My Blog List

Thursday, January 24, 2013

పగటి వేషాలు -ఫకీరు సాయిబు వేషం

పగటి వేషాలు -ఫకీరు సాయిబు వేషం

 

"రోజ్ దారో సహారా కి టైం ఆదాహా రహిహై "
(ఉపవాసం వుండే వారికి సమయ మయినది లేవండి )
- అంటూ తెల్ల వారు ఝామున 4 గంటలకు వినపడ్డాయి అంటే ,ఖచ్చితంగా అది ముస్లిం పవిత్ర 'రంజాన్' మాసం అయి వుంటుంది . పై మాటలు ఫకీర్ సాయిబు పలుకులు అయి వుంటాయి.
"లా ఇలాహ ఇల్లల్లా ,మూరే మేహంమాద్ సులేల్లా"
(ముత్యాలతో వుంటాడు దేముడు)
అనే గానం వినపడితే ,అది 'మొహర్రం 'పండుగే!
మసీద్ నుండి జెండా లేపుతూ,
"ఆవో అల్లా హం జండా ఉతా రహిహై
యా అల్లా హబ్ సబ్ మందిర్ మే గీత గాయే "
అంటూ గానం చేసేది కూడా ఫకీర్ సాయిబులే!
పవిత్ర రంజాన్ నెలలో ప్రతి రొజూ తెల్ల వారు ఝామున 4 గంటలకు అల్లా భక్తులను మేలు కోల్పుతూ ఉంటాడు. మిగతా రోజులలో ప్రతి శుక్ర వారం ఉదయం 9 గం. నుండి 11 గం. వరకూ మరియు సాయంత్రం 4 గం. నుండి 6 గం. వరకూ అల్లా ని ప్రార్థిస్తూ ,గడప గడపకు తిరుగు తాడు ఫకీర్ . అజ్మీర్ దర్గా నుండి సాధారణ దర్గాల వరకూ అల్లాని ప్రార్థిస్తూ జీవిస్తుంటారు ఫకీర్ లు .
ప్రతి సం. మర్చి నెలలో కృష్ణా జిల్లా ,గుడివాడ లో 'గౌస్ లాజం దస్తగీర్ 'పేరు మీద 'గారెమి' ఉత్సవాలు జరుగుతాయి. నెలపొడుపు తరువాత 11 రొజూ నుండి నెల లోపు పండుగ ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు.'వలి అల్లా ' అంటే దేవుని భక్తుని మీద పండుగ చేస్తారు.
ప్రజలు తమ కోరికలు చెప్పి వలీఅల్లా కు మొక్కుతారు. పండుగలో మొక్కును తీర్చుకోవటానికి 'జెండా'లు తీస్తారు. కొన్ని వందల జండాలు వుంటాయి ఇక్కడ. గ్యారామి లో' గ్యా' అంటే 11 . వలీ అల్లా పేరు మీద 11 రోజులు ఉత్సవాలు జరుపు తారు . కోరికలు చెప్పుకొని మొక్కిన వారి కోరికలు తీర్చ టానికి వలీ అల్లా లలో పెద్దవాడయిన 'గౌస లాజం దస్తగీర్'మున్డుమ్టాడని ప్రతీతి. గుంటూరు మస్తాన్ వలీ,పెదకాకాని బాజీ షహీర్ బాబా ,అజ్మీర్ లో ఖాజా గరీబ్ నవాజ్ ,నెల్లూరు దగ్గర హజరత్ ఖాజా రహ్మతుల్లా,రహ్మితున్నిసా ...ఇలా ముస్లిం లలో ముక్కోటి 'వలీఅల్లా' లు వుంటారు.
ముఖ్యంగా ఉత్సవాలలో గంధం తీస్తారు. ఒక గుర్రం మీద గంధం బిందె ను పట్టుకున్న మనిషి ని ఊరేగిస్తారు. ఊరేగింపు ముందుగా జెండాలు నడుస్తాయి. జెండా కి పులు ఆలంక రిస్తారు. అనంతరం రోగాలతో బాధ పడుతున్న వారి కి ,కావలసిన వారికి, గంధం పంచుతారు. గంధం ఒంటిమీద రాసుకుంటే సర్వ రోగాలు తగ్గుతాయని నమ్ముతారు.
ఇక్కడ పకీర్లు మేళాగా ,వలీ అల్లా ను పొగుడుతూ పాడుతారు.
ఇందుకు గాను భక్తులు వీరికి బియ్యం ,డబ్బులు ఇస్తుంటారు.
సంపాదన అంతా మల్లి ప్రజలకే ఉపయోగిస్తారు పకీర్ లు
"బరాటను తిప్పుతూ ఉర్దూ యాసతో తెలుగు మాట్లాడ తారు . తన్వుకి ప్రానాంకి అచ్చాబంధం హై సాబ్. ఓక్ దాన్కి బాద్ వస్తే రెండ్ దాన్కి వస్తాది. అడ్వికి బోయి జిల్కన్ దేస్తం.పన్జరం లో పెట్టి అచ్చా గా తిన్ పిస్తం .అలవాట్ అయిందని పన్జరం తెర్చామా,చేప్పకుండా దౌడ్ తీస్తాది . దేహం అనే పన్జరం నుంచి జీవం అనే జిల్క ఎగిరి పోద్ది సాబ్. మాదీ మాటా వింటే ,దర్మం చేస్తే మీది జిల్క పోదు . అల్లా చుస్తాడ్ సబ్."
ఇలా సాగుతుంది ఫకీర్ సంభాషణ.

'ఫకీర్' అంటే ఎవరు?

