత్రికలలన్తివివని, వీటిని చిన్న చూపు చూడకూడదని, మంచి పత్రికలను సమాదరించాలని కోరారు.
శ్రీ గుత్తికొండ సుబ్బారావు తాన అభినందన ప్రసంగంలో 'కొందరు వ్యక్తులు ముందు సంస్థల పేర్లతో పత్రికలూ స్థాపించి ,తర్వాతా వాటిని తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వుపయోగిన్చుకున్తున్నారని ,జనప్రభ అలా కాకుండా సమాజ సమిష్టి ప్రయోజనా లను పెట్టుకొని సాహిత్య కృషి జరపాలని సలహా ఇచ్చారు. పత్రికా నిర్వాహకులు శ్రీ విజయ్ మాట్లాడుతూ పత్రిక స్థాపించటం లో తమ ఆశయం వివరించి జనప్రభ పత్రికా జనందని, దాని బాగోగులు చుచుకోవలసిన భాద్యత కుడా జనంమీదే వుందని చెప్తూ, జనం అండదండలు కోరారు. సమాజ శ్రేయస్సు కోసం దోహదం చేసే రచనలు పంపమని రచయితలను కోరారు.
పత్రిక ను అభినందిస్తూ శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,శ్రీ వడ్డీ కృష్ణమూర్తి కవి అభినందన చందనం సభ కు సమర్పించారు.
సంపాదకులు తాతా రమేశ్ బాబు సాహిత్య పత్రికలలో మేటి గ నిలవటానికి తగిన రచనలు తమకు పంపవలసిందిగా రచయితలను కోరారు.
No comments:
Post a Comment