My Blog List

Saturday, February 13, 2010

బొమ్మలాట,తయారు చేద్దాం ,అసలు నిజం,నాన్నోయ్ పులి -రెండువేల ఇదు






బొమ్మలాట

కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో తాతా రమేశ్ బాబు రచించిన పలు గ్రంధాల ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలు లో ఒచ్తోబార్ రెండు న జరిగిన ఈ సభ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షా ఉపన్యాసం చేస్తూ దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం బాగా ఎదిగిన మనస్తత్వం గల చిన్న కుర్రాడిగా పరిచయమైన తాతా రమేశ్ బాబు వివిధ రంగాలలో బహుముఖంగా చేస్తున్న కృషి అభినందనియమన్నారు. స్థానిక డి.వై .ఐ .ఓ . వి.ప్రేమానండం గ్రంధాలను ఆవిష్కరించారు. బాలల మనో వికాసానికి తాతా రమేశ్ బాబు రచించిన బొమ్మలాట,తయారుచేద్దాం,అసలు నిజం, నన్నొఇ పులి,దిద్దుబాటు, గ్రంధాలు ఎంతో ఉపకరిస్తాయి అన్నారు. సభ కు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఎర్నేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ పామరులను సైతం ఆనంద పరచటం ద్వారా సందేశాన్ని అందించే పప్పెట్ ప్రక్రియ లో రచనలు గ్రంధస్తం చేయటం , ఫారెన్ స్టాండర్డ్ లో పుబ్లిషెర్ లు మేద్రించటం ఈ గ్రందాలకే కలకంతులు తెచ్చయన్నారు. డా. గోగినేని వెంకటరత్నం మాట్లాడుతూ ఒకే వ్యక్తి బహు ముఖ ప్రజ్ఞాశాలి అయితే ప్రపంచం గుర్తించాడు. అయితే కవిగా ,రచయితగా, పపీతిర్ గ ,నటుడుగా, సంపాదకుడుగా, చిత్రకారుడుగా ,సాహితీ కార్యకర్తగా ,ఉపాధ్యాయునిగా సమాజం లో శభాష్ అనిపించుకుంటున్న రమేశ్ దాపరికం లేని వ్యక్తిత్వం తో మరిన్ని ప్రక్రియల ద్వారా సమాజాన్ని మెంచి మార్గం లో పెట్టాల్సిన అవసరాన్ని తీరుస్తారని కోరుకొంతున్నామని అన్నారు.
డా. పూర్ణచంద్ మాట్లాడుతూ తాతా రమేశ్ బాబు ప్రత్యేకంగా బాలల కోసం ఈ పుస్తకాలు రాసారని ,పప్పెత్రి కి సంబందించిన టెక్నాలజీ ని వివరించేది బొమ్మలత ,వాటిని ప్రదర్శించే సబ్జెక్ట్ అసలు నిజం ,నాన్నొఇ పులి ,కాగ అతి తక్కువ ఖర్చు తో గ్రీటింగ్ ,ఎగిరే పక్షి, విచ్చుకునే పూలు,క్రేప్ పేపర్ తో గులాబీలు,చర్తులతో మాస్కు లు మొదలైనవి తయారు చేద్దాం లో ఇచ్చారు. పిల్లలందరికీ తప్పని సరిగా ఈ పుస్తకాలు అందచేయటం ద్వార ప్రయోజనం ఉంటుందన్నారు. పిల్లల్లో స్వతహాగా సృజనాత్మక శక్తి ,ప్రేరణ కలిగించటానికి ఈ రచనలు ఉపయోగపడతాయి అన్నారు. పిల్లల్లో నటివితి, టాలెంట్ పెంచటానికి ఇవి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి కాట్రగడ్డ రజని స్వాగతం పలుకగా కవి పులవర్తి వందన సమర్పణ చేసారు.

No comments:

Post a Comment