My Blog List

Tuesday, December 31, 2013

"గంగతో రాంబాబు ' సీరియల్ లో నేను 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా హ్యాట్రిక్

"గంగతో రాంబాబు ' సీరియల్ లో నేను 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా హ్యాట్రిక్

         ' లయ ' సీరియల్ లో 'పెళ్లికాని వెంకట్రావు' గా


       'ఎదురీత ' సీరియల్ లో 'అంకుల్ వెంకట్రావు' గా 


ఇప్పుడు 'గంగ తో రాంబాబు' సీరియల్ లో 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా ,మల్లి మీ ముందుకు .....


సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా ఒక ఎపిసోడ్ లో ......
                                                 నేను, డూప్ కృష్ణ , రాంబాబు , పితాని , దాసన్న,

డూప్ లతో ............


సినిమా నిర్మాతగా ......... ఒక ఎపిసోడ్ లో ......


                                        నేను, ప్రక్కన ఎవరు? తెలుసుకోవాలంటే సీరియల్ చూడాలి




 

                                                              అరె ! గంగ తో నాకు పనేమిటి?



                                       
                                                                       క్లోజ్ లో ఒక షాట్

మరి కొన్ని ఫోటోలు , విశేషాలతో ...  తరవాత షెడ్యుల్ షూటింగ్ అయిన తర్వాత ..... 


' నా దేశం ' డివిడి ఆవిష్కరణ

         ' నా దేశం '  డివిడి ఆవిష్కరణ
          దేశాన్ని ప్రేమించేవారు నిరంతరం తమ విధులను , బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ , దేశ ప్రగతి గురించి ఆలోచిస్తుం టారని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య ఎల్లురి శివారెడ్డి అన్నారు. నేను రచించిన దీర్ఘ కవిత 'నాదేశం' డివిడి ని ఆయన హైదరాబాద్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు . ప్రముఖ రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్ మాట్లాడుతూ ,' కన్నతల్లి కంటే , స్వర్గం కంటే జన్మభూమి గొప్పదని, అందుకే ఎ దేసమేగిన , ఎందు కాలిడినా పొగడరా నీ తెల్లి భూమి భారతిని అని ప్రజలు చెప్పుకుంటార ని , చదువురాని , అంధులు వినడానికి అనువుగా శ్రీ కాట్రగడ్డ గళం నించి తయారయిన ఈ డివిడి లో భారత దేశం గతం, వర్తమానం , భవిష్యత్తు ల గురించి మదన పడుతూ , దేశం గొప్పగా వుండాలని ఆకాంక్షిస్తూ కవి తాతా రమేష్ బాబు కవిత్వికరిం చడం ఆయన దేసభాక్తిని తెలియచేస్తోం దన్నారు . కోపం, సంతోషం , బాధ స్పందన ప్రదర్శించలేని తనం నీలో ఇంకిపోయినపుడు , మల్లి తల్లి గర్భం లోకి ప్రయాణించు , తొమ్మిది నెలల చైతన్యాన్ని తనివి తీరా అనుభవించ మనే ఆలోచన కల్పించడం అభినందనీయమన్నారు .
          తన కవితా మార్గం ద్వారా జాతీయ భావాలు వెదజల్లుతున్న తాతా రమేష్ బాబు అభినంద నియుడని  పలువురు వక్తలు పెర్కొన్నారు.


               ఫోటో లో ఎడమ నుండి పి. చంద్ర శేఖర ఆజాద్ , తాతా రమేష్ బాబు , ఆచారి ఎల్లురి శివారెడ్డి


Saturday, November 2, 2013

ముక్కూ మొహం తెలియని వాడికి "ఒకేషనల్ ఎక్సలేన్సి అవార్డ్"

