My Blog List

Tuesday, January 15, 2013

ప్రపంచ తెలుగు ప్రజలకు నేను అందిస్తున్న మరో పుస్తకం !

ప్రపంచ తెలుగు ప్రజలకు నేను అందిస్తున్న మరో పుస్తకం !
"పగటి వేషాలు -సామాజిక అంశాలు "
1/8 డెమ్మీ సైజు , వేల : రూ . 60/-
అట్ట మీద బొమ్మ : ' జానపద కళో త్సవం ' లో ప్రసంగిస్తున్న తాతా రమేశ్ బాబు



ప్రవేశిక

పగటి కలలు కనొద్దు అంటారు. పగటి వేషాలు వెయ్యొద్దు అని కూడా అంటారు.
వేషం అంటే మారు రూపం .
'రావణాసురుడు' జంగం దేవర వేషం లో ' సీత'ను మాయం చేస్తాడు. 'పూ తన ' అనే రాక్షషి అందమైన గోపిక వేషం లో బాలకృష్ణుడు నోటికి తన విష స్థానాలను అందిస్తుంది. 'ఇంద్రుడు' గౌతముని వేషంలో, గౌతముని అర్థాంగి 'అహల్య' చెంతకు చేరతాడు. 'ధర్మరాజు' 'కంకుభట్టు'గా,' భీముదు' 'వలలుడి ' గా , 'అర్జునుడు' 'పేడివాని ' గా, 'నకులుడు' 'తామ్రాగ్రంది' గా, 'సహదేవుడు' 'తంత్రీ పాలుడు' గా,  'ద్రౌపది' 'సైరంద్రి'గా వేషాలు వేస్తారు.
పగటి వేషాలు వేసే వారిలో చేరి, పోగొట్టుకున్న రాజ్యాన్ని పొందుతాడు రాజ కళింగ  గంగు. గాయక వేషాలు ధరించిన'మరాఠీ దండు' సింహగడ దుర్గం లో ప్రవేశించి 'శివాజీ' మహారాజుకు విజయం అందించారు. కాకతీయ యుగం లో మహామంత్రి ' యుగంధరుడు' 'పిచ్చి' వేషాన్ని ధరించి 'దిల్లి సుల్తాన్ పట్టుకు పోతన్' అంటూ  ప్రతాప రుద్ర దేవునికి ఓరుగల్లు సామ్రాజ్యాన్ని అందించాడు. గ్రీకు చక్రవర్తి 'అలేగ్సాండర్ ' రాజమాత వేషాన్ని ధరించి, భారతీయ ప్రతాప మూర్తి పురుషోత్తముని ఆస్థానం లో ప్రవేశించాడు.
ఏమైనా వేషం వెనుక అసలు రూపం తెలుసుకోవాలి. ఈ వేషాల వెనుక ఆనాటి నేపధ్యం వుంది. పురాణాలూ , ఇతిహాసాలు, మొదలైన వాటి లోంచి పుట్టుకు వచ్చిన వేషాలు , ఆనాటి, ఈనాటి , రేపటి జీవితాన్ని మనకు చూపిస్తాయి . సామాజిక పరిస్థితులు, మనిషి లోపలి విధ్వంసం గురించి చెప్తాయి. ఒక పరమ ప్రయోజన మాశించి మనిషిలో ఆశను కల్లిగిస్తాయి. మంచి జీవనానికి దిక్సూచిగా వుంటాయి.
ఈ పగటి వేషాల మూలాలు , తీరు, నేటి కళాకారులు ప్రదర్శించే విధానం, ఇందులోని సామాజిక అంశం మొదలైన వాటిని పరిశోదనాత్మకంగా వెలువడిన పుస్తకం ఇది.
అట్ట వెనుక బొమ్మ : పగటి వేషాల చాయాచిత్రాలు 

       పై బొమ్మ లో నేను ,మా బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు 
    క్రింది బొమ్మలో నేను, మిరియాల రామరాజు ప్రదర్శిస్తున్న 'మహాగారడి'.
                గమనిక: పై పుస్తకం www .kinige .com లో దొరుకుతుంది.

No comments:

Post a Comment