My Blog List

Saturday, June 8, 2013

చిత్రించిన గ్రీటింగ్ కార్డులు

చిత్రించిన గ్రీటింగ్ కార్డులు
              రకరకాల గ్రీటింగ్ కార్డ్లు అచ్చులో దొరుకుతున్నా , సహజంగా చిత్రాలు గీసి ... వాటిని గ్రీటింగ్ కార్డులుగా మలచి .... జీవనాన్ని సాగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను.  అవును నాకు మరో వుద్యోగం లేదు. జీవించాలంటే డబ్బు కావాలి కదా?
             ప్రస్తుతానికి ఈ నిర్ణయమే సరి అయినదని అనిపించింది.
            పాత విజిటింగ్ కార్డులు, పెళ్లి కార్డులు, వగైరా సేకరించాను . వాటి వెనుక బొమ్మలు గీసి , రంగులు చిత్రించా . అధ్భుతమ్.
               ఇక వెనుకకు తిరిగి చూసుకోలెదు . అనతికాలంలోనే ఒక్కరోజుకు 500 బొమ్మలు చిత్రించటం అలవాటు చేసుకొన్నా.  అవన్నీ కలిపి 'చిత్రకారుడు చిత్రించిన గ్రీటింగ్ కార్డులు' అనే బ్యానర్ కట్టి స్టాల్ తెరిచా. కొనడం మొదలు పెట్టారు . మాకు ఫలానా బొమ్మ కావాలని ఆర్డర్ ఇవ్వటం కూడా మొదలయింది . ఉత్సాహంగా విజయవాడ, గుంటూరు పట్టణాలలో స్టాల్ ప్రారంబించా .
      1985 లో 'ఇండియన్ ఎక్ష్ప్రెస్' అనే ఆంగ్ల దినపత్రిక లో నా గురించి ఒక వ్యాసం ప్రచురించింది . చూడండి


   
           ఆ తరువాత డ్రాయింగ్ టీచర్ వుద్యోగం రావటం జరిగింది .
           మా పాటశాల లో నూటికి నూరుమంది , దారిద్ర్య రేఖకు దిగువనవున్న వారే. వారికి చిత్ర కళ  నేర్పుతూ , ఆర్ధిక ఆసరా కలిగిస్తుందనే ఉద్దేశ్యం తో స్క్రీన్ ప్రింటింగ్ , గ్రీటింగ్ కార్డు ల తయారి లలో శిక్షణ ఇచ్చాను.
ఎంతోమంది  ఆ పనులలో జీవితాన్ని జీవిస్తున్నారు .
             2002 వ సం  వార్త దిన పత్రికలో పై వ్యాసంగాన్ని గురించిన వ్యాసం ప్రచురించారు . చూడండి .



మీ అభిప్రాయం తెలపండి . ధన్యవాదాలు 

Monday, June 3, 2013

ది. 12.06. 2013 న .....ఉదయం 7.15 ని.లకు.....

           

               ది. 03. 06. 2013 న ఉదయం విజయవాడ అల్ ఇండియా రేడియో లో నా కథ ' విశాలి డైరీ' ని రికార్డ్ చెసారు. ఈ కథ ది. 12. 06. 2013 న ఉదయం 7.15 ని. లకు ప్రసారం చేస్తారు . మీ రేడియో లో  ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందుబాటులో వుంటే ఈకథ విని మీ అభిప్రాయం తెలియచేయండి .


             
                        ఈ సందర్భంగా నేను, విజయవాడ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ అయిన  బాల సాహితీ వేత్త 
                                                      శ్రీమతి ముంజులూరి  కృష్ణ కుమారి గారు  

             
                 స్త్రీ పురుష సంబంధాలను  చర్చిస్తూ సాగిన ఈ కథ అందరిని ఆలోచింప చేస్తుందనుకుంటున్నాను . ఇంకా విభిన్నమయిన ఆలోచనా ధోరణులు సజావుగా లేకపోతే ...... ఏమి జరుగుతుందో , ఈ కథ తెలియచేస్తుంది .

          పురుష దౌష్ట్యాన్ని భరిస్తూ, మగవాడి లోపాల్ని సరిపెట్టుకుని తమని తాము సమాధాన పరచుకుంటూ సంసారం చేస్తున్నామనే భ్రమ లో పాతివ్రత్యానికి లొంగిపోయి ఈ దేశంలో ఆడజాతి  బానిసత్వాన్నిఅనుభవిస్తున్నదని భావించే విశాలి .  స్త్రీ శ్రమ దోపిడీ చేస్తున్న పురుషాదిక్యతని గురించి మాట్లాడకుండా ఇంట్లో పెళ్ళాలని వంటగదికి అప్పగించి రోడ్లమీద శ్రమ పోరాటం  చేస్తారనే భావాలతో కొందరు ఉంటారని భావిస్తుంది.
          ఆర్ధిక అసమానతల నీడ , మనవ సంబంధాలపై ఖచ్చితంగా పడుతుందని , మనవ సంబందాలు సజావుగా స్వచ్చంగా ఉండాలంటే ,   ఆర్ధిక అసమానతలు పోవాలని , అందుకు శ్రమ దోపిడీ మీద పోరాటం చేయాలని భావించే యువకుడు విజయ్.
           పురుష అహంకారం తో స్త్రీ స్వేచ్చ కు ద్రోహం జరుగుతున్న సమాజంలో  స్వతంత్రంగా  ఆలోచించే విశాలి ని అభినందించిన డాక్టర్ రావ్.
                    విశాలి వృత్తి ఉపాధ్యాయిని .....  విజయ్ వృత్తి  గుమస్తా ......  రావ్  వృత్తి వైద్యం .

ఈ నేపద్యంలో విశాలి ప్రేమలో పడింది!...... నిజం !

విశాలి ఎలాంటి ప్రేమలో పడింది ?
పెళ్లి చేసుకున్నదా ?
ఎవరిని ?
తన ఆశయాలు సాధించిందా ?
కలసి కాపురం చేయగలిగిందా ?విడాకులు తీసుకుందా ?
చివరకు ఏమి జరిగింది?

        ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే 'విశాల డైరీ' ని చదవాలి ...... క్షమించండి ..... ఈ నెల 12 న ఉదయం 7. 15 కి విజయవాడ ఆకాశవాణి లో వినాలి .




Saturday, June 1, 2013

నా కవిత్వానికి మొదటి పొత్తం

నా కవిత్వానికి మొదటి పొత్తం
  Letters                                                    






Addepalli Ramamohana Rao






Dr. C.Narayana Reddy




 Guda SriRamulu






Dr.G.V. Subrahmanyam






Sri MVL
నేను మినీ , వచన కవిత్వం రాయటం మొదలు పెట్టాక ......  మొదటి పుస్తక రూపం పొందిన "అణువు పగిలింది" అచ్చులో ఇచ్చి, నేటికి  'మూడు పదుల" సంవత్సరాలయింది. ముప్పై సంవత్సరాల క్రితం డిసెంబర్ లో అట్ట  తొడుక్కొని , 1984 జనవరి 12 న  మచిలీపట్టణం కేంద్ర గ్రంధాలయం మరియు సాహితీ మిత్రుల ఆధ్వర్యం లో ఆవిష్కరించ బడింది . ఆ వార్తను అదే సం . జనవరి 21 వ తేది ' విశాలాంధ్ర ' దినపత్రిక ప్రచురించినది.  

    
 
 
TiTle Back



Title Front


Title Page