ముక్కూ మొహం తెలియని వాడికి ఒకేషనల్ ఎక్సలేన్సి అవార్డ్
విజయవాడ రోటరీ సెంట్రల్ వారు నాకు ఒకేషనల్ ఎక్సలేన్సి అవార్డ్ ఇచ్చారు.  ఈ క్లబ్ వారు నన్ను చూడలేదు, నా పరిచయం లేదు .  కేవలం నేను వెలువరించిన " తెలుగు జానపద కళ " పుస్తకం చదివి ఈ అవార్డ్ నాకు ప్రకటించారు.  ఇది నాకు ఎంతో సంతృప్తి నిచ్చిన విషయం .
ది.26. 10. 2013 న విజయవాడ లోని హోటల్ మినర్వా ఎ.సి . ఫన్ క్షన్  హాల్ లో జరిగిన ఈ అవార్డ్ ప్రదానోత్సవానికి సర్వశ్రీ కర్నాటి లక్ష్మి నరసయ్య , జనసాహితి దివికుమార్, కొత్తపల్లి రవిబాబు, ఆంధ్ర అకాడమి కార్యదర్శి గోళ్ళ  నారాయణ రావు, కొల్లి మురళి, మా పాటశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 ఇదే సభలో నా    " తెలుగు జానపద కళ " పుస్తకాన్ని , మా అమ్మ " లక్ష్మి నరసమ్మ "కు  అంకితం ఇచ్చాను . చాయా చిత్రాలను చూడండి .


                                                                  అమ్మకి అంకితం



                                           అమ్మకి అంకితాక్షరాలు చదువుతూ నేను, ప్రక్కన అమ్మ




                                            అమ్మకి అంకితం ఇచ్చే ముందు పూలమాల తో సత్కారం





                                                         అమ్మకి పాదాభివందనం చేస్తూ నేను



                        నన్ను అభినందిస్తున్న ఆంధ్ర అకాడమి ఆర్ట్స్ కార్య దర్శి గోళ్ల  నారాయణ రావు

                                                      నన్ను అభినందిస్తున్న కొల్లి మురళి 


                                                                            నా స్పందన




                         సభ ప్రారంభించే ముందు రోటరీ స్థాపకుడు " పాల్  పి  హారిస్ " కు పులదందతో  



                                                 కర్నాటి లక్ష్మి నరసయ్య గారు నన్ను సత్కరిస్తూ 



                                                 నన్ను అవార్డు సర్టిఫికేట్ , జ్ఞాపిక తో సత్కరిస్తూ


 
                                                                    సభ ప్రారంభం లో

గుడివాడ అర్. డి . ఒ., మరియు ప్రముఖ కవి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అక్కినేని కళాపీటం  కన్వినర్ కె. ఎస్. అప్పారావు, కవులు కళాకారులు అభినందనలు తెలిపారు.    

Thursday, July 4, 2013

జూలై,2013 "ప్రజాసాహితి " లో నా దీర్ఘ కవిత " నా దేశం" పరిచయం

జూలై  "ప్రజాసాహితి " లో నా దీర్ఘ కవిత " నా దేశం" పరిచయం  చదవండి .











   

Saturday, June 8, 2013

చిత్రించిన గ్రీటింగ్ కార్డులు

చిత్రించిన గ్రీటింగ్ కార్డులు
              రకరకాల గ్రీటింగ్ కార్డ్లు అచ్చులో దొరుకుతున్నా , సహజంగా చిత్రాలు గీసి ... వాటిని గ్రీటింగ్ కార్డులుగా మలచి .... జీవనాన్ని సాగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను.  అవును నాకు మరో వుద్యోగం లేదు. జీవించాలంటే డబ్బు కావాలి కదా?
             ప్రస్తుతానికి ఈ నిర్ణయమే సరి అయినదని అనిపించింది.
            పాత విజిటింగ్ కార్డులు, పెళ్లి కార్డులు, వగైరా సేకరించాను . వాటి వెనుక బొమ్మలు గీసి , రంగులు చిత్రించా . అధ్భుతమ్.
               ఇక వెనుకకు తిరిగి చూసుకోలెదు . అనతికాలంలోనే ఒక్కరోజుకు 500 బొమ్మలు చిత్రించటం అలవాటు చేసుకొన్నా.  అవన్నీ కలిపి 'చిత్రకారుడు చిత్రించిన గ్రీటింగ్ కార్డులు' అనే బ్యానర్ కట్టి స్టాల్ తెరిచా. కొనడం మొదలు పెట్టారు . మాకు ఫలానా బొమ్మ కావాలని ఆర్డర్ ఇవ్వటం కూడా మొదలయింది . ఉత్సాహంగా విజయవాడ, గుంటూరు పట్టణాలలో స్టాల్ ప్రారంబించా .
      1985 లో 'ఇండియన్ ఎక్ష్ప్రెస్' అనే ఆంగ్ల దినపత్రిక లో నా గురించి ఒక వ్యాసం ప్రచురించింది . చూడండి


