My Blog List

Thursday, January 24, 2013

పగటి వేషాలు -ఫకీరు సాయిబు వేషం

పగటి వేషాలు -ఫకీరు సాయిబు వేషం

 

"రోజ్ దారో సహారా కి టైం ఆదాహా రహిహై "
(ఉపవాసం వుండే వారికి సమయ మయినది లేవండి )
- అంటూ తెల్ల వారు ఝామున 4 గంటలకు వినపడ్డాయి అంటే ,ఖచ్చితంగా అది ముస్లిం పవిత్ర 'రంజాన్' మాసం అయి వుంటుంది . పై మాటలు ఫకీర్ సాయిబు పలుకులు అయి వుంటాయి.
"లా ఇలాహ ఇల్లల్లా ,మూరే మేహంమాద్ సులేల్లా"
(ముత్యాలతో వుంటాడు దేముడు)
అనే గానం వినపడితే ,అది 'మొహర్రం 'పండుగే!
మసీద్ నుండి జెండా లేపుతూ,
"ఆవో అల్లా హం జండా ఉతా రహిహై
యా అల్లా హబ్ సబ్ మందిర్ మే గీత గాయే "
అంటూ గానం చేసేది కూడా ఫకీర్ సాయిబులే!
పవిత్ర రంజాన్ నెలలో ప్రతి రొజూ తెల్ల వారు ఝామున 4 గంటలకు అల్లా భక్తులను మేలు కోల్పుతూ ఉంటాడు. మిగతా రోజులలో ప్రతి శుక్ర వారం ఉదయం 9 గం. నుండి 11 గం. వరకూ మరియు సాయంత్రం 4 గం. నుండి 6 గం. వరకూ అల్లా ని ప్రార్థిస్తూ ,గడప గడపకు తిరుగు తాడు ఫకీర్ . అజ్మీర్ దర్గా నుండి సాధారణ దర్గాల వరకూ అల్లాని ప్రార్థిస్తూ జీవిస్తుంటారు ఫకీర్ లు .
ప్రతి సం. మర్చి నెలలో కృష్ణా జిల్లా ,గుడివాడ లో 'గౌస్ లాజం దస్తగీర్ 'పేరు మీద 'గారెమి' ఉత్సవాలు జరుగుతాయి. నెలపొడుపు తరువాత 11 రొజూ నుండి నెల లోపు పండుగ ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు.'వలి అల్లా ' అంటే దేవుని భక్తుని మీద పండుగ చేస్తారు.
ప్రజలు తమ కోరికలు చెప్పి వలీఅల్లా కు మొక్కుతారు. పండుగలో మొక్కును తీర్చుకోవటానికి 'జెండా'లు తీస్తారు. కొన్ని వందల జండాలు వుంటాయి ఇక్కడ. గ్యారామి లో' గ్యా' అంటే 11 . వలీ అల్లా పేరు మీద 11 రోజులు ఉత్సవాలు జరుపు తారు . కోరికలు చెప్పుకొని మొక్కిన వారి కోరికలు తీర్చ టానికి వలీ అల్లా లలో పెద్దవాడయిన 'గౌస లాజం దస్తగీర్'మున్డుమ్టాడని ప్రతీతి. గుంటూరు మస్తాన్ వలీ,పెదకాకాని బాజీ షహీర్ బాబా ,అజ్మీర్ లో ఖాజా గరీబ్ నవాజ్ ,నెల్లూరు దగ్గర హజరత్ ఖాజా రహ్మతుల్లా,రహ్మితున్నిసా ...ఇలా ముస్లిం లలో ముక్కోటి 'వలీఅల్లా' లు వుంటారు.
ముఖ్యంగా ఉత్సవాలలో గంధం తీస్తారు. ఒక గుర్రం మీద గంధం బిందె ను పట్టుకున్న మనిషి ని ఊరేగిస్తారు. ఊరేగింపు ముందుగా జెండాలు నడుస్తాయి. జెండా కి పులు ఆలంక రిస్తారు. అనంతరం రోగాలతో బాధ పడుతున్న వారి కి ,కావలసిన వారికి, గంధం పంచుతారు. గంధం ఒంటిమీద రాసుకుంటే సర్వ రోగాలు తగ్గుతాయని నమ్ముతారు.
ఇక్కడ పకీర్లు మేళాగా ,వలీ అల్లా ను పొగుడుతూ పాడుతారు.
ఇందుకు గాను భక్తులు వీరికి బియ్యం ,డబ్బులు ఇస్తుంటారు.
సంపాదన అంతా మల్లి ప్రజలకే ఉపయోగిస్తారు పకీర్ లు
"బరాటను తిప్పుతూ ఉర్దూ యాసతో తెలుగు మాట్లాడ తారు . తన్వుకి ప్రానాంకి అచ్చాబంధం హై సాబ్. ఓక్ దాన్కి బాద్ వస్తే రెండ్ దాన్కి వస్తాది. అడ్వికి బోయి జిల్కన్ దేస్తం.పన్జరం లో పెట్టి అచ్చా గా తిన్ పిస్తం .అలవాట్ అయిందని పన్జరం తెర్చామా,చేప్పకుండా దౌడ్ తీస్తాది . దేహం అనే పన్జరం నుంచి జీవం అనే జిల్క ఎగిరి పోద్ది సాబ్. మాదీ మాటా వింటే ,దర్మం చేస్తే మీది జిల్క పోదు . అల్లా చుస్తాడ్ సబ్."
ఇలా సాగుతుంది ఫకీర్ సంభాషణ.

