My Blog List

Thursday, January 17, 2013

ఆంధ్రుల చరిత్ర మా ఊరిలోనే ప్రారంభమయింది!


రథం సెంటర్  



                                                                        బౌద్ధ స్తూపం 
                                                                   

మా వూరు  'భట్టిప్రోలు'
ఆంధ్రుల చరిత్ర మా ఊరిలోనే ప్రారంభమయింది. 'ధర్మా మృతం' అనే ప్రాచీన కన్నడ కావ్యం లో 'ప్రతీపాలపురం' ప్రస్తావన వుంది. క్రీస్తు.పూర్వం 5 వ శతాబ్దం లో యశోధరుడు అనే ఇక్ష్వాకు రాజు దక్షిణ దేశానికి    వలస  వచ్చి వేంగి రాజ్యం లో ని 'ప్రతీపాలపురం' రాజధానిగా రాజ్య పాలన చేసాడు.  ఈ ప్రతీ పాలపురమే నేటి మా వూరు 'భట్టిప్రోలు' గా  చారిత్రిక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ గుర్తించబడినది.
మా వూరు  ఆంధ్ర దేశం లోని గుంటూరు జిల్లా లో వుంది. ఆంధ్ర పారిస్ తెనాలికి 18 కి.మీ. దూరం లో వుంది. నేటికి మా ఊర్లో చేనేత పరిశ్రమ పై ఆధారపడిన కుటుంబాలు చాలా వున్నై. సారవంతమైన మైదానం లో కృష్ణ తీరం లో , సముద్ర తీరానికి సమీపం లో వుండటం వాళ్ళ పాడిపంటలకు పుష్కలంగా వుండే ప్రాంతమయినది. వరి ,పత్తి విస్తారంగా పండుతుంది.
ఇక్కడి బౌద్ద స్తూపం లో దొరికిన స్పటిక వరండాలు,స్వర్ణ పుష్పాల్లు,వెండిరేకుపై లేఖనం లాంటి వాటి ఆధారాల వాళ్ళ నటి ప్రజలు వివిధ చేతి పరిశ్రమలలో నైపుణ్యం గల వారని తెలుస్తోంది. మా ఊరిలోని బౌద్ధ క్షేత్రాన్ని విక్రమార్కుని కోట అనికూడా పిలుస్తారు. భట్టి- విక్రమర్కులలో భట్టి సేనాని పేరున ఈ నగరాన్ని విక్రమార్కుడు కట్టించి దానికి భట్టిప్రోలు అనే పేరు పెట్టాడనే నమ్మకం కూడా ప్రజల్లో వుంది. క్రీ.శ. 273 ల నటి మా వురి స్తూపం చరిత్ర తెలుసుకోవడానికి మొదటి నుండి పశ్చాత్యులే ఆసక్తి కనబరిచారు. 1892 లో అలేగ్జండర్ రీ , ఈ మహా స్తూపం వద్ద జరిపిన తవ్వకాలలో రాతి ధాతుకా ఖండాన్ని కనుగొన్నారు. ఆ తరువాత బుద్దుని శిరసు ప్రతిమను తీసారు. ఈ స్థూపమ్  చక్రాకారం పునాదులపై నిర్మితమయినది. 132 అడుగులు వేదిక , 148 అడుగుల వ్యాసం తో వుంది. 8 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పు గల ప్రదక్షిణా పధం నలువైపులా వుంది.
అశోకుని కాలంలో భట్టిప్రోలు నుంచి  సింహళానికి 14 లక్షల మంది యక్షులను, నాగులను బౌద్ధ గురువు తీసుకువెళ్ళాడని ఒక చారిత్రకాంశం .
బౌద్ధ స్తూపం దగ్గరలో మానేపల్లి వారి చెరువు వుంది. మంచినీటి సమస్య తో పెద్దలు చెరువు తవ్వించి , దానిలో 14 బావులు కూడా తవ్వించారు.
మా తాత ముత్తాతలు నుండి భట్టిప్రోలే మాది. మా నాన్న గారు దివంగతులు తాతా బసవలింగం గారు వున్నా వీధి చివర 'గురవాయి బావి ' వుండేది. మా వుల్లో ఆసుపత్రి, తో పాటుగా అన్ని ఆఫీసులు వున్నాయి . భట్టిప్రోలు పంచాయితీ ఆఫీసు కూడా వుంది. ఎవరికీ నష్టం వాటిల్ల కుండ ఇచ్చే తీర్పు తో 'భట్టిప్రోలు పంచాయితి' అనే పేరు ఏర్పడింది. కొన్ని ఛాయా చిత్రాలను ఇక్కడ ఇస్తున్నాను.

                                                       శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం



                                                               శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం


                                                     శ్రీ దండి పార్వతి అమ్మ వారి దేవస్థానం


                                                     మా వూరి  కలువ మీద వంతెన



                                                       మా వూరిలొ బస్సు లు ఆగు స్థలం



                                                         మా వూరిలొ  రైలు ఆగు స్థలం



                   మా వూరి పంచాయతి కార్యాలయం, ప్రక్కనే శ్రీ దుర్గ సినిమా మందిరం [ఇప్పుడు ఆడుట లేదు]



                                                                     క్రీస్తు రక్షక దేవాలయం



                                               మా వూరి కూరగాయల మార్కెట్ [గిరి మార్కెట్]



                                                    మా వూరి 'మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం


                                                   మా వూరి 'మండల విద్యా వనరుల కేంద్రం



                                               మా వురి 'మండల ప్రజా పరిషద్ కార్యాలయం '



                                                    మా వూరి 'ఓబిడ్ మహల్ల ఖబరస్థాన్ '



                                                        మా వూరి 'పార్వతి సినిమా హాలు "



                                                    మా వూరి ' పశువుల చికిత్సాలయం "




                                                 

           ఇది మా ఇల్లు . గురవాయి బావి వీధిలో వుంది. నా 5 సం లోపు బాల్యం అంతా ఇక్కడే గడచింది.


No comments:

Post a Comment