'ఫై' అంటే ఆకలి దప్పులతో వుండాలి. 'కాఫ్'అంటే దైవ ధ్యానాన్ని లీనమై చేయాలి. ఖినాత్ వుండాలి అంటే వున్న దాంట్లోనే సర్దు బాటు చేసు కోవాలి. దైవ ధ్యానంలో వుండాలి అనే తృష్ణ కలిగి వుండాలి. యాద్ఎ ఇలాహి అంటే ఎప్పుడూ ,పడుకున్నాలేచినా 24 గంటలు దైవాన్ని స్మరిస్తూ వుండాలి. 'రే'అంటే రాగ ద్వేషాలకు దూరంగా ఉండి,'రియాజ్'అంటే తపస్సు చేయాలి. దైవాన్ని, దైవత్వాన్ని అధ్యయనం చేస్తుండాలి.
నాలుగు ఉత్తమ గుణాలున్న వాడూ 'ఫకీర్'.
ముస్లిం జాతిలో రుషి లాంటి వాడూ ఫకీర్. ఫకీర్ గా మారటానికి అన్ని త్యాగం చేయాలి . వీరు అల్లా కి పుత్రులు గా గౌరవింప బడతారు.
ఫకీర్ గా మారాలను కుంటే ,మారాలనుకున్న వ్యక్తికి గడ్డం,మీసాలుతో సహా అతని శరీరం మీద రకమైన వెంట్రుకలు ఉండకుండా తీయాలి. తరువాత వారికి 'కఫన్' అంటే మరణించిన వారికి తొడిగే తెల్లని గుడ్డ తో అలంకరిస్తారు. శాస్త్ర యుక్తంగా ,ఇతను మానవుడు కాడు,ఫకీర్లో కలసి పోయావు అనే అర్థం వచ్చే మంత్రాలు చదువుతూ ఒక గొయ్యి తీసి అందులో పడుకో బెడతారు. గోతిని కప్పుతారు. గాలి పీల్చుకుని బతకడం కోసం గోతి ఉపరి తలంపై కొన్ని రంద్రాలు వుంచుతారు. ఇలా మంత్రాలతో శుద్ధి చేసి ,నిష్టా గరిష్టుడను చేసిన తరువాత మూడు రోజుల అనంతరం గోతి నుండి బయటకు తీస్తారు.
ఇప్పుడు పరిశుభ్రం గా స్నానం చేయించి ఆకు పచ్చని రంగులో వున్న పైజామా ను ధరింప చేస్తారు. 'దఫ్' అంటే డప్పు చేతికి ఇస్తారు. 'కంజరి' అని అంటారు డప్పుని. 'దఫ్'పైన ఒకటి లేదా రెండు దెబ్బలే వేయాలి. అలాంటి దరువులే వుపయో గించాలి పడేటప్పుడు ఫకీర్.
ఇప్పుడు మామూలు మనిషి ఉద్రేకించ బడిన' ఫకీర్' అయినట్లే .
తరవాత ఫకీర్ ఇహ లోకం గురించి పట్టించు కోడు ,మాట్లాడాడు. మరణించిన తరువాత విషయాల గురించి ,పై లోకం గురించి మాత్రమే చర్చిస్తాడు.
18 గాజా లున్న గుడ్డను ఇస్తారు ,దీనితో 'పట్కా'అనే తలపాగా చుట్టూ కుంటాడు.
ఫకీర్ లలో నాలుగు రకాలు వుంటారు.
మొదటివాడు'ఖలందర్'అంటే ,'జబర్దస్తి'చేస్తాడు .సాహసం కలవాడు. ఇతరుల దగ్గరకు వెళ్లి నప్పుడు ,వారు ఇవ్వగలిగింది అంచనా వేసి అడుగుతాడు. ఇవ్వక పొయినా ,'జారేజ' అన్నా అక్కడే క్రింద పది ప్రాణాలు వదలటానికయిన సిద్ద పడతాడు.
రెండవ వాడు 'దర్వేష్' ,అంటే జాలి గుండె కల వాడు. ఏమిచ్చినా తీసుకుంటాడు.
మూడవ వాడు'రహేనుమా' ,అంటే మార్గ దర్శకుడు. నైతిక మార్గం చెప్పి మార్గ దర్శనం చేస్తాడు. దైవత్వం వైపుకు వెళ్తాడు .
నాలుగవ వాడు 'గోషనషి' ,అంటే అజ్ఞాతం లో వుంటారు. ఎవరితో కలవారు. దైవంలో లీనమై పోతారు. 'షా సబ్ జరా జాయిం 'అంటారు. కోపం తెప్పిం చరు.
పై నాలుగు ఫకీర్ లకు సన్మార్గం చూపెట్ట టమే,జీవ లక్షణం.
వీరిని 'సూఫియ క్రం' అంటారు.ఎవరికీ హాని చేయరు. మేలు చేస్తారు.సాధు జంతువులు,పర్యాటనలు చేస్తారు. . 'సయ్యా' అంటే పర్యాటకుడు. అందుకే వీరిని 'సాయి' అంటారు. ఎక్కడికి వెళ్లటాని కయినా ఎవరూ అభ్యంతరం చెప్పారు వీరికి.
రవాణా సౌకర్యాలు లేని రోజులలో ,ఇతర చోట్ల వున్న బంధువుల ఉనికి ని తెలియ చేసేవారు.
చిట్కా వైద్యం చేస్తారు. పసి పిల్ల వాడికి నీరుడు బంద్ అయితే సుద్ధ ని నీటితొ కలిపినా మిశ్రమాన్ని , పిల్లవాడి బొద్దు మీద రాస్తే,నీరుడు వచ్చేది.ఇదో చిట్కా.
ఫకీర్లు ఎక్కడ బస చేస్తున్నారో తెలుసుకొని ,ప్రజలు అక్కడికి వెళ్లి ధాన్యము వగైరాలు ఇచ్చేవాళ్ళు. వచ్చిన ధనమంతా,'లంగర్ ఖానా' అనే ఉచిత భోజన శాలలో భోజనం పెట్టటానికి ఉపయోగిస్తారు.
కొంత మంది ఫకీర్ లు గుండ్రం గా నుంచుని భజన చేస్తారు. దీనిని 'సుమా' అంటారు. లా ఇలాహా ఇల్లల్లా అంటే దేవుడు తప్ప ఎవరూ పూజ్యులు కాడు అని చెప్పే మూలమంత్రం నుండి అనువుగా వుండే కీర్తనల తో భజన చేస్తారు.
17 శతాబ్దం లో రాజుల కి సీక్రెట్ ఎజంట్స్ గా పని చేసేవారు. ఆలిం మాలిక్ రాజ్యాలను జయించి పెట్టారు.

