చిత్రించిన గ్రీటింగ్ కార్డులు
రకరకాల గ్రీటింగ్ కార్డ్లు అచ్చులో దొరుకుతున్నా , సహజంగా చిత్రాలు గీసి ... వాటిని గ్రీటింగ్ కార్డులుగా మలచి .... జీవనాన్ని సాగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. అవును నాకు మరో వుద్యోగం లేదు. జీవించాలంటే డబ్బు కావాలి కదా?
ప్రస్తుతానికి ఈ నిర్ణయమే సరి అయినదని అనిపించింది.
పాత విజిటింగ్ కార్డులు, పెళ్లి కార్డులు, వగైరా సేకరించాను . వాటి వెనుక బొమ్మలు గీసి , రంగులు చిత్రించా . అధ్భుతమ్.
ఇక వెనుకకు తిరిగి చూసుకోలెదు . అనతికాలంలోనే ఒక్కరోజుకు 500 బొమ్మలు చిత్రించటం అలవాటు చేసుకొన్నా. అవన్నీ కలిపి 'చిత్రకారుడు చిత్రించిన గ్రీటింగ్ కార్డులు' అనే బ్యానర్ కట్టి స్టాల్ తెరిచా. కొనడం మొదలు పెట్టారు . మాకు ఫలానా బొమ్మ కావాలని ఆర్డర్ ఇవ్వటం కూడా మొదలయింది . ఉత్సాహంగా విజయవాడ, గుంటూరు పట్టణాలలో స్టాల్ ప్రారంబించా .
1985 లో 'ఇండియన్ ఎక్ష్ప్రెస్' అనే ఆంగ్ల దినపత్రిక లో నా గురించి ఒక వ్యాసం ప్రచురించింది . చూడండి
ఆ తరువాత డ్రాయింగ్ టీచర్ వుద్యోగం రావటం జరిగింది .
మా పాటశాల లో నూటికి నూరుమంది , దారిద్ర్య రేఖకు దిగువనవున్న వారే. వారికి చిత్ర కళ నేర్పుతూ , ఆర్ధిక ఆసరా కలిగిస్తుందనే ఉద్దేశ్యం తో స్క్రీన్ ప్రింటింగ్ , గ్రీటింగ్ కార్డు ల తయారి లలో శిక్షణ ఇచ్చాను.
ఎంతోమంది ఆ పనులలో జీవితాన్ని జీవిస్తున్నారు .
2002 వ సం వార్త దిన పత్రికలో పై వ్యాసంగాన్ని గురించిన వ్యాసం ప్రచురించారు . చూడండి .
మీ అభిప్రాయం తెలపండి . ధన్యవాదాలు

ఒకరోజు లో 500 బొమ్మలా?అభినందనలు మీకు .
ReplyDelete