My Blog List

Friday, April 12, 2013

కృష్ణా జిల్లా సాంస్కృతిక మండలి ఉగాది వేడుకలు

కృష్ణా జిల్లా సాంస్కృతిక మండలి  ఉగాది వేడుకలు 
శ్రీ విజయనామ  సంవత్సర ఉగాది వేడుకలు కృష్ణా జిల్లాసాంస్కృతిక మండలి ఆధ్వర్యం లో మచిలీ పట్నం  టౌన్ హాల్ లో జరిగాయి . 
కవిసమ్మేళన కార్యక్రమానికి నాకూ ఆహ్వానం .
'విజయ నామం .... నేనేనా' అంటూ నేను కవితా గానం చెసాను.
కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బుద్ధా ప్రసాద్ జ్యోతి , అదనపు జాయింట్ కలెక్టర్ రమేష్ కుమార్, ఎస్పి జె. ప్రభాకర్ రావు , జిల్లా విద్యా శాఖాధికారి దేవానంద రెడ్డి లు నన్ను సత్క రించారు .
ఆ ఫోటో


Thursday, March 21, 2013

తెలుగు జానపద కళ -పుస్తక సమీక్ష సభ

  తెలుగు జానపద కళ -పుస్తక సమీక్ష సభ
                       మార్చ్ 20 వ తేదిన గుడివాడ కెజిపిఆర్ ఏన్నార్ బి ఎడ్  కళాశాలలో తాతా రమేష్ బాబు రచించి,సంపాదకత్వం వహించిన  ' తెలుగు జానపద కళ ' - పుస్తక సమీక్ష సభ జరిగింది .
                ఎడమ నుండి ప్రిన్సిపాల్ డా . జె. షకీలా , అక్కినేని కళా పీటం , కో ఆర్డినేటర్ కె.ఎస్. అప్పారావు, రచయితా తాతా రమేష్ బాబు 


              సమాజాన్ని చైతన్యం చేయడానికి ఉపకరిస్తున్న తెలుగు జానపద కళ లను పరి రక్షించి భావితరాలకు అందించవలసిన గురుతర బాద్యత గురువులపై వున్నదని కళాశాల కమిటి కోశాధికారి కే ఎస్ అప్పారావు అన్నారు.ఎంగిలి సంస్కృతులకు మనం బానిసలం కావడంతో తరతరాల మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే ఎన్నో జానపద కళలు  ఇప్పటికే అంతరించాయని అన్నారు.
             డా.  కొడాలి సోమసుందర రావు పుస్తకాన్ని సమీక్షిస్తు , జానపద కళలపై  చక్కని అవగాహన కలిగించే పుస్తకమని, భవిష్యత్తులో ఈ పుస్తకాన్ని సిలబస్ గా ప్రభుత్వం ప్రకటించే అవకాసం వున్నదని పెర్కొన్నారు . పుస్తకం లో పలు అంశాలు గురించి వివరించారు. పగటి వేషాలు సామాజిక అంశాలు వ్యాసం అద్భుతంగా వున్నదన్నారు. డా . బీరం సుందర రావు, డా .పేట శ్రీ, డా . కసిరెడ్డి, డా . పొద్దుటూరి, ఈటివి ఉదయ శంకర్ రాసిన వ్యాసాలు ' జానపద కళల వివరణలు చక్కగా వున్నాయన్నారు.
              రచయిత తాతా రమేష్ బాబు మాట్లాడుతూ , వివిధ జానపద కళలను అవగాహన చేసుకొని , వాటిని తరగతి గదిలో బోధనోపకర ణాలుగా    ఉపయోగించి విద్యార్థులకు విజ్ఞాన, వినోద , వికాసాలను అందించాలని సూచిమ్ చారు.
               తాతా రమేష్ బాబు ను కళాశాల బి ఎడ్  విద్యార్థులు , అధ్యాపకులు, యాజమాన్యం ఘనంగా సన్మానించారు.

                         ఎడమ నుండి బి. ఎడ్  కళాశాల ప్రిన్సిపాల్ డా . జె. షకీలా , కోశాధికారి కె ఎస్. అప్పారావు, తెలుగు విభాగాదిపతి డా . కొడాలి సోమ సుందర రావు, కళాశాల కోఅర్డినేటర్ కె ఫై ఎ చౌదరి
  







               విద్యార్ధి చిత్రించిన బొమ్మను తాతా రమేష్ బాబు కు బహుమతిగా ఇచ్చారు. 

                అక్కినేని కళా పీటం  మేమొంటో  ను రచయితకు .... 

               ఈ సందర్భంగా తాతా రమేష్ బాబు ప్రదర్శించిన బొమ్మలాట ' దురాశతో .... ' , అందరిని అలరించినది . 




                 బొమ్మలాటను ప్రదర్శిస్తున్న్న తాతా రమేష్ బాబు  
      ఇంకా అధ్యాపకులు ది.ఎస్. ప్రత్యూష , బి. ఆనందబాబు లు ప్రసంగించారు . 


    

Thursday, March 14, 2013

నా మరో పుస్తకం 'చిత్రకళ '

http://kinige.com/kbook.php?id=1568&name=chitrakaLa
నా మరో పుస్తకం 'చిత్రకళ '
పై 'కినిగె.కాం ' లో దొరుకుతుంది .
ఈ పుస్తకం మీద మీ అభిప్రాయాన్ని కోరుతూ ....... 

Thursday, February 7, 2013

జానపద కళా చైతన్య యాత్ర -దృశ్య రూపం -మొదటి భాగం

జానపద కళా చైతన్య యాత్ర -దృశ్య రూపం -మొదటి భాగం





ది . 07,08,09, ఆగష్టు 2012 లలో 'తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ' - కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో నిర్వహించాను. ఈ సందర్భం గా 'తెలుగు జానపద కళ ' పుస్తకాన్ని తీసుకు వచ్చాను.
కాగా,  ఈ యాత్ర 3 రోజులు దృశ్య రూపంగా , మొత్తం 13 డి.వి.డి లు తీసాము. అందు నుండి వీలు చేసుకుని కొన్ని అంశాలు ఇందులో పోస్ట్ చేస్తాను. మీ అభిప్రాయం చెప్పండి .
తాతా  రమేష్ బాబు 

Tuesday, February 5, 2013

ఇది "బాలబంధు" బి.వి. శతజయంతి సంవత్సరం

ఇది "బాలబంధు" బి.వి. శతజయంతి సంవత్సరం 
తెలుగు విశ్వ విద్యాలయం  ప్రచురించిన ' 20 వ శతాబ్ది తెలుగు వెలుగులు ' - మొదటి భాగం లో నేను ర.తా గా (రమేష్ బాబు తాతా ) , బాలబంధు గురించి రాసిన చిరు వ్యాసం ఇక్కడ ఇస్తున్నాను .
ఇంకా వీరి గురించి 'గుడివాడ వైభవం, జ్ఞాపిక పుస్తకాలలో చిరు వ్యాసాలే కాక 'తెలుగు మణి దీపాలు' లో వీరి జీవిత సంగ్రహం  రాసాను.













'బాలబంధు' , వయసులో ఎంతో చిన్న అయిన నాతో,  ఎంతో సన్నిహితంగా మెలిగే వారు.  మా ఇంటికి వచ్చి , అడిగి మరీ భోజనం చేసేవారు. మా పిల్లలను ఆడించేవారు. నా అర్థాంగి 'జానకి' తో ,' అమ్మాయ్ , మీ అయన కత్తులు , కటారులు, విప్లవం, పొడుస్తా, తంతా అంటూ  కవిత్వం రాస్తాడు, కాస్త జాగ్రత్తగా వుండాలి' అంటూ నవ్వేవారు.
వీరు రాసిన వ్యాసాలు కొన్ని :
1. నవంబర్ 1976 లో వెలువడిన ' ఆంధ్ర ప్రదేశ్ దర్శిని ' లో 913 నుండి 917 పేజి వరకు ' బాల వాగ్మయం
2. జూన్ 1972 లో వెలువడిన 'త్రివేణి' లో 122 నుండి 130 పేజి వరకు 'బాల సాహిత్యం'
3. సెప్టెంబర్ 1972 లో వెలువడిన ' శోభన సంస్మృతి' లో 34 నుండి 36 పేజి వరకు 'చిరమైత్రి'
4. 1985 లో వెలువడిన 'చలం సాహిత్యావలోకనం' లో ముందు మాటగా ' నా తోచిన మాటలు'

'బాల బంధు' గారితో పరిచయం వున్నా వారందరూ, ఇక్కడ వారి అనుభవాలను పంచుకోవాలని కోరుతున్నాను.

Monday, January 28, 2013

విభిన్న కళాకృతులు- తాతా రమేష్ బాబు

 విభిన్న కళాకృతులు 



నేను { తాతా  రమేష్ బాబు ) తయారు చేసిన ఆర్ట్ మరియు క్రాఫ్ట్  వర్క్


                                                         1. ముఖమల్ ఆర్ట్ వర్క్





                                                                2. సోలాపిత్ వర్క్




                                            3. మెక్రెమ్  వర్క్
 


 4. మధుబని ఆర్ట్ వర్క్ 
 
 
               5. తెల్ల కాగితం  వర్క్ 
                                                              

Saturday, January 26, 2013

నా పాట

నా పాట 

పల్లవి :
ఓ... బుగ్గమీద నల్లచుక్క జాబిలమ్మ
ఓ...సిగ్గులోలికి నవ్వుతున్న వెన్నెలమ్మ
     ఒకసారి మబ్బుతెరలు తొలగించి రావా
     తొంగి చూచి కాసింత వేలుగిచ్చి పోవ
అనుపల్లవి:
అందమైన కలలు తెచ్చి
కమ్మనైన నిదురపుచ్చి
రాతిరంత నీవు నాతో చెలిమి చేసి పోవ  //ఓ..బుగ్గమీద //
చరణం: 
చెట్టులన్ని పుట్టలన్నీ నీ రాక కోసమే
వాగులన్నీ వంకలన్ని నీ రాక కోసమే
లోకమంతా నీ కోసం ఎదురు చూసి చూసి
నిదుర రాక కలత చెంది మనసంత అలసిపోయే     //ఓ.. బుగ్గమీద//

నీలిమబ్బు నింగిలోన నీ రాక కోసమే
నేలపైన నల్ల కలువ నీరక కోసమే
లేత మనసు నీ కోసం ఎదురు చూచి చూచి
నువ్వు రాక ,నవ్వలేక మోమంతా బోసిపోయే        //ఓ..బుగ్గమీద//