పగటి వేష ప్రదర్శన :

" ధంకా కహా భరోసా ,అల్లా నబిర్ కేలో తమాషా
మహమ్మద్ కి అల్లాహై తూ,యహ నికల్ రహ హై "
(అల్లా ,నబిర్ లు తమాషా చెయ్యండి. డప్పు నాకు భరోసా ఉండి. మహమ్మదీయుల అల్లా నువ్వు ,ఇక్కడ వున్నావు)
అని పాడుతూ ,అనుగుణంగా డప్పు వాయిస్తూ వస్తారు. సుమారు 6 నుండి 8 మంది వరకూ వుంటారు . మెడలో తావీజు ,కళ్ళ కు సుర్మ పెట్టుకుంటారు. పచ్చని ,నారింజ,తెలుపు రంగు పూసల దండలు మెడలో వుంటాయి . పెద్ద చొక్కా,గల్ల లుంగి కట్టు కుంటారు. తలకు చిలక పచ్చని పాగా చుట్టుకుం టారు.
ఒకరి చేతిలో గిరిక
ఒకరి చేతిలో ఫకీరు చెప్పు (భిక్ష పాత్ర)
మిగిలిన వారు కంజరి పట్టుకుంటారు.
"ఆవులల్లాకి బేటా, ఫకీరు సాయిబులం " అనుకుంటూ వస్తారు. బాజిర్,అక్షయ పాత్ర,లైటు తీసుకుని బయలు దేర తారు. హిందూ ముస్లిం బేధం లేకుండా అందరి ఇళ్ళకు వస్తారు. గజల్స్ పాడుతూ, వాటి అర్థాన్ని తెలుగు లో చెపుతూ ,ప్రతి ఇంటి వద్ద దీవనలు చెప్తారు.
"అల్లా కి పుత్రులం మనం . అల్లా అంటే భగవంతుడు . భగవంతుడు మనకు అనేక రకాలుగా వున్నాడు. మనం వయసులో వున్నపుడు పెంచిన కండల్ని ,సంపదని చూసుకుని ,బందు మిత్రులను చూసుకుని గర్వ పడుతూ ,సాటి వాడిని బాధ పెదతం. సతి వాడికి హాని చేస్తే అల్లా క్షమించడు.
ప్రాణ మనేది ఒక చిలుక లాంటిది. చిలుకను తెచ్చి దేహమనే పంజరం లో బంధిం చారు. కాని పంజరం తలుఉలు ఎప్పుడూ తీస్తే అప్పుడు పరి పోవటానికి సిద్దంగా వుంటుంది. పంజరమనే దేహం భగవంతునిపై ఆధారపడి ఉండి. భగవంతుడు పంజరం తలుపు ఎప్పుడూ తీస్తే ,అప్పుడు ప్రాణమనే చిలుక పారి పోతుంది. ప్రాణం అనే చిలుకను ఎంత దాచి పెట్టినా,అది పారి పోవాలనే చూస్తుంది. కాబట్టి చిలుక ఉన్నంత వరకే ప్రాణం .చిలుక వున్నంతవరకే పంజరం. చిలుక పోయాక పంజరాన్ని పాట సామానుల వాడికి ఇస్తాం. దేహాన్ని ఖర్చు పెట్టి పూడుస్తాం ,ఖననం చేస్తాం.
ఒక ఏనుగు చనిపోతే దాని అంకుశం మిగులుతుంది
ఒక గుర్రం చనిపోతే దాని వీపు మీద వేసే 'జీనుగ' మిగిలి పోతుంది
ఒక డేటా చనిపోతే అతని పేరు మిగిలి పోతుంది
కాబట్టి మనిషికి వుదారత్వం కావాలి .అందర్నీ గౌరవించాలి,పూజించాలి. అల్లా ని ధ్యానించాలి.
శరీరాన్ని చూసి మోస పోవద్దు . శరీరం అనేది కేవలం తొమ్మిది రంద్రాల తోలు బొమ్మ . కాబట్టి కడుపు లో ఎన్నో దుర్ఘంద పదార్ధాలు వున్నాయి. సుఘంధ పరిమళాల తో పోషించినా ,చనిపోయిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?
ఆత్మ వెళ్ళిన దేహం అగ్ని హోత్రుని పాలు
కఠిన శల్యములు గంగ పాలు
మీద కప్పిన దుప్పటి చాకలి పాలు
కొడుకు పెట్టినా కుడు కాకుల పాలు
దాచి పెట్టినధనము ధనుడి పాలు
భ్రష్ట పెళ్లమేమో పరుల పాలు
అందుకే ,ఏది, ఎవరికీ తోడూ రావు కాబట్టి , ఆత్మ చాల గొప్పది.పరమాత్మ ఇంకా గొప్పది. ఆత్మ,పరమాత్మ ఒక్కటైతే మానవుడు సాధించేది చాల ఉండి. పంజరం దాటి చిలుక అడవి లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అడవి అనే లోకంలో చిలక లాగా జీవిం చాలి . పంజరాన్ని కాపాడు కోవాలి . చిలక పలుకులు పలకాలి.
"అల్లా కి రూప్ హమరే సాత్ రహే తక్ హం జీ సక్తే
వహి నహి తో హం నహిజి సక్తే "
(దేవుడు మనతో ఉన్నంత వరకే మనం బతక గళం. లేకపోతె బతక లేం)
మనం ఇహ లోకంలో పడే సుఖ దుఖాలను విడిచి దేవుడ్ని ప్రార్ధించాలి. అలా నిష్ఠ తో ప్రార్థించే వాడే స్వర్గానికి వెళ్తాడు.
" ఆద్మీ సుక్ దుక్ సే లోక్ కర్ అల్లా కే ప్యార్ కరనేసే
వహి ఆద్మీ జన్నత్ కు జాతా హై '
(అలాగే సతి మనిషిని హింసించి ,బాధ పెట్టె వాళ్ళు "జోజక్ పహంచ్ హై " -నరకానికి వెళ్తాడు.
దుష్టులకు కను విప్పు కలిగిస్తూ ,దుర్మార్గులని సంమార్గులుగా నడిపిస్తూ ,సాగుతుంది వేషం .
భిక్ష ను తీసుకుని చివరిగా దీవిస్తారు....
"ఆవులిల్లకా బాదర్ కి బేటా బేతి సుఖనందర్ కే
ఆవు లైం లాక్ మేర బాప జీతే రామ్ "
(అల్లా పిల్ల లయిన మీరందరు సుఖం గా ,ఆనందం గా జీవించండి ) అంటారు.
హిందూ మతస్తులకు ,ముస్లిం మతదేవుడిని పరిచయం చేసి , దేవుడైనా ఆకాంక్షించేది ఒకటే అనే ధర్మాన్ని తెలియ చేస్తారు.
( పై వ్యాసం "పగటివేషాలు-సామాజికాంశాలు " పుస్తకం నుండి . 
ఈ పుస్తకం www .Kinige .com లో లభ్యమగును. )