'ఫకీర్' అంటే ఎవరు?

'ఫై' అంటే ఆకలి దప్పులతో వుండాలి. 'కాఫ్'అంటే దైవ ధ్యానాన్ని లీనమై చేయాలి. ఖినాత్ వుండాలి అంటే వున్న దాంట్లోనే సర్దు బాటు చేసు కోవాలి. దైవ ధ్యానంలో వుండాలి అనే తృష్ణ కలిగి వుండాలి. యాద్ఎ ఇలాహి అంటే ఎప్పుడూ ,పడుకున్నాలేచినా 24 గంటలు దైవాన్ని స్మరిస్తూ వుండాలి. 'రే'అంటే రాగ ద్వేషాలకు దూరంగా ఉండి,'రియాజ్'అంటే తపస్సు చేయాలి. దైవాన్ని, దైవత్వాన్ని అధ్యయనం చేస్తుండాలి.
నాలుగు ఉత్తమ గుణాలున్న వాడూ 'ఫకీర్'.
ముస్లిం జాతిలో రుషి లాంటి వాడూ ఫకీర్. ఫకీర్ గా మారటానికి అన్ని త్యాగం చేయాలి . వీరు అల్లా కి పుత్రులు గా గౌరవింప బడతారు.
ఫకీర్ గా మారాలను కుంటే ,మారాలనుకున్న వ్యక్తికి గడ్డం,మీసాలుతో సహా అతని శరీరం మీద రకమైన వెంట్రుకలు ఉండకుండా తీయాలి. తరువాత వారికి 'కఫన్' అంటే మరణించిన వారికి తొడిగే తెల్లని గుడ్డ తో అలంకరిస్తారు. శాస్త్ర యుక్తంగా ,ఇతను మానవుడు కాడు,ఫకీర్లో కలసి పోయావు అనే అర్థం వచ్చే మంత్రాలు చదువుతూ ఒక గొయ్యి తీసి అందులో పడుకో బెడతారు. గోతిని కప్పుతారు. గాలి పీల్చుకుని బతకడం కోసం గోతి ఉపరి తలంపై కొన్ని రంద్రాలు వుంచుతారు. ఇలా మంత్రాలతో శుద్ధి చేసి ,నిష్టా గరిష్టుడను చేసిన తరువాత మూడు రోజుల అనంతరం గోతి నుండి బయటకు తీస్తారు.
ఇప్పుడు పరిశుభ్రం గా స్నానం చేయించి ఆకు పచ్చని రంగులో వున్న పైజామా ను ధరింప చేస్తారు. 'దఫ్' అంటే డప్పు చేతికి ఇస్తారు. 'కంజరి' అని అంటారు డప్పుని. 'దఫ్'పైన ఒకటి లేదా రెండు దెబ్బలే వేయాలి. అలాంటి దరువులే వుపయో గించాలి పడేటప్పుడు ఫకీర్.
ఇప్పుడు మామూలు మనిషి ఉద్రేకించ బడిన' ఫకీర్' అయినట్లే .
తరవాత ఫకీర్ ఇహ లోకం గురించి పట్టించు కోడు ,మాట్లాడాడు. మరణించిన తరువాత విషయాల గురించి ,పై లోకం గురించి మాత్రమే చర్చిస్తాడు.
18 గాజా లున్న గుడ్డను ఇస్తారు ,దీనితో 'పట్కా'అనే తలపాగా చుట్టూ కుంటాడు.
