My Blog List

Sunday, May 13, 2012

'ఎదురీత ' షూటింగ్ కబుర్లు

'ఎదురీత ' షూటింగ్  చేసి, ఈ రోజే గుడివాడ వచ్చాను. కొన్ని ఛాయా  చిత్రాలు చూడండి.






          వెంకట్రావు ,బుచ్చి , వీణ, సత్య  లు మెట్ల మీద కుర్చుని ఆలోచనలో పడ్డారు . దేని గురించి?







                                      వీణ, సత్య, వెంకట్రావు ల మెస్ కి సిఐ వచ్చాడు . ఎందుకు? 





                              దర్శకులు వాసు.... షూట్ చేస్తున్న దృశ్యాన్ని మోనిటర్ లో చూస్తున్నారు .




    కేసు వాదించటానికి కోర్ట్ కి వస్తున్న లాయర్ 'భగీరద' గా , ఈ సీరియల్ రచయిత పీ. చంద్రశేఖర ఆజాద్.
    చాలా ఖరీదయిన లాయర్ . ఎవరి తరపున వాదిస్తాడు?  రాజా తరపునా? మంత్రిగారి తరపునా?



వెంకట్రావు ఇక్కడ ఎందుకున్నాడు? లాయర్ భగీరధ ను  'నైవేద్యం ' మెస్ కి ఆహ్వానించటానికి  వచ్చాడా? భాగీరధ మీద తిరగ బడతాడా ? అసలు ఎ  సంబంధం లేదా ?



అరె ! జడ్జ్ గారు , వెంకట్రావు నమస్కారాలు చేసి కొంటున్నారు! పైగా వెంకట్రావు కళ్ళజోడు పెట్టుకొన్నాడు... కొంపదీసి మన వెంకట్రావు కూడా,రాజా కేసు గురించి  'లా ' చదివేశాడా  ఏమిటి?   అసలు ఎ  సంబంధం లేదా ? 



 షాట్ గ్యాప్ లో సరదాగా .... వెంకట్రావు, భాగీరధ, దర్శకులు ఇంటూరి వాసు, బుచ్చి, మేనేజర్ సతీష్ లు 

         

          నిన్న సాయంత్రం హనుమాన్ జంక్షన్ లో నా 'గుడివాడ వైభవం' పుస్తకాన్ని పరిచయం చేసారు.  'రక్త కన్నీరు ' ఫేం దాసరి పూర్ణ - ఈ కార్యక్రమం చేసారు. అభయ ఆంజనేయ స్వామీ దేవాలయం పందిరిలో జరిగిన ఈ కార్యక్రమం  తరవాత ' రక్త కన్నీరు' నాటక ప్రదర్శన జరిగింది. 


                                                         వేదిక పై అమర్చిన బానర్ 



'గుడివాడ వైభవం ' పుస్తకాన్ని పరిచయం చేస్తున్న  దాసరి పూర్ణ , ఆలయ చైర్మన్, తదితరులు ఎడమ నుండి 3వ వ్యక్తి గా నేను.

Monday, May 7, 2012

'కవిరాజు'జయంతి సభ -కొన్ని ఛాయాచిత్రాల

'కవిరాజు ' త్రిపురనేని రామస్వామి 125 వ జయంతి సభ చక్కని వాతావరణంలో జరిగింది. అర్థవంతమైన ప్రసంగాలు  ఆహూతుల హృదయాలను అలరించాయి . సభను చలువ మందిరం లో ఏర్పాటు చేసినప్పటికీ సంకేతిక కారణాల వలన  సభా మందిరాన్నిచల్లదనం పరచుకోక పోయినా, ప్రారంభ సమావేశంలో 'కవిరాజు' ఆలోచనలు, హేతువాదం తో సభ వాతావరణం అంతా నిండిపోయి - ఆ చల్ల దనాన్ని  మించిన సౌఖ్యాన్ని పంచింది. 
నేను ఈ రాత్రికే 'ఎదురీత ' సీరియల్ లో నటించటానికి హైదరాబాదు వెళ్ళవలసి రావటం తో కొన్ని చాయాచిత్రాలను ఇక్కడ ఉంచుతున్నాను . 