Sunday, January 20, 2013

' కిచిడి' ని రుచి చూస్తారా?.......

' కిచిడి' ని రుచి చూస్తారా?.......
పుస్తకం పేరు: కిచిడి [నవరసాల సాహితీ పంచకం]
                 1/8 డెమ్మీ సైజు,  పేజీలు : 64,   వేల: రూ . 60/-
పుస్తకం మొదటి అట్ట :
 
'సన్ ఫ్లవర్ '        సంపూర్ణ వార పత్రికలో 15 వారాల పాటు ప్రచురించిన ధారావాహిక 'ఫన్ ఫ్లవర్ ' లోని  పదిహేను రకాల  నవ్వులు.
కథలో......             ఒక పెద్ద కథ , ఒక పిల్ల కథ
పప్పెట్ షో ........
గల్పికలు ..........
బోధనలు...........

కలిపి ప్రకటించిన సాహిత్యమే 'కిచిడి' . ఇది "నవరసాల సాహితీ పంచకం" గా అందిస్తున్నాను. అవధరించండి.
పుస్తకం చివరి అట్ట : 

Friday, January 18, 2013

తెలుగు యువత కు నేను అందిస్తున్న ప్రముఖ రచయితల 'చేవ్రాతలు'

తెలుగు యువత కు  నేను అందిస్తున్న ప్రముఖ రచయితల 'చేవ్రాతలు'
పుస్తకం పేరు : చేవ్రాతలు [ప్రముఖ సాహితీ వేత్తల ఉత్తరాలు]
1/8 డెమ్మీ , 100 పేజీలు, రూ 60/-
 పుస్తకం ముందు అట్ట :