ఫకీర్ లలో నాలుగు రకాలు వుంటారు.
మొదటివాడు'ఖలందర్'అంటే ,'జబర్దస్తి'చేస్తాడు .సాహసం కలవాడు. ఇతరుల దగ్గరకు వెళ్లి నప్పుడు ,వారు ఇవ్వగలిగింది అంచనా వేసి అడుగుతాడు. ఇవ్వక పొయినా ,'జారేజ' అన్నా అక్కడే క్రింద పది ప్రాణాలు వదలటానికయిన సిద్ద పడతాడు.
రెండవ వాడు 'దర్వేష్' ,అంటే జాలి గుండె కల వాడు. ఏమిచ్చినా తీసుకుంటాడు.
మూడవ వాడు'రహేనుమా' ,అంటే మార్గ దర్శకుడు. నైతిక మార్గం చెప్పి మార్గ దర్శనం చేస్తాడు. దైవత్వం వైపుకు వెళ్తాడు .
నాలుగవ వాడు 'గోషనషి' ,అంటే అజ్ఞాతం లో వుంటారు. ఎవరితో కలవారు. దైవంలో లీనమై పోతారు. 'షా సబ్ జరా జాయిం 'అంటారు. కోపం తెప్పిం చరు.
పై నాలుగు ఫకీర్ లకు సన్మార్గం చూపెట్ట టమే,జీవ లక్షణం.
వీరిని 'సూఫియ క్రం' అంటారు.ఎవరికీ హాని చేయరు. మేలు చేస్తారు.సాధు జంతువులు,పర్యాటనలు చేస్తారు. . 'సయ్యా' అంటే పర్యాటకుడు. అందుకే వీరిని 'సాయి' అంటారు. ఎక్కడికి వెళ్లటాని కయినా ఎవరూ అభ్యంతరం చెప్పారు వీరికి.
రవాణా సౌకర్యాలు లేని రోజులలో ,ఇతర చోట్ల వున్న బంధువుల ఉనికి ని తెలియ చేసేవారు.
చిట్కా వైద్యం చేస్తారు. పసి పిల్ల వాడికి నీరుడు బంద్ అయితే సుద్ధ ని నీటితొ కలిపినా మిశ్రమాన్ని , పిల్లవాడి బొద్దు మీద రాస్తే,నీరుడు వచ్చేది.ఇదో చిట్కా.
ఫకీర్లు ఎక్కడ బస చేస్తున్నారో తెలుసుకొని ,ప్రజలు అక్కడికి వెళ్లి ధాన్యము వగైరాలు ఇచ్చేవాళ్ళు. వచ్చిన ధనమంతా,'లంగర్ ఖానా' అనే ఉచిత భోజన శాలలో భోజనం పెట్టటానికి ఉపయోగిస్తారు.
కొంత మంది ఫకీర్ లు గుండ్రం గా నుంచుని భజన చేస్తారు. దీనిని 'సుమా' అంటారు. లా ఇలాహా ఇల్లల్లా అంటే దేవుడు తప్ప ఎవరూ పూజ్యులు కాడు అని చెప్పే మూలమంత్రం నుండి అనువుగా వుండే కీర్తనల తో భజన చేస్తారు.
17 శతాబ్దం లో రాజుల కి సీక్రెట్ ఎజంట్స్ గా పని చేసేవారు. ఆలిం మాలిక్ రాజ్యాలను జయించి పెట్టారు.