   
           ఆ తరువాత డ్రాయింగ్ టీచర్ వుద్యోగం రావటం జరిగింది .
           మా పాటశాల లో నూటికి నూరుమంది , దారిద్ర్య రేఖకు దిగువనవున్న వారే. వారికి చిత్ర కళ  నేర్పుతూ , ఆర్ధిక ఆసరా కలిగిస్తుందనే ఉద్దేశ్యం తో స్క్రీన్ ప్రింటింగ్ , గ్రీటింగ్ కార్డు ల తయారి లలో శిక్షణ ఇచ్చాను.
ఎంతోమంది  ఆ పనులలో జీవితాన్ని జీవిస్తున్నారు .
             2002 వ సం  వార్త దిన పత్రికలో పై వ్యాసంగాన్ని గురించిన వ్యాసం ప్రచురించారు . చూడండి .



మీ అభిప్రాయం తెలపండి . ధన్యవాదాలు 

Monday, June 3, 2013

ది. 12.06. 2013 న .....ఉదయం 7.15 ని.లకు.....

           

               ది. 03. 06. 2013 న ఉదయం విజయవాడ అల్ ఇండియా రేడియో లో నా కథ ' విశాలి డైరీ' ని రికార్డ్ చెసారు. ఈ కథ ది. 12. 06. 2013 న ఉదయం 7.15 ని. లకు ప్రసారం చేస్తారు . మీ రేడియో లో  ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందుబాటులో వుంటే ఈకథ విని మీ అభిప్రాయం తెలియచేయండి .


             
                        ఈ సందర్భంగా నేను, విజయవాడ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ అయిన  బాల సాహితీ వేత్త 
                                                      శ్రీమతి ముంజులూరి  కృష్ణ కుమారి గారు  

             
                 స్త్రీ పురుష సంబంధాలను  చర్చిస్తూ సాగిన ఈ కథ అందరిని ఆలోచింప చేస్తుందనుకుంటున్నాను . ఇంకా విభిన్నమయిన ఆలోచనా ధోరణులు సజావుగా లేకపోతే ...... ఏమి జరుగుతుందో , ఈ కథ తెలియచేస్తుంది .

          పురుష దౌష్ట్యాన్ని భరిస్తూ, మగవాడి లోపాల్ని సరిపెట్టుకుని తమని తాము సమాధాన పరచుకుంటూ సంసారం చేస్తున్నామనే భ్రమ లో పాతివ్రత్యానికి లొంగిపోయి ఈ దేశంలో ఆడజాతి  బానిసత్వాన్నిఅనుభవిస్తున్నదని భావించే విశాలి .  స్త్రీ శ్రమ దోపిడీ చేస్తున్న పురుషాదిక్యతని గురించి మాట్లాడకుండా ఇంట్లో పెళ్ళాలని వంటగదికి అప్పగించి రోడ్లమీద శ్రమ పోరాటం  చేస్తారనే భావాలతో కొందరు ఉంటారని భావిస్తుంది.
          ఆర్ధిక అసమానతల నీడ , మనవ సంబంధాలపై ఖచ్చితంగా పడుతుందని , మనవ సంబందాలు సజావుగా స్వచ్చంగా ఉండాలంటే ,   ఆర్ధిక అసమానతలు పోవాలని , అందుకు శ్రమ దోపిడీ మీద పోరాటం చేయాలని భావించే యువకుడు విజయ్.
           పురుష అహంకారం తో స్త్రీ స్వేచ్చ కు ద్రోహం జరుగుతున్న సమాజంలో  స్వతంత్రంగా  ఆలోచించే విశాలి ని అభినందించిన డాక్టర్ రావ్.
                    విశాలి వృత్తి ఉపాధ్యాయిని .....  విజయ్ వృత్తి  గుమస్తా ......  రావ్  వృత్తి వైద్యం .

ఈ నేపద్యంలో విశాలి ప్రేమలో పడింది!...... నిజం !

విశాలి ఎలాంటి ప్రేమలో పడింది ?
పెళ్లి చేసుకున్నదా ?
ఎవరిని ?
తన ఆశయాలు సాధించిందా ?
కలసి కాపురం చేయగలిగిందా ?విడాకులు తీసుకుందా ?
చివరకు ఏమి జరిగింది?

        ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే 'విశాల డైరీ' ని చదవాలి ...... క్షమించండి ..... ఈ నెల 12 న ఉదయం 7. 15 కి విజయవాడ ఆకాశవాణి లో వినాలి .