1984 సం . నుండి 2010 సం వరకు ప్రముఖ రచయితలు నాకు వ్రాసిన ఉత్తరాలను యథాతదంగా ఇందులో ప్రచురించాను  . ఇందువల్ల , ముఖ్యంగా భవిష్యత్ తరాలకు వారి దస్తూరి చూచే అవకాశం కలిగించానని భావిస్తున్నాను.
ఇందులో ప్రచురించిన కొందరు  ప్రముఖ రచయితలు :
ఆరుద్ర, దాశరధి, కరుణశ్రీ, ఎమ్వీఎల్, కాళీపట్నం రామారావు, జోస్యుల సూర్యనారాయణ మూర్తి, మధురాంతకం రాజారామ్, పేర్వా రం జగన్నాధం, జి.వి. సుబ్రహ్మణ్యం, చేకూరి రామా రావు, అద్దేపల్లి రామమోహన రావు, సి. ధర్మ రావు , ఫై. చంద్ర శేఖర ఆజాద్, గూడా శ్రీరాములు, ఘండికోట బ్రహ్మాజీ రావు, జి. శ్రీరామమూర్తి, డి. సుజాతాదేవి, సిని దర్శకులు 'విశ్వనాధ్', సినీ నటులు 'పేకేటి శివరాం ', విశ్వ భరత్, త్రిపురనేని శ్రీనివాస్, శ్రీ కాట్రగడ్డ, శశికాంత్ శాతకర్ణి, సంజీవదేవ్, రావి రంగా రావు, పువ్వాడ తిక్కన సోమయాజి , పురాణం సుబ్రహ్మణ్య శర్మ, పెనుగొండ లక్ష్మి నారాయణ, నిఖిలేశ్వర్, నాగభైరవ కోటేశ్వర రావు, నాగసూరి వేణు గోపాల్ , మోనా , మండలి బుద్ధ ప్రసాద్, కొత్తపల్లి రవిబాబు, కోలపల్లి ఈశ్వర్, కొలకలూరి స్వరుపారాణి , ఈదుపల్లి వెంకటేశ్వర రావు, దొండపాటి  దేవదాస్, దేవరాజు మహారాజు, చిల్లర భవాని దేవి. భగ్వాన్ , ఆచార్య తిరుమల, మారేమండ శ్రీనివాస రావు, కొలకలూరి ఇనాక్, వల్లూరి శివ ప్రసాద్, అక్కిరాజు రామపతి రావు, జొర శర్మ, ఎమ్మార్ నాగేశ్వర రావు, దివికుమార్, వరిగొండ కాంతారావు, నిర్మలానంద, రామ్మోహన్ రాయ్ , సవ్వప్పగారి ఈరన్న, కాలువ మల్లయ్య, మాదిరాజు రంగా  రావు, వెలగా  వెంకటప్పయ్య, గోవిందరాజుల చక్రధర్, రెడ్డి రాఘవయ్య, అంబల్ల జనార్ధన్, జానమద్ది హనుమత్ శాస్రి , ఎవిఎమ్, సుంకర చలపతి రావు, కసిరెడ్డి వెంకట రెడ్డి, పేట శ్రీనివాసులు రెడ్డి, బీరం సుందర రావు, ములే రామముని రెడ్డి, పొద్దుటూరి ఎల్లారెడ్డి మొదలగు వారు. 

పుస్తకం వెనుక అట్ట :
 

Thursday, January 17, 2013

ఆంధ్రుల చరిత్ర మా ఊరిలోనే ప్రారంభమయింది!


రథం సెంటర్  



                                                                        బౌద్ధ స్తూపం 
                                                                   

మా వూరు  'భట్టిప్రోలు'
ఆంధ్రుల చరిత్ర మా ఊరిలోనే ప్రారంభమయింది. 'ధర్మా మృతం' అనే ప్రాచీన కన్నడ కావ్యం లో 'ప్రతీపాలపురం' ప్రస్తావన వుంది. క్రీస్తు.పూర్వం 5 వ శతాబ్దం లో యశోధరుడు అనే ఇక్ష్వాకు రాజు దక్షిణ దేశానికి    వలస  వచ్చి వేంగి రాజ్యం లో ని 'ప్రతీపాలపురం' రాజధానిగా రాజ్య పాలన చేసాడు.  ఈ ప్రతీ పాలపురమే నేటి మా వూరు 'భట్టిప్రోలు' గా  చారిత్రిక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ గుర్తించబడినది.
మా వూరు  ఆంధ్ర దేశం లోని గుంటూరు జిల్లా లో వుంది. ఆంధ్ర పారిస్ తెనాలికి 18 కి.మీ. దూరం లో వుంది. నేటికి మా ఊర్లో చేనేత పరిశ్రమ పై ఆధారపడిన కుటుంబాలు చాలా వున్నై. సారవంతమైన మైదానం లో కృష్ణ తీరం లో , సముద్ర తీరానికి సమీపం లో వుండటం వాళ్ళ పాడిపంటలకు పుష్కలంగా వుండే ప్రాంతమయినది. వరి ,పత్తి విస్తారంగా పండుతుంది.
ఇక్కడి బౌద్ద స్తూపం లో దొరికిన స్పటిక వరండాలు,స్వర్ణ పుష్పాల్లు,వెండిరేకుపై లేఖనం లాంటి వాటి ఆధారాల వాళ్ళ నటి ప్రజలు వివిధ చేతి పరిశ్రమలలో నైపుణ్యం గల వారని తెలుస్తోంది. మా ఊరిలోని బౌద్ధ క్షేత్రాన్ని విక్రమార్కుని కోట అనికూడా పిలుస్తారు. భట్టి- విక్రమర్కులలో భట్టి సేనాని పేరున ఈ నగరాన్ని విక్రమార్కుడు కట్టించి దానికి భట్టిప్రోలు అనే పేరు పెట్టాడనే నమ్మకం కూడా ప్రజల్లో వుంది. క్రీ.శ. 273 ల నటి మా వురి స్తూపం చరిత్ర తెలుసుకోవడానికి మొదటి నుండి పశ్చాత్యులే ఆసక్తి కనబరిచారు. 1892 లో అలేగ్జండర్ రీ , ఈ మహా స్తూపం వద్ద జరిపిన తవ్వకాలలో రాతి ధాతుకా ఖండాన్ని కనుగొన్నారు. ఆ తరువాత బుద్దుని శిరసు ప్రతిమను తీసారు. ఈ స్థూపమ్  చక్రాకారం పునాదులపై నిర్మితమయినది. 132 అడుగులు వేదిక , 148 అడుగుల వ్యాసం తో వుంది. 8 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పు గల ప్రదక్షిణా పధం నలువైపులా వుంది.
అశోకుని కాలంలో భట్టిప్రోలు నుంచి  సింహళానికి 14 లక్షల మంది యక్షులను, నాగులను బౌద్ధ గురువు తీసుకువెళ్ళాడని ఒక చారిత్రకాంశం .
బౌద్ధ స్తూపం దగ్గరలో మానేపల్లి వారి చెరువు వుంది. మంచినీటి సమస్య తో పెద్దలు చెరువు తవ్వించి , దానిలో 14 బావులు కూడా తవ్వించారు.
మా తాత ముత్తాతలు నుండి భట్టిప్రోలే మాది. మా నాన్న గారు దివంగతులు తాతా బసవలింగం గారు వున్నా వీధి చివర 'గురవాయి బావి ' వుండేది. మా వుల్లో ఆసుపత్రి, తో పాటుగా అన్ని ఆఫీసులు వున్నాయి . భట్టిప్రోలు పంచాయితీ ఆఫీసు కూడా వుంది. ఎవరికీ నష్టం వాటిల్ల కుండ ఇచ్చే తీర్పు తో 'భట్టిప్రోలు పంచాయితి' అనే పేరు ఏర్పడింది. కొన్ని ఛాయా చిత్రాలను ఇక్కడ ఇస్తున్నాను.

