My Blog List

Saturday, February 13, 2010

రెండు:'పిడికిలి 'దీర్ఘ కవిత

















అంధ్రపత్రిక ,శుక్రవారం ,జూన్ పదమూడు పంతొమ్మిదివందల ఎనుబది ఆరు
'పిడికిలి'ఆవిష్కరణ
నేత్రాలు,మేధస్సు ,హృదయం పరిశుభ్రంగా ఉంచుకొని కవిత్వాన్ని చదవడం , ఆలోచించడం చేస్తేనే కవిత్వం కవిత్వంగా కన్పిస్తుందని,దుష్టసమీక్షలు ,దుష్ట విమర్శలు కలాన్నిబతికించటం కాని ,చంపడం కాని చెయ్యలేవని ప్రముఖ విమర్శకులు శ్రీ టి.ఎల్ .కాంతారావు ఇక్కడి స్పందన సాహితీ సమాఖ్య యాభయ్ రెండవ ప్రచురణ గా 'పిడికిలి' వచన కవితా కవ్యావిష్కరణ సభ లో అన్నారు . కవి ఏది చెప్పినా ,ఎలా చెప్పినా అది నినాదప్రాయం కాకుండా శిల్ప సహితంగా కవిత్వం ఐ తీరేలా వుండాలని, ఈనాటి కవిత్వానికి వస్తువు ప్రాణం కాగా శిల్పం కవచమని ఆయన అన్నారు.
శ్రీ కాంతారావు 'పిడికిలి'ని సమీక్షిస్తూ ,సమకాలిన సమాజ సంక్షోభం కవితాత్మకంగా చిత్రిమ్పబదిందని ,కవి శ్రీ తాతా రమేశ్ బాబు సక్రమ మైన మార్గం లోనే పయనిస్తున్నారని ,వాచం కాకుండా వ్యంగ్యంగా వ్యక్తికరించారని , ఈ కవి ముందు ముందు ఇంకా మంచి కవితలు రాయాలని అన్నారు.
'పిడికిలి' కావ్యాన్ని ప్రముఖ కవయిత్రి శ్రీమతి టి.వానిరంగరావు ఆవిష్కరించారు.ఈ సభ కు జిల్లా పౌర సంబందాల అధికారి శ్రీ ఫై.ఎస్.ఎన్.రాజు అధ్యక్షత వహించారు .
తొలుత శ్రీ జోరా శర్మ స్వాగతం పలుకగా చివర శ్రీ బూదరాజు శ్యామసుందర్ వందన సమర్పణ చేసారు
ఈ పుస్తకం మీద కొందరి అభిప్రాయాలు :
ఎస్సార్.పృథ్వి ,పెద్దాపురం,తు.గో.జిల్లా. తొమ్మిది-తొమ్మిది-ఎనభయారు
మీ రచన 'పిడికిలి' చదివాను. శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు ఇవ్వగా. నేటి సమాజం లోమి సమస్యలప్యే మీ హృదయం ఎంత ఉద్వేగం తో స్పందిన్చిందో స్పస్తమైనది .నేటి భారతాన్ని పదునాల్గు పేజీల చిరు కావ్యం లో చిత్రీకరించారు.అతి పవిత్రమైన న్యాయ స్థానాలలో గూడా నేడు విమర్శలకు గురికావదాన్ని నిర్భయంగా ఎత్తి చూపారు.
'స్వాతంత్రానికి -ఆవేదన
ప్రజాస్వామ్యానికి -ఆక్రందన '
నిర్వచనం చాలా బాగుంది.
పిడికిలి బిగిస్తే -ఎర్రదనం
సదలిస్తే -పచ్చదనం
ఎర్రదనమంటే -రౌద్రం
పచ్చాదనమంటే-శుభం
రెంటికి అన్వయిస్తుంది మీ కావ్యం 'పిడికిలి'.

డా.తుమ్మపూడి సంజీవదేవ్ , తుమ్మపూడి,గుంటూరు జిల్లా ,ఐదు మార్చ్ ఎనభైఏదు
సాహితీ విమర్శకులు,రచయిత ,చిత్రకారులు,
మీ 'పిడికిలి' లో మంచి కవితా సృష్టి జరిగినందుకు అభినందనలు. కొందరి కవితల్లో సామాజిక స్పృహ మాత్రమె వుంటుంది,కవిత స్పృహ వుండదు. మరి కొందరి వాటిలో కవితస్ప్రుహ మాత్రమె వుంటుంది ,వుండదు సామాజిక స్పృహ .కాని రమేశ్ బాబు కావ్యంలో వుంటుంది కవితా స్పృహ,సామాజిక స్పృహ కూడా.
కవి సామాజికుడు కనుక కవితలో సామాజిక స్పృహ వుండాలి . రచించింది కావ్యం కనుక దానిలో కవితాస్ప్రుహ వుండాలి. సామాజిక స్పృహ కవిత స్పృహ కు విరోధం కాదు. కారణం కవి మానవుడే కనుక ,అదే విధంగా కవితా స్పృహ కూడా .
'రాబోయే ఉదయాన్ని
రంగుల్లో చూసుకొంటూ
గుప్పెడు తెగింపుని
హృదయం లో చిందిస్తూ'
ఇందులో సామాజిక స్పృహ కు అభావం లేదు,లేదు కవితా స్పృహకు ప్రమాదం .
మీ హ్రస్వ కావ్యం లోని ప్రతి కవిత నవరితిలో నవతర రీతిలో వుయ్య్యాల లుగుతున్నై .సయ్యాతలాడుతున్నాయో లేదో నాకు తెలియదు.

ఆచార్య తిరుమల .హైదరాబాద్,ఏడు-మార్చ్,ఎనబదిఎదు.
కవి
మీ 'పిడికిలి' చదివి ఎంతో ఆనందించాను.అద్దేపల్లి వారి పిటిక తో హృదయ పూర్వకంగా ఏకిభవిస్తున్నాను .మీ భావ ప్రకటన చాల ఆకర్షనియంగా వుంది .రచనలో వేగం ,దృక్పథం లో స్వార్తత్యాగం , సామాజికాభ్యుదయ కామన లో సమతా యోగం సాధించారు. సుదీర్ఘ కవిత నిర్వహణ అల్ప కవులకు కష్టం . మీరు అనల్ప కవిత నిర్వాహకులని రుజువు చేసుకొన్నారు.

No comments:

Post a Comment