My Blog List

Friday, February 12, 2010

'అణువు పగిలింది ' పుస్తకం -నా మొదటి కవితా సంపుటి














'అణువు పగిలింది ' పుస్తక ఆవిష్కరణ సభ లో ఎడమ నుండి కవి తాతా రమేశ్ బాబు
,ముసునూరి జగన్నాధ రావు ,వేదాల నరసింహాచారి



నా పుస్తకాల ఆవిష్కరణలు

ఒకటి.అణువు పగిలింది

పుస్తకాన్ని పతోమ్మిది వందల ఎనభై మూడు లో ప్రచురించాను .అంతకు ముందు రాసిన వచన మినీ కవితలను పుస్తకం లో ప్రచురించటం జరిగింది.
జనవరి ఇరవై ఒకటి ఎనభై నాలుగు లో జిల్లా కేంద్ర గ్రంధాలయం లో పుస్తక ఆవిష్కరణ జరిగింది . స్థానిక సరస్వతి కళాసమితి అధ్యక్షులు ముసునూరి జగన్నాధరావు కవితాసంపుటిని ఆవిష్కరించారు .సభాధ్యక్షులు వేల్వదపు రామారావు మాట్లాడుతూ చిత్రకారుడు రమేశ్ కవిత్వం లో కూడా ద్రుస్యచిత్రణ అద్భుతంగా చేసారని అన్నారు. వేదాల నరసింహాచారి పుస్తకాన్ని పరిచయం చేస్తూ 'నిరాశను తొలగించాలని మహా సమాజం కోసం తపనపడే భావ్వాల్ని వెదజల్లాలని అలాంటి గొప్ప ప్రయత్నం చేస్తున్న రమేశ్ బాబు ను అభినందించారు .శ్రీయుతులు పువ్వాడ తిక్కన సోమయాజి,చల్లా రామఫని , ఉదయ్,మొదలగువారు పుస్తకం గురించి మాట్లాడారు.



















అణువు పగిలింది ' కవిత సంపుటి లో ఒక మినీ కవిత చూడండి

పచ్చలోకం
-శీర్షిక

మా
నాయకులు
మా గొప్ప కాపరులు
మా సమాజం
మా చక్కని గొర్రెలు
గొర్రె కోరింది పచ్చ మేత
కాపరి కోరింది పచ్చ నోటు

మరో కవిత చూడండి ...........

శీర్షిక :నీతుల ప్రహసనం

'ప్రజసేవయే మన కర్తవ్యం
సంఘసేవ చేయండి ప్రజలారా '
[లయెటాఫ్ :ప్రజాధనం వీడి ఊపిరి ]
'ఒకే రక్తం ఒకే మనుషులం
కులమత భేధాలోద్దండి'
[లయోటఫ్:కులమతాలు వీడి గున్దేగోడలు]
'శ్రమదోపిదిని అరికడదాం
మన కాళ్ళ మీద మనం నిలబడదాం'
[లయోటాఫ్:వీడి మహా కాయం బక్కోడి రిక్షా బరువు ]
'అభ్యుదయం కోరాలోయ్
స్త్రీ జాతిని గౌరవిన్చాలోయ్ '
[లయోటాఫ్ :ప్రతి రాత్రి వీడి పక్కలో పదహారేళ్ళ అందం ]
'అన్యాయాన్ని వురి వేద్దాం
సమ సమాజ నిర్మాణమే మన ధ్యేయం '
[లయోటాఫ్ :అవినీతి వీడి ఆరోప్రాణం

మరో మినికవిత చూడండి......

శీర్షిక :మన రాజ్యాంగం

మేధావులు కొందరు
మతులు చెడగొట్టుకొని
లెఖ్ఖ చేయడానికి
చాలా సూత్రాలు రాబట్టారు
ఎన్ని సుత్రాలయితే ఏమిటి ?
వీల్లందరకు వచ్చిన ఆన్సరు
'దోపిడే' కదా!

పుస్తకం లో ని కవితలను చదివి బాగున్నాయని రాసిన కొందరు ప్రముఖుల పేర్లు :
డా
.జి.వి .సుబ్రహ్మణ్యం,డా.సినారె ,డా .అద్దేపల్లి రామమోహనరావు ,పి.చంద్రశేఖర ఆజాద్
డా.కొలకలూరి స్వరుపారాని ,జోరా శర్మ ,తదితరులు



No comments:

Post a Comment