                                                       శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం



                                                               శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం


                                                     శ్రీ దండి పార్వతి అమ్మ వారి దేవస్థానం


                                                     మా వూరి  కలువ మీద వంతెన



                                                       మా వూరిలొ బస్సు లు ఆగు స్థలం



                                                         మా వూరిలొ  రైలు ఆగు స్థలం



                   మా వూరి పంచాయతి కార్యాలయం, ప్రక్కనే శ్రీ దుర్గ సినిమా మందిరం [ఇప్పుడు ఆడుట లేదు]



                                                                     క్రీస్తు రక్షక దేవాలయం



                                               మా వూరి కూరగాయల మార్కెట్ [గిరి మార్కెట్]



                                                    మా వూరి 'మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం


                                                   మా వూరి 'మండల విద్యా వనరుల కేంద్రం



                                               మా వురి 'మండల ప్రజా పరిషద్ కార్యాలయం '



                                                    మా వూరి 'ఓబిడ్ మహల్ల ఖబరస్థాన్ '



                                                        మా వూరి 'పార్వతి సినిమా హాలు "



                                                    మా వూరి ' పశువుల చికిత్సాలయం "




                                                 

           ఇది మా ఇల్లు . గురవాయి బావి వీధిలో వుంది. నా 5 సం లోపు బాల్యం అంతా ఇక్కడే గడచింది.


Tuesday, January 15, 2013

ప్రపంచ తెలుగు ప్రజలకు నేను అందిస్తున్న మరో పుస్తకం !

ప్రపంచ తెలుగు ప్రజలకు నేను అందిస్తున్న మరో పుస్తకం !
"పగటి వేషాలు -సామాజిక అంశాలు "
1/8 డెమ్మీ సైజు , వేల : రూ . 60/-
అట్ట మీద బొమ్మ : ' జానపద కళో త్సవం ' లో ప్రసంగిస్తున్న తాతా రమేశ్ బాబు



ప్రవేశిక

పగటి కలలు కనొద్దు అంటారు. పగటి వేషాలు వెయ్యొద్దు అని కూడా అంటారు.
వేషం అంటే మారు రూపం .
'రావణాసురుడు' జంగం దేవర వేషం లో ' సీత'ను మాయం చేస్తాడు. 'పూ తన ' అనే రాక్షషి అందమైన గోపిక వేషం లో బాలకృష్ణుడు నోటికి తన విష స్థానాలను అందిస్తుంది. 'ఇంద్రుడు' గౌతముని వేషంలో, గౌతముని అర్థాంగి 'అహల్య' చెంతకు చేరతాడు. 'ధర్మరాజు' 'కంకుభట్టు'గా,' భీముదు' 'వలలుడి ' గా , 'అర్జునుడు' 'పేడివాని ' గా, 'నకులుడు' 'తామ్రాగ్రంది' గా, 'సహదేవుడు' 'తంత్రీ పాలుడు' గా,  'ద్రౌపది' 'సైరంద్రి'గా వేషాలు వేస్తారు.
పగటి వేషాలు వేసే వారిలో చేరి, పోగొట్టుకున్న రాజ్యాన్ని పొందుతాడు రాజ కళింగ  గంగు. గాయక వేషాలు ధరించిన'మరాఠీ దండు' సింహగడ దుర్గం లో ప్రవేశించి 'శివాజీ' మహారాజుకు విజయం అందించారు. కాకతీయ యుగం లో మహామంత్రి ' యుగంధరుడు' 'పిచ్చి' వేషాన్ని ధరించి 'దిల్లి సుల్తాన్ పట్టుకు పోతన్' అంటూ  ప్రతాప రుద్ర దేవునికి ఓరుగల్లు సామ్రాజ్యాన్ని అందించాడు. గ్రీకు చక్రవర్తి 'అలేగ్సాండర్ ' రాజమాత వేషాన్ని ధరించి, భారతీయ ప్రతాప మూర్తి పురుషోత్తముని ఆస్థానం లో ప్రవేశించాడు.
ఏమైనా వేషం వెనుక అసలు రూపం తెలుసుకోవాలి. ఈ వేషాల వెనుక ఆనాటి నేపధ్యం వుంది. పురాణాలూ , ఇతిహాసాలు, మొదలైన వాటి లోంచి పుట్టుకు వచ్చిన వేషాలు , ఆనాటి, ఈనాటి , రేపటి జీవితాన్ని మనకు చూపిస్తాయి . సామాజిక పరిస్థితులు, మనిషి లోపలి విధ్వంసం గురించి చెప్తాయి. ఒక పరమ ప్రయోజన మాశించి మనిషిలో ఆశను కల్లిగిస్తాయి. మంచి జీవనానికి దిక్సూచిగా వుంటాయి.
ఈ పగటి వేషాల మూలాలు , తీరు, నేటి కళాకారులు ప్రదర్శించే విధానం, ఇందులోని సామాజిక అంశం మొదలైన వాటిని పరిశోదనాత్మకంగా వెలువడిన పుస్తకం ఇది.
అట్ట వెనుక బొమ్మ : పగటి వేషాల చాయాచిత్రాలు 