పగటి వేష ప్రదర్శన :

" ధంకా కహా భరోసా ,అల్లా నబిర్ కేలో తమాషా
మహమ్మద్ కి అల్లాహై తూ,యహ నికల్ రహ హై "
(అల్లా ,నబిర్ లు తమాషా చెయ్యండి. డప్పు నాకు భరోసా ఉండి. మహమ్మదీయుల అల్లా నువ్వు ,ఇక్కడ వున్నావు)
అని పాడుతూ ,అనుగుణంగా డప్పు వాయిస్తూ వస్తారు. సుమారు 6 నుండి 8 మంది వరకూ వుంటారు . మెడలో తావీజు ,కళ్ళ కు సుర్మ పెట్టుకుంటారు. పచ్చని ,నారింజ,తెలుపు రంగు పూసల దండలు మెడలో వుంటాయి . పెద్ద చొక్కా,గల్ల లుంగి కట్టు కుంటారు. తలకు చిలక పచ్చని పాగా చుట్టుకుం టారు.
ఒకరి చేతిలో గిరిక
ఒకరి చేతిలో ఫకీరు చెప్పు (భిక్ష పాత్ర)
మిగిలిన వారు కంజరి పట్టుకుంటారు.
"ఆవులల్లాకి బేటా, ఫకీరు సాయిబులం " అనుకుంటూ వస్తారు. బాజిర్,అక్షయ పాత్ర,లైటు తీసుకుని బయలు దేర తారు. హిందూ ముస్లిం బేధం లేకుండా అందరి ఇళ్ళకు వస్తారు. గజల్స్ పాడుతూ, వాటి అర్థాన్ని తెలుగు లో చెపుతూ ,ప్రతి ఇంటి వద్ద దీవనలు చెప్తారు.
"అల్లా కి పుత్రులం మనం . అల్లా అంటే భగవంతుడు . భగవంతుడు మనకు అనేక రకాలుగా వున్నాడు. మనం వయసులో వున్నపుడు పెంచిన కండల్ని ,సంపదని చూసుకుని ,బందు మిత్రులను చూసుకుని గర్వ పడుతూ ,సాటి వాడిని బాధ పెదతం. సతి వాడికి హాని చేస్తే అల్లా క్షమించడు.
ప్రాణ మనేది ఒక చిలుక లాంటిది. చిలుకను తెచ్చి దేహమనే పంజరం లో బంధిం చారు. కాని పంజరం తలుఉలు ఎప్పుడూ తీస్తే అప్పుడు పరి పోవటానికి సిద్దంగా వుంటుంది. పంజరమనే దేహం భగవంతునిపై ఆధారపడి ఉండి. భగవంతుడు పంజరం తలుపు ఎప్పుడూ తీస్తే ,అప్పుడు ప్రాణమనే చిలుక పారి పోతుంది. ప్రాణం అనే చిలుకను ఎంత దాచి పెట్టినా,అది పారి పోవాలనే చూస్తుంది. కాబట్టి చిలుక ఉన్నంత వరకే ప్రాణం .చిలుక వున్నంతవరకే పంజరం. చిలుక పోయాక పంజరాన్ని పాట సామానుల వాడికి ఇస్తాం. దేహాన్ని ఖర్చు పెట్టి పూడుస్తాం ,ఖననం చేస్తాం.
ఒక ఏనుగు చనిపోతే దాని అంకుశం మిగులుతుంది
ఒక గుర్రం చనిపోతే దాని వీపు మీద వేసే 'జీనుగ' మిగిలి పోతుంది
ఒక డేటా చనిపోతే అతని పేరు మిగిలి పోతుంది