Saturday, June 1, 2013

నా కవిత్వానికి మొదటి పొత్తం

నా కవిత్వానికి మొదటి పొత్తం
  Letters                                                    






Addepalli Ramamohana Rao






Dr. C.Narayana Reddy




 Guda SriRamulu






Dr.G.V. Subrahmanyam






Sri MVL
నేను మినీ , వచన కవిత్వం రాయటం మొదలు పెట్టాక ......  మొదటి పుస్తక రూపం పొందిన "అణువు పగిలింది" అచ్చులో ఇచ్చి, నేటికి  'మూడు పదుల" సంవత్సరాలయింది. ముప్పై సంవత్సరాల క్రితం డిసెంబర్ లో అట్ట  తొడుక్కొని , 1984 జనవరి 12 న  మచిలీపట్టణం కేంద్ర గ్రంధాలయం మరియు సాహితీ మిత్రుల ఆధ్వర్యం లో ఆవిష్కరించ బడింది . ఆ వార్తను అదే సం . జనవరి 21 వ తేది ' విశాలాంధ్ర ' దినపత్రిక ప్రచురించినది.  

    
 
 
TiTle Back



Title Front


Title Page
 

Saturday, May 4, 2013

'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ '

నేను నిర్వహించిన తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ ' లో నమోదు చేసారు . క్రింది లింక్ లో చూడండి    http://www.telugubookofrecords.com/home/category/find-record/page/5/

Friday, April 19, 2013

'జానపద కళాబంధు' తాతా రమేష్ బాబు

'జానపద కళాబంధు' తాతా రమేష్ బాబు
        ఏప్రిల్ 16 న గుడివాడ లో జరిగిన తెలుగు నాటక రంగ దినోత్సవం మరియు చార్లీ చాప్లిన్ జయంత్యుత్సవం వేదికగా తాతా రమేష్ బాబు కు 'జానపద కళాబందు' బిరుదు ప్రదానోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్ పాల్గొని , తాతా రమేష్ బాబు రచయితగా, కళాకారుడుగా చేస్తున్న కృషిని  కొని యాడారు .
ఎడమ నుండి పోలవరపు కోటేశ్వరరావు, బండారు రాధాకృష్ణ, దా. గుడిసేవ విష్ణు ప్రసాద్, చోడవరపు విజయ కుమార్ , పొన్నూరు రామకృష్ణ , కొల్లి మురళి, నరహరిసేట్టి ప్రసాద్ .
 తాతా రమేష్ బాబు ఇటివలి కాలంలో ప్రచురించిన 'తెలుగు జానపద కళ ', 'జ్ఞాపిక', 'గుడివాడ వైభవం' పుస్తకాల లోని విషయాలను ఉటంకిస్తూ డా . గుడిసేవ విష్ణు ప్రసాద్ , ఆజాద్ లతో కలిపి సత్కరిస్తున్న దృశ్యం .





పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు పావులూరి శ్రీనివాసరావు , ఆంధ్ర అకాడమి ఆర్ట్స్ వైస్ ప్రసిడెంట్ కొల్లి మురళి లు ఆజాద్ తో కలసి 'జానపద బంధు ' ను  అభినమ్దిస్తున్నారు.




                                                     తాతా రమేష్ బాబు, ఆజాద్ ల ఆనందం


 
ప్రముఖులు సుఖమంచి మల్లిక్, ప్రభాకర నాట్య మండలి కార్యదర్శి మట్టా రాజా, చార్లీ చాప్లిన్ క్లబ్ వ్యవస్థాపకులు నరహరిసేట్టి ప్రసాద్ లు

నాకు ప్రదానం చేసిన బిరుదు పత్రమ్. ఇందులో నేను నటించిన రంగస్థల, టివి, బొమ్మలాట, చిత్రలేఖనాలను అమర్చి తయారుచేయటం బాగుంది .



Friday, April 12, 2013

చార్లీ చాప్లిన్ కామెడి క్లబ్ ఆధ్వర్యం లో తెలుగు నాటక రంగ దినోత్సవ ఆహ్వానం

చార్లీ చాప్లిన్ కామెడి క్లబ్ ఆధ్వర్యం లో తెలుగు నాటక రంగ దినోత్సవ ఆహ్వానం








     నవ్వుకోవాలనుకునే వారందరికీ ........ నవ్వుతూ స్వాగతిస్తున్నాం