       పై బొమ్మ లో నేను ,మా బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు 
    క్రింది బొమ్మలో నేను, మిరియాల రామరాజు ప్రదర్శిస్తున్న 'మహాగారడి'.
                గమనిక: పై పుస్తకం www .kinige .com లో దొరుకుతుంది.

Monday, January 14, 2013

ఈ సంక్రాంతి శుభవేళ యావత్ తెలుగు ప్రపంచానికి నేను అందిస్తున్న రెండు కానుకలు

                       ఈ సంక్రాంతి శుభవేళ     యావత్ తెలుగు ప్రపంచానికి  నేను అందిస్తున్న రెండు     కానుకలు .
             http://kinige.com/kbook.php?id=1471&name=Telugu+Janapada+Kala 

                                1. తెలుగు జానపద కళ:
                           1/8 డెమ్మీ సైజు లో 272 పేజీలతో 
                                       వెల : రూ . 200/-
   పుస్తకం ముందు అట్ట : తోలి తెలుగు జానపద కళా చైతన్య యాత్రను         ప్రారంభిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానము ,ధర్మ ప్రచార పరిషద్ కార్యదర్శి డా . కసిరెడ్డి వెంకట రెడ్డి, యాత్ర రూపశిల్పి తాతా రమేశ్ బాబు.
                   జానపద కళ లను ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు  

       ది . 07,08,09 ఆగస్ట్ 2012 తేదిలలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో గుడివాడ నుండి ఆడ్డంకి దాకా తొలి ' తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను నేను రూపకల్పన చేసి మూడు రోజులు నిర్వహించటం జరిగింది. 
       ఈ యాత్ర ప్రారంభ సభ, ప్రారంభ పాదయాత్ర ల నుండి ముగింపు వరకు జరిగిన విశేషాలు, ఛాయా చిత్రాలతో సహా ముద్రించటం జరిగింది. తొలి రోజు కృష్ణ జిల్లా , 2 వ రోజు గుంటూరు జిల్లా , 3వ రోజు ప్రకాశం జిల్లా లలో  అద్భుతమయిన ప్రదర్శనలు జరిగిన తీరు ఇవ్వటం జరిగింది. ఇంకా పాల్గొన్న జానపద కళా కారుల ఛాయా చిత్రాలు , కీర్తి శేషులయిన జానపద కళాకారుల చిత్రాలు ,యాత్రలో పాల్గొన్న జానపద కళా పరిశోధకుల చాయా చిత్రాలు కూడా ముద్రించడం జరిగింది. 
       యాత్రనంతరం అందిన ఉత్తరాలు , తెలుగు జానపద కళా రూపాల పట్టిక లను కూడా ఇవ్వటం జరిగింది. 
      
        అనుబంధం గా 'తెలుగు జానపద కళ'ల పై ప్రముఖుల వ్యాసాలను  వ్రాయించి ప్రచురించటం జరిగింది . ఇందులో తెలుగు ప్రజల కళా రూపాలను 'ఆరుద్ర' వ్రాయగా,  డా. బి.జ్యోతి స్వరుపారాణి 'ప్రాచిన జానపద కళా రూపం-పగటివేశం', డా. దేవపాలన  ' జానపద సాహిత్యం-దళిత ఆదివాసిల చైతన్యం ', డా. చిట్టినేని శివ కోటేశ్వర రావు  ' తెలుగు నాటక ప్రదర్శనల్లో జానపద కళా రూపాలు ', డా. పేట శ్రీనివాసులు రెడ్డి ' జానపద కళ లు -సామాజి కాంశాలు ', విద్వాన్ జ్యోతి చంద్ర మౌళి ' ప్రకాశం జిల్లా జానపద కళలు', డా . దామర వెంకట సుబ్బారావు  ' బుర్రకథ -జానపద కళా రూపం', మహాత్మా ' జానపద కళలకు నిలయం గుంటూరు జిల్లా', డా. బీరమ్ సుందర రావు ' కళ సింగారం-భాష బంగారం', జి. రాధ 'జానపద కళా లు -నా అనుభవాలు', కొత్తపల్లి రవిబాబు ' ప్రజా సంస్కృ తోద్యమం -అనుభవాలు', 'జానపదాల్లో వైద్య ప్రసక్తి ', డా. మూలె రామముని రెడ్డి ' జానపద కళలో  సాహితీ సౌరభం ', డా కసిరెడ్డి వెంకట రెడ్డి' రామాయణ కళా రూపాల్లో కల్పనలు', డా. పొద్దుటూరి యెల్లారెడ్డి ' తెలంగాణ యక్ష గానం' , టి. ఉదయ శంకర్ ' జానపదాలు -ప్రజా కళా రూపాలు', తో పాటు 'పగటి వేషాలు -సామజి కాంశాలు ',  'తెలుగు వాకిట బొమ్మాలా ట ',  'కృష్ణాజిల్లా జానపద కళలు ' ,'కొన్ని జానపద కళా రూపాలు' మొదలయిన వ్యాసాలు వున్నాయి. 

