ఈ రోజు ,'కళా సాహిత్య సంస్కృతిక జీవి' గా ఆంధ్ర భూమి దిన పత్రిక -కృష్ణ జిల్లా 'మెరుపు' శీర్షిక లో ,' కవులు ..రచయితలు...-36 'నందు నన్ను పరిచయం చేసారు, శ్రీ విహారి గారు .
ఆ పేపర