ది. 03. 06. 2013 న ఉదయం విజయవాడ అల్ ఇండియా రేడియో లో నా కథ ' విశాలి డైరీ' ని రికార్డ్ చెసారు. ఈ కథ ది. 12. 06. 2013 న ఉదయం 7.15 ని. లకు ప్రసారం చేస్తారు . మీ రేడియో లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందుబాటులో వుంటే ఈకథ విని మీ అభిప్రాయం తెలియచేయండి .
ఈ సందర్భంగా నేను, విజయవాడ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ అయిన బాల సాహితీ వేత్త
శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి గారు
స్త్రీ పురుష సంబంధాలను చర్చిస్తూ సాగిన ఈ కథ అందరిని ఆలోచింప చేస్తుందనుకుంటున్నాను . ఇంకా విభిన్నమయిన ఆలోచనా ధోరణులు సజావుగా లేకపోతే ...... ఏమి జరుగుతుందో , ఈ కథ తెలియచేస్తుంది .
పురుష దౌష్ట్యాన్ని భరిస్తూ, మగవాడి లోపాల్ని సరిపెట్టుకుని తమని తాము సమాధాన పరచుకుంటూ సంసారం చేస్తున్నామనే భ్రమ లో పాతివ్రత్యానికి లొంగిపోయి ఈ దేశంలో ఆడజాతి బానిసత్వాన్నిఅనుభవిస్తున్నదని భావించే విశాలి . స్త్రీ శ్రమ దోపిడీ చేస్తున్న పురుషాదిక్యతని గురించి మాట్లాడకుండా ఇంట్లో పెళ్ళాలని వంటగదికి అప్పగించి రోడ్లమీద శ్రమ పోరాటం చేస్తారనే భావాలతో కొందరు ఉంటారని భావిస్తుంది.
ఆర్ధిక అసమానతల నీడ , మనవ సంబంధాలపై ఖచ్చితంగా పడుతుందని , మనవ సంబందాలు సజావుగా స్వచ్చంగా ఉండాలంటే , ఆర్ధిక అసమానతలు పోవాలని , అందుకు శ్రమ దోపిడీ మీద పోరాటం చేయాలని భావించే యువకుడు విజయ్.
పురుష అహంకారం తో స్త్రీ స్వేచ్చ కు ద్రోహం జరుగుతున్న సమాజంలో స్వతంత్రంగా ఆలోచించే విశాలి ని అభినందించిన డాక్టర్ రావ్.
విశాలి వృత్తి ఉపాధ్యాయిని ..... విజయ్ వృత్తి గుమస్తా ...... రావ్ వృత్తి వైద్యం .
ఈ నేపద్యంలో విశాలి ప్రేమలో పడింది!...... నిజం !
విశాలి ఎలాంటి ప్రేమలో పడింది ?
పెళ్లి చేసుకున్నదా ?
ఎవరిని ?
తన ఆశయాలు సాధించిందా ?
కలసి కాపురం చేయగలిగిందా ?విడాకులు తీసుకుందా ?
చివరకు ఏమి జరిగింది?
ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే 'విశాల డైరీ' ని చదవాలి ...... క్షమించండి ..... ఈ నెల 12 న ఉదయం 7. 15 కి విజయవాడ ఆకాశవాణి లో వినాలి .
No comments:
Post a Comment