                                  సదస్సు జరిగిన ప్రదేశం ఇక్కడే ! ఆ కనిపించే భవనం 2వ అంతస్తులో

                        సభ మందిరాన్ని పర్యవేక్షిస్తూ...డా.వెలగ వెంకటప్పయ్య గారితో నేను . 
ఇక్కడ ఒక విషయం చెప్పాలి . 1984 లో 'జనప్రభ' సాహిత్య మాస పత్రిక ఆవిష్కరణ సభలో మేము ఇద్దరం పాల్గొన్నం. ఆ పత్రిక సంపాదకుడిగా నేను, ఆవిష్కర్తగా డా. వెలగా . ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాం.






                                  సభలో కవిరాజు మనవడు, సిని నటుడు సాయిచంద్ గారితో నేను 



                                సదస్సును ప్రారంభిస్తూ ..... ఎడమ నుండి  కేతు విశ్వనాధ రెడ్డి,                                    త్రిపురనేని హనుమాన్ చౌదరి,యెర్నేని వెంకటేశ్వర రావు , ఎం. సి. మహేష్ [సాహిత్య అకాడెమి ప్రాంతీయ కార్యదర్శి ] , డా. వెలగా , తాతా  రమేష్ బాబు[ కుడి చివర ]




                                              మొదటి సమావేశానికి స్వాగతం పలుకుతూ నేను.




                                                      ప్రముఖ కవి బీరం సుందర రావు ,నేను



                                                             డా. ద్వానా శాస్త్రి ,నేను 


మిగిలిన విశేషాలు తరువాత .......మన్నించండి
  

Thursday, May 3, 2012

గుడివాడలో కవిరాజు 'త్రిపురనేని రామస్వామి ' 125 వ జయంతి ఉత్సవం ఏర్పాట్లు

గుడివాడలో కవిరాజు 'త్రిపురనేని రామస్వామి ' 125 వ జయంతి ఉత్సవం  ఏర్పాట్లు  
                 ఈనెల 6 వతేదిన- గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ లో - కవిరాజు 'త్రిపురనేని రామస్వామి ' 125 వ జయంతి ఉత్సవం  కేంద్ర సాహిత్య అకాడమి ,న్యూ ఢిల్లీ యొక్క దక్షిణ ప్రాంత విభాగం,బెంగుళూరు వారి ఆధ్వర్యం లో   జరపాలని నిర్ణయించడం పట్ల ఇక్కడి సాహితీ మిత్రులు సంతోష పడుతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ శ్రీ యెర్నేని వెంకటేశ్వర రావు పర్య వేక్షణలో టాటా రమేష్ బాబు,పావులూరి శ్రీనివాసరావు ,సత్యన్నారాయణ బాబు ,సోమసున్దరరావు లుఏర్పాట్లను చూస్తున్నారు. 
                ముందుగ సాహిత్య అకాడెమీ ప్రచురించి పంపిన కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. 6 వ తేది  ఉదయం 10.30 కు ప్రారంభ సమావేశం జరుగే సభలోరచయిత కేతు విశ్వనాధ రెడ్డి ప్రస్తావనతో ప్రారంభమై , త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రారంభోపన్యాసం వుంటుంది 
                11.30 కి మొదటి సమావేశం లో పసల భీమన్న 'సూత పురాణం' ,  బీరం సుందర రావు 'భగవత్గీత' కే.యెన్ . మల్లీశ్వరి 'శంభుక వధ ' ,అమ్మంగి వేణుగోపాల ' కుప్పు స్వామి శతకం ', అనే కవిరాజు కృతులు పై ప్రసంగిస్తారు.
మ. 2.30 కి ద్వానా శాస్త్రి ,'ఖూని', శశిశ్రీ 'సూతాశ్రమ గీతాలు' , సోమసుందర రావు 'కురుక్షేత్ర నాటకం' , పాపినేని శివశంకర్,'శక పురుషుడు', గుమ్మ వీరన్న ' సంఘ సంస్కరణ ' , వెలగ వెంకటప్పయ్య,'కవిరాజు ప్రభావం' అనే అంశాలపై ప్రసం గిస్తారు.
సా. 4.30 కి జరిగే సమాపన సమావేశం లో , రావేల సాంబశివరావు అధక్షతన ,మంగళగిరి ఆదిత్య ప్రసాద్ , 'సమపనోప న్యాసాన్ని ఇస్తారు. గౌరవ అతిధిగా కవిరాజు మనవడు,త్రిపురనేని సాయిచంద్ పాల్గొంటారు.
         ఈ సభకు వచ్చిన వారందరికి ఉదయం అల్పాహారం, మ. భోజనం , సా. టి , అల్పాహారం వుంటాయి.
                                                                  కరపత్రం ఆవిష్కరణ

                 చలువ మందిరం లో జరిగే ఈ సమావేశం లో పాల్గొని' కవిరాజు ' ని మననం చేసుకొందాం రండి.
     
                                                                  బ్యానర్ ఆవిష్కరణ


                                  ఇలాంటివి 15 తాయారు చేయించాము . వీటిని పురవీధులలో ప్రదర్శించి ,                                అనంతరం స్థానిక విద్యా సంస్థలకు బహుకరిమ్చాలనే ఆలోచన నాది .

Sunday, April 29, 2012

కళా సాహిత్య సంస్కృతిక జీవి

ఈ రోజు ,'కళా సాహిత్య సంస్కృతిక జీవి' గా ఆంధ్ర భూమి దిన పత్రిక -కృష్ణ జిల్లా 'మెరుపు' శీర్షిక లో ,' కవులు ..రచయితలు...-36 'నందు నన్ను పరిచయం చేసారు,  శ్రీ విహారి గారు . 
ఆ పేపర్ ఇక్కడ ఇస్తున్నాను . 
            ఇందులో  " అక్టోబర్ 2001  లో రమేష్ బాబు ఒక గొప్ప చారిత్రాత్మక సాహిత్య విజయాన్ని సాధించారు. తన సంపాదకత్వం లో 'జ్ఞాపిక ' పేరు తో 'తర తరాల గుడివాడ ప్రాంత శతకవితలు ' గ్రంధాన్ని ప్రచురించారు. దీనిలో మాదయ్య కవి నుండి రేపటి కవుల వరకు రాసిన రచనలను పొందు పరిచారు. కష్ట సాధ్య మయిన కార్యం ఇది. సాహితీ లోకమంతా అభినందించ వలసిన ప్రచురణ ఇది. " అని రాసారు విహారి గారు. . ఆ పుస్తకం కోసం నేను పడిన శ్రమ మరచి పోయేలా చేసిన పై వాక్యాలు , నాకు ఆనందాన్ని కలిగించాయి. .
     శ్రీ విహారి గారికి ధన్యవాదాలు. 

Tuesday, April 24, 2012

"ఎదురీత" సీరియల్ లో "వెంకట్రావు" గా నేను!

"ఎదురీత" సీరియల్ లో నేను
     గత కొంత కాలంగా 'మా టివి ' లోప్రతి రోజు రాత్రి 8 .30  కి   వస్తున్న"ఎదురీత "సీరియల్ లో "వెంకట్రావు" గా నటించే అవకాశం దొరికింది. ఇంతకు ముందు 'సంసారం సాగరం ', 'లయ ' సీరియల్ లలో  గాని, 'అబ్బాయి ప్రేమలో పడ్డాడు' చలన చిత్రం లో గాని  నటించే  చాన్స్ దొరికింది అంటే  కేవలం  రచయిత  పి. చంద్ర శేఖర ఆజాద్ నా ప్రాణ మిత్రుడు కావటమే! ఇంకా దూరదర్శన్ లో అనేక కార్యక్రమాలు చేయడానికి  తనే కారణం.. ముఖ్యంగా 'పప్పెట్ షో ' చేయించటమే కాక,  అందులో తన గొంతు కూడా ఇచ్చాడు. ఇంకా 'మా పసల పూడి కధలు' సీరియల్ లో  కొన్ని భాగాలకు ఆజాద్ వద్ద   'మాటల సహకారం' అందించాను.
         గత పది రోజులుగా 'ఎదురీత' సీరియల్ లో వెంకట్రావు గా షూటింగ్ లో పాల్గొన్నా. హైదరాబాద్ లో జరిగింది. ఈ సీరియల్ కి నటుడు, ఇంటూరి వాసు దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే ,మాటలు పి.చంద్ర శేఖర ఆజాద్ అందిస్తున్నారు. 
         జీవితం లోని భిన్న కోణాలను ఆవిష్కరిస్తూ , నడుస్తున్న ఈ సీరియల్ లో విధి వశాత్తూ బతికి చెడిన కుటుంబం ఒక మెస్ ఓపెన్ చేస్తారు. అందులో సహాయకుడు గా 'శాస్త్రి' అనే అతను -వెంకట్రావు ని చేరుస్తాడు. 
తనకంటూ ఎవరు లేకపోయినా , తన చుట్టూ వున్నా వాళ్ళే తన వాళ్ళు గా భావించే మనసు వెంకట్రావుది . చాల మంచి పాత్ర ఇది. కథానాయకుడు, కథానాయకురాలు కుటుంబాలకు చేతనైన సహాయం అందిస్తూ ...ఫిలసాఫికల్ గా , మనుషులలో వుండే చిత్రమైన మనస్త త్వాన్నిఆవిష్కరిస్తూ పలికిన సంభాషణలు తో సాగుతుంది.  
      ఆ తరవాత కథ ను బుల్లి తెర పై  వీక్షించండి. నా పాత్ర మరియు ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాలూ చెప్పండి. ఈ నెల 20 తేది నుండి నా పాత్ర, అదే 'వెంకట్రావు' ప్రవేశించాడు. మీరు కూడా మీ కుటుంబం లో వ్యక్తిగా ఆదరిస్తారు కదూ.
        షూటింగ్ లో కొన్ని ఛాయాచిత్రాలు ఇక్కడ పెడుతున్నాను.

             వెంకట్రావు పాత్ర స్వభావాన్ని వివరిస్తున్న  దర్శకులు ఇంటూరి వాసు, రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్, కెమరా- రామకృష్ణ , సహాయకులు . ఎడమనుండి మొదటగా నేను. 


                  'నైవేద్యం' మెస్ లో పనివాడుగా చేరుతున్న సందర్భం. ఎడమనుండి నేను, వాజ్ పాయి , సత్య కుటుంబం 



                        ఈ సీరియల్ లో  నేను పని చేసే 'మెస్' ఇదే!  పేరు                                              'నైవేద్యం'
                             అమ్మ చేతి వంటని  ఆరగించండి


            మెస్ లో మొదట భోజనం చేస్తున్న వాజ్ పాయి గారికి వడ్డిస్తూ ,పనిలోకి ప్రవేశం 

                                       కళకళ లాడుతున్న' మెస్'
  

                     'మెస్' లోకి వస్తుండగా కెమరామెన్ రామకృష్ణ తో

              అయ్యో , ఇదేమిటి ? అక్కా చెల్లెళ్ళు స్మశానం దగ్గర ! వారితో పాటు నేను కూడా... ఏమి జరిగింది? ఎవరు మరణించారు? ...రాబోయే కాలం లో చూద్దాం....





              భాస్కర్ కి నాతో పనేమిటి? హీరో తో నాకు మాటలా ? ఏదో చెప్పు కుంటున్నాడు నాతో.. ఏమిటది?  
             -  ఒక సీన్ లో సూచనలు ఇస్తున్న దర్శకులు వాసు, సహా దర్శకులు పొట్లూరి రాంబాబు 

                    సహదర్శకులు రాంబాబు, నేను , నా వెనుక 'బుచ్చి'




 మేకా  రామకృష్ణ , నేను 



       షూటింగ్ లో పాల్గొంటున్న నాకోసం - ఆ ప్రదేశానికి వచ్చి , 'ఎదురీత' సంభాషణలు రాస్తున్న పి. చంద్ర శేఖర ఆజాద్. 
       ప్రస్తుతానికి ఇంతే! తరవాత షెడ్యుల్ లో మరి కొన్ని ఫోటోలు 

        అన్నట్లు " లయ" సీరియల్ లో కూడా నా పాత్ర 'వెంకట్రావే'! పెళ్లి కానీ వెంకట్రావు . చివరికి పెళ్లి అవుతుంది అనుకోండి.అదంతా... 'లయ'  కథ . 
నందన నామ సంవత్సర ఉగాది వేడుకల లో పాల్గొని 'నా గొడవ' ని కవిత గానం చేశాను . ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతిక శాఖ, కృష్ణ జిల్లా సంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యం లో , మచిలీ పట్నం ,టౌన్ హాల్ లో జరిగిన ఈ కవిసమ్మేళన అనంతరం అదనపు జిల్లా  కలెక్టర్ రమేష్ కుమార్ గారు నన్ను సత్కరించారు.

Sunday, January 1, 2012

మా నాన్నగారు

మా నాన్నగారు 
ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం గా చరిత్ర పుటల కెక్కిన వూరు అది.
గుంటూరు జిల్లా లో వున్న ఆ వూరు  పేరు 'భట్టిప్రోలు'. 
ఆ ఊర్లో ' వెంకటేశ్వర్లు'  అనే  రైతు ఇంట సెప్టెంబర్ 6 న 1929 సం.లో జన్మించారు శ్రీ తాతా బసవలింగం. అం.ప్ర.ప్రభుత్వ విద్యా శాఖ, కృష్ణా జిల్లాలో తన ఉద్యోగ జీవితాన్ని గడపి విశ్రాంతి పొంది మరల 'భట్టిప్రోలు' చేరుకొన్నారు. అనేక ఆరోగ్య సమస్యల మధ్య , వారి కోరిక మీద కుమారుడయిన నా దగ్గరకు వచ్చి వైద్యం చేయించు కొన్నారు. అలాగే ది.30 .11 .2011 న కూడా నా దగ్గరకు వచ్చారు. వారితో పాటు వారి శ్రీమతి అయిన మా అమ్మగారు 'లక్ష్మి నరసమ్మ' కూడా ఎప్పుడూ వుండి,వారిని కంటికి రెప్పలా చూస్తున్నారు. మా అమ్మగారు ఎప్పుడు జన్మించారో తెలియదు. అయితే మా నాన్న గారి కంటే 9 సం. చిన్న అని చెప్తారు.వారి కుటుంబంలో అందరు నిరక్ష రాస్యులే!
             మా అమ్మ నాన్నలతో నూతన  2012 సం. వేడుకలను నిర్వహించారు, మా పిల్లలు.

    
2012 కేక్  కట్ చేస్తున్న 'బసవలింగం',లక్ష్మి నరసమ్మ 



            ఆనందంగా నూతన సంవత్సర శుభకామనలు తెలుపు కొంటున్న దంపతులు 
             ఇలా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం వీరికి జీవితం లో  ఇదే మొదటిసారి కావటం విశేషం . అందువల్లనే ఈ విషయాన్ని  మీతో పంచుకొంటున్నాను