కాబట్టి మనిషికి వుదారత్వం కావాలి .అందర్నీ గౌరవించాలి,పూజించాలి. అల్లా ని ధ్యానించాలి.
శరీరాన్ని చూసి మోస పోవద్దు . శరీరం అనేది కేవలం తొమ్మిది రంద్రాల తోలు బొమ్మ . కాబట్టి కడుపు లో ఎన్నో దుర్ఘంద పదార్ధాలు వున్నాయి. సుఘంధ పరిమళాల తో పోషించినా ,చనిపోయిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?
ఆత్మ వెళ్ళిన దేహం అగ్ని హోత్రుని పాలు
కఠిన శల్యములు గంగ పాలు
మీద కప్పిన దుప్పటి చాకలి పాలు
కొడుకు పెట్టినా కుడు కాకుల పాలు
దాచి పెట్టినధనము ధనుడి పాలు
భ్రష్ట పెళ్లమేమో పరుల పాలు
అందుకే ,ఏది, ఎవరికీ తోడూ రావు కాబట్టి , ఆత్మ చాల గొప్పది.పరమాత్మ ఇంకా గొప్పది. ఆత్మ,పరమాత్మ ఒక్కటైతే మానవుడు సాధించేది చాల ఉండి. పంజరం దాటి చిలుక అడవి లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అడవి అనే లోకంలో చిలక లాగా జీవిం చాలి . పంజరాన్ని కాపాడు కోవాలి . చిలక పలుకులు పలకాలి.
"అల్లా కి రూప్ హమరే సాత్ రహే తక్ హం జీ సక్తే
వహి నహి తో హం నహిజి సక్తే "
(దేవుడు మనతో ఉన్నంత వరకే మనం బతక గళం. లేకపోతె బతక లేం)
మనం ఇహ లోకంలో పడే సుఖ దుఖాలను విడిచి దేవుడ్ని ప్రార్ధించాలి. అలా నిష్ఠ తో ప్రార్థించే వాడే స్వర్గానికి వెళ్తాడు.
" ఆద్మీ సుక్ దుక్ సే లోక్ కర్ అల్లా కే ప్యార్ కరనేసే
వహి ఆద్మీ జన్నత్ కు జాతా హై '
(అలాగే సతి మనిషిని హింసించి ,బాధ పెట్టె వాళ్ళు "జోజక్ పహంచ్ హై " -నరకానికి వెళ్తాడు.
దుష్టులకు కను విప్పు కలిగిస్తూ ,దుర్మార్గులని సంమార్గులుగా నడిపిస్తూ ,సాగుతుంది వేషం .
భిక్ష ను తీసుకుని చివరిగా దీవిస్తారు....
"ఆవులిల్లకా బాదర్ కి బేటా బేతి సుఖనందర్ కే
ఆవు లైం లాక్ మేర బాప జీతే రామ్ "
(అల్లా పిల్ల లయిన మీరందరు సుఖం గా ,ఆనందం గా జీవించండి ) అంటారు.
హిందూ మతస్తులకు ,ముస్లిం మతదేవుడిని పరిచయం చేసి , దేవుడైనా ఆకాంక్షించేది ఒకటే అనే ధర్మాన్ని తెలియ చేస్తారు.
( పై వ్యాసం "పగటివేషాలు-సామాజికాంశాలు " పుస్తకం నుండి . 
ఈ పుస్తకం www .Kinige .com లో లభ్యమగును. )


No comments:

Post a Comment