"ఎదురీత" సీరియల్ లో నేను
గత కొంత కాలంగా 'మా టివి ' లోప్రతి రోజు రాత్రి 8 .30 కి వస్తున్న"ఎదురీత "సీరియల్ లో "వెంకట్రావు" గా నటించే అవకాశం దొరికింది. ఇంతకు ముందు 'సంసారం సాగరం ', 'లయ ' సీరియల్ లలో గాని, 'అబ్బాయి ప్రేమలో పడ్డాడు' చలన చిత్రం లో గాని నటించే చాన్స్ దొరికింది అంటే కేవలం రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్ నా ప్రాణ మిత్రుడు కావటమే! ఇంకా దూరదర్శన్ లో అనేక కార్యక్రమాలు చేయడానికి తనే కారణం.. ముఖ్యంగా 'పప్పెట్ షో ' చేయించటమే కాక, అందులో తన గొంతు కూడా ఇచ్చాడు. ఇంకా 'మా పసల పూడి కధలు' సీరియల్ లో కొన్ని భాగాలకు ఆజాద్ వద్ద 'మాటల సహకారం' అందించాను.గత పది రోజులుగా 'ఎదురీత' సీరియల్ లో వెంకట్రావు గా షూటింగ్ లో పాల్గొన్నా. హైదరాబాద్ లో జరిగింది. ఈ సీరియల్ కి నటుడు, ఇంటూరి వాసు దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే ,మాటలు పి.చంద్ర శేఖర ఆజాద్ అందిస్తున్నారు.
జీవితం లోని భిన్న కోణాలను ఆవిష్కరిస్తూ , నడుస్తున్న ఈ సీరియల్ లో విధి వశాత్తూ బతికి చెడిన కుటుంబం ఒక మెస్ ఓపెన్ చేస్తారు. అందులో సహాయకుడు గా 'శాస్త్రి' అనే అతను -వెంకట్రావు ని చేరుస్తాడు.
తనకంటూ ఎవరు లేకపోయినా , తన చుట్టూ వున్నా వాళ్ళే తన వాళ్ళు గా భావించే మనసు వెంకట్రావుది . చాల మంచి పాత్ర ఇది. కథానాయకుడు, కథానాయకురాలు కుటుంబాలకు చేతనైన సహాయం అందిస్తూ ...ఫిలసాఫికల్ గా , మనుషులలో వుండే చిత్రమైన మనస్త త్వాన్నిఆవిష్కరిస్తూ పలికిన సంభాషణలు తో సాగుతుంది.
ఆ తరవాత కథ ను బుల్లి తెర పై వీక్షించండి. నా పాత్ర మరియు ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాలూ చెప్పండి. ఈ నెల 20 తేది నుండి నా పాత్ర, అదే 'వెంకట్రావు' ప్రవేశించాడు. మీరు కూడా మీ కుటుంబం లో వ్యక్తిగా ఆదరిస్తారు కదూ.
షూటింగ్ లో కొన్ని ఛాయాచిత్రాలు ఇక్కడ పెడుతున్నాను.
వెంకట్రావు పాత్ర స్వభావాన్ని వివరిస్తున్న దర్శకులు ఇంటూరి వాసు, రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్, కెమరా- రామకృష్ణ , సహాయకులు . ఎడమనుండి మొదటగా నేను.
'నైవేద్యం' మెస్ లో పనివాడుగా చేరుతున్న సందర్భం. ఎడమనుండి నేను, వాజ్ పాయి , సత్య కుటుంబం
ఈ సీరియల్ లో నేను పని చేసే 'మెస్' ఇదే! పేరు 'నైవేద్యం'
అమ్మ చేతి వంటని ఆరగించండి
మెస్ లో మొదట భోజనం చేస్తున్న వాజ్ పాయి గారికి వడ్డిస్తూ ,పనిలోకి ప్రవేశం
కళకళ లాడుతున్న' మెస్'
'మెస్' లోకి వస్తుండగా కెమరామెన్ రామకృష్ణ తో
అయ్యో , ఇదేమిటి ? అక్కా చెల్లెళ్ళు స్మశానం దగ్గర ! వారితో పాటు నేను కూడా... ఏమి జరిగింది? ఎవరు మరణించారు? ...రాబోయే కాలం లో చూద్దాం....
భాస్కర్ కి నాతో పనేమిటి? హీరో తో నాకు మాటలా ? ఏదో చెప్పు కుంటున్నాడు నాతో.. ఏమిటది?
- ఒక సీన్ లో సూచనలు ఇస్తున్న దర్శకులు వాసు, సహా దర్శకులు పొట్లూరి రాంబాబు
సహదర్శకులు రాంబాబు, నేను , నా వెనుక 'బుచ్చి'
మేకా రామకృష్ణ , నేను
ప్రస్తుతానికి ఇంతే! తరవాత షెడ్యుల్ లో మరి కొన్ని ఫోటోలు
అన్నట్లు " లయ" సీరియల్ లో కూడా నా పాత్ర 'వెంకట్రావే'! పెళ్లి కానీ వెంకట్రావు . చివరికి పెళ్లి అవుతుంది అనుకోండి.అదంతా... 'లయ' కథ .
ముందుగా అభినందనలు
ReplyDeleteతర్వాత సంగతి - ఇలా మీరు కథంతా చెప్పేసారనుకోండి - పెళ్ళవుతుందని, పెళ్ళి కాదనీ, సత్యమ్మగారి తమ్ముణ్ణి "కాల్"చేసారనీ, మెస్సు కళకళలాడుతోందనీ, వాజ్పేయి గారు మీ చేతి వంట తింటారనీ ఇలా ఇంక బోల్డు సంగతులు చెప్పారనుకోండి - సీరియలెవరు చూస్తారండి బాబూ ?
ఆడవాళ్ళు మాట్టాడుకోడానికి, అంటే మీకు పెళ్ళవుతుందా లేదా, వాజ్పేయి మీ వంట తింటారా లేదా - ఇళా సస్పెన్సు అట్టిపెట్టాలి....:) :)
ఊరకే అన్నాలెండి.... :)
అయ్యా , మీరు తప్పులో కాలేసారు. ఇప్పటి వరకూ జరిగిన కథను మాత్రమే నేను చెప్పాను. జరగ బోయేది బుల్లి తెర పైనే ! అయితే మీరు సీరియల్ వరుసగా చూడటం లేదన్నమాట! ఏమైనా మీకు ధన్యవాదాలు!
Deleteఓ మీరేనా? నిన్న చూశాను. అభినందనలు.
ReplyDeleteచక్కటి కుటుంబ ధారావాహిక.
ReplyDeleteఇంతవరకు ఈ సీరియల్ చూడలేదు.ఇహపై మీ కోసం చూస్తాను.
ReplyDeleteఎదురీత సీరియల్ బాగుంది. అందులో నటిస్తున్నందుకు మీకు అభినందనలు.
ReplyDeleteఐతే రాజా చనిపోతాడా..మేము ఇంకా బ్రతికించుకోవడానికి అక్కలు ఏమి చేస్తార అని అలోచిస్తున్నము.
ఆజాద్ గారు రాధా మధు లో కూడా చాలా చక్కటి పాత్ర పోషించారు.