                                    ఈ పుస్తకం వెనుక అట్ట :
                               యాత్రా విశేషాల చాయాచిత్ర మాలిక 
  
          తెలుగు జాతి, భాష , సంస్కృతి  సంపూర్ణంగా వర్ధిల్లాలంటే,  తెలుగు జానపదకళలు తెలుగునట్టింట నడయాడాలని సూచిస్తూ సాగిన ఈ జైత్రయాత్ర దిగ్విజయంగా జరిగింది. తెలుగు వారయిన ప్రతి ఒక్కరూ చదవ తగిన పుస్తకం ఇది. 
                                  1. తెలుగు జానపద కళ:
                           1/8 డెమ్మీ సైజు లో 272 పేజీలతో 
                                       వెల : రూ . 200/-
   పుస్తకం ముందు అట్ట : తోలి తెలుగు జానపద కళా చైతన్య యాత్రను         ప్రారంభిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానము ,ధర్మ ప్రచార పరిషద్ కార్యదర్శి డా . కసిరెడ్డి వెంకట రెడ్డి, యాత్ర రూపశిల్పి తాతా రమేశ్ బాబు.
                   జానపద కళ లను ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు  

       ది . 07,08,09 ఆగస్ట్ 2012 తేదిలలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో గుడివాడ నుండి ఆడ్డంకి దాకా తొలి ' తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను నేను రూపకల్పన చేసి మూడు రోజులు నిర్వహించటం జరిగింది. 
       ఈ యాత్ర ప్రారంభ సభ, ప్రారంభ పాదయాత్ర ల నుండి ముగింపు వరకు జరిగిన విశేషాలు, ఛాయా చిత్రాలతో సహా ముద్రించటం జరిగింది. తొలి రోజు కృష్ణ జిల్లా , 2 వ రోజు గుంటూరు జిల్లా , 3వ రోజు ప్రకాశం జిల్లా లలో  అద్భుతమయిన ప్రదర్శనలు జరిగిన తీరు ఇవ్వటం జరిగింది. ఇంకా పాల్గొన్న జానపద కళా కారుల ఛాయా చిత్రాలు , కీర్తి శేషులయిన జానపద కళాకారుల చిత్రాలు ,యాత్రలో పాల్గొన్న జానపద కళా పరిశోధకుల చాయా చిత్రాలు కూడా ముద్రించడం జరిగింది. 
       యాత్రనంతరం అందిన ఉత్తరాలు , తెలుగు జానపద కళా రూపాల పట్టిక లను కూడా ఇవ్వటం జరిగింది. 
      
        అనుబంధం గా 'తెలుగు జానపద కళ'ల పై ప్రముఖుల వ్యాసాలను  వ్రాయించి ప్రచురించటం జరిగింది . ఇందులో తెలుగు ప్రజల కళా రూపాలను 'ఆరుద్ర' వ్రాయగా,  డా. బి.జ్యోతి స్వరుపారాణి 'ప్రాచిన జానపద కళా రూపం-పగటివేశం', డా. దేవపాలన  ' జానపద సాహిత్యం-దళిత ఆదివాసిల చైతన్యం ', డా. చిట్టినేని శివ కోటేశ్వర రావు  ' తెలుగు నాటక ప్రదర్శనల్లో జానపద కళా రూపాలు ', డా. పేట శ్రీనివాసులు రెడ్డి ' జానపద కళ లు -సామాజి కాంశాలు ', విద్వాన్ జ్యోతి చంద్ర మౌళి ' ప్రకాశం జిల్లా జానపద కళలు', డా . దామర వెంకట సుబ్బారావు  ' బుర్రకథ -జానపద కళా రూపం', మహాత్మా ' జానపద కళలకు నిలయం గుంటూరు జిల్లా', డా. బీరమ్ సుందర రావు ' కళ సింగారం-భాష బంగారం', జి. రాధ 'జానపద కళా లు -నా అనుభవాలు', కొత్తపల్లి రవిబాబు ' ప్రజా సంస్కృ తోద్యమం -అనుభవాలు', 'జానపదాల్లో వైద్య ప్రసక్తి ', డా. మూలె రామముని రెడ్డి ' జానపద కళలో  సాహితీ సౌరభం ', డా కసిరెడ్డి వెంకట రెడ్డి' రామాయణ కళా రూపాల్లో కల్పనలు', డా. పొద్దుటూరి యెల్లారెడ్డి ' తెలంగాణ యక్ష గానం' , టి. ఉదయ శంకర్ ' జానపదాలు -ప్రజా కళా రూపాలు', తో పాటు 'పగటి వేషాలు -సామజి కాంశాలు ',  'తెలుగు వాకిట బొమ్మాలా ట ',  'కృష్ణాజిల్లా జానపద కళలు ' ,'కొన్ని జానపద కళా రూపాలు' మొదలయిన వ్యాసాలు వున్నాయి. 

                                    ఈ పుస్తకం వెనుక అట్ట :
                               యాత్రా విశేషాల చాయాచిత్ర మాలిక 
  
          తెలుగు జాతి, భాష , సంస్కృతి  సంపూర్ణంగా వర్ధిల్లాలంటే,  తెలుగు జానపదకళలు తెలుగునట్టింట నడయాడాలని సూచిస్తూ సాగిన ఈ జైత్రయాత్ర దిగ్విజయంగా జరిగింది. తెలుగు వారయిన ప్రతి ఒక్కరూ చదవ తగిన పుస్తకం ఇది. 
                            జై జానపదం! , జైజై జానపదం !

        
      









: