My Blog List

Sunday, December 30, 2012

దేవుడా! నా బిడ్డలకు వెలుగు ప్రసాదించు!

దేవుడా!
నా బిడ్డలకు వెలుగు ప్రసాదించు!
నా చిన్నారులు
చి . జ్ఞాపిక , మెకానికల్ ఇంజినీరింగ్ ఆఖరి సం .
చి . అనామిక, పశువైద్య విద్య ,మూడవ సం .
చి . వెంకటేశ్వర రావు , ఇంటర్ మొదటి సం . చదువుతున్నారు.
వారికీ విద్య అభ్యసించటం లో ఎట్టి  అవరోధాలు కలిగించకు. నా కోరిక తీరుస్తావు కదూ ........

                   చదువు అయిపోయిన తరువాత వారి  కోరికలు పండించు . ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దు .
                  వారికి  తల్లిని ఆదరించే మనసు నివ్వు.
                  నా బిడ్డలకు మనుషులను ప్రేమించే గుణం ఇవ్వు. ద్వేషించే వారిని సైతం ఆదరించే మనసు నివ్వు . సర్వ జీవుల పట్ల ప్రేమానురాగాలు పంచుతూ ఆనందంగా జీవించే వెలుగు ప్రసాదించు.  ఈ ప్రపంచం లో పుట్టినందుకు జన్మ సార్ధక్యాన్ని ప్రసాదించి పునీతులను చేయి.
దేవుడా!
నా బిడ్డలకు వెలుగు ప్రసాదించు!



                                                 

Saturday, December 29, 2012

దేవుడా! దేవుడా!  మేలుపొద్దులు
నాకు చక్కని జీవితాన్ని ఇచ్చావ్ . ఇంత కాలం నన్ను ప్రత్యేక వ్యక్తిగా తీర్చి దిద్దావ్ .
నేను కోరుకున్న లక్షణాలతో కూడిన ' జానకి' ని నా జీవిత భాగస్వామిని చేసావ్ .
జ్ఞాపిక , అనామిక , వెంకటేశ్వర రావు లను నాకు బిడ్డలుగా ప్రసాదించావ్.
నా బిడ్డలకు సాదారణ విద్యాలయాల్లో చదివించి, మంచి చదువులలో రాణించే విధంగా రూపొందించావ్ .
అలాగే మంచి భవిష్యత్తును కూడా ప్రసాదిస్తావ్ .
నా జీవిత భాగాస్వామినికి నావల్ల ఆనందం కలగ చేసావ్ .
నేను ఏది కోరితే అది నాకు ప్రసాదించావ్ .
ఎన్ని ఇచ్చావ్ నాకు.
నేనంటే ఎందుకు ఇంత ఇష్టం నీకు.
ఈ సృష్టి లో అద్భుతమయిన  పనులు నా చేత చేయించావ్.
చిత్రకారుడిని చేసావ్ , రచయితని చేసావ్,  రంగస్థలం -రేడియో - టివి లలో నటింపచేసావ్.
నాకోరికమీద చివరికి ఒక సినిమాలో కూడా నటింపచేసావ్.
నా చేత తెలుగు భాషకు సేవ చేయించావ్ . తల్లికి ,తండ్రికి సేవ చేయించావ్.
ఎన్నో సాహిత్య సంస్థలకు ముఖ్య భాద్యుడుగా చేసి అద్భుతాలు చేయించావ్.
పిన్న వయసులో సాహిత్య మాసపత్రికకు 'సంపాదకుడు' చేసావ్.
అమ్మ భాష అంతరించి పోయే దశలో , నన్ను మేలుకొలిపి తెలుగు భాష బతకాలంటే తెలుగు జానపద కళలు వర్ధిల్లాలని , ముందుగ అందుకు సంబందించిన కార్యక్రమం,  ప్రపంచంలోనే "తొలి జానపద కళా  చైతన్య యాత్ర "ను నాచేత నడిపించావ్ . అందుకు పెద్దలు , రాజకీయ నాయకులూ , ప్రభుత్వాలు సహకరించక పోయినా , నా స్వంత నిధులు తోడుతో ముందుకు వెళ్ళేలా చేసావ్. ఇంత ధైర్యాన్ని , వ్యూహ చతురతను నాకు ప్రసాదించావ్ . ఎన్ని పుస్తకాలు నాచేత రాయించావ్ .  పుస్తకాలకు,  సంపా దకత్వం వహించిన ఆకర గ్రంధాలకు  ముద్రణ కూడా చేయించావ్. 
దేవుడా ! నా చేత ఎన్ని చేయించావ్!
అల్పుడి చేత అనల్ప కార్యాలు చేయించావ్ .
ఇదంతా లోక కళ్యాణం కోసమే చేయించి వుంటావ్
ఈ విశాల విశ్వం లో నాకు ఒక ప్రత్యేకతను కల్పించావ్ .
ఎంత గొప్ప సంకల్పం నీది.
దేవుడా! నీకు నా మప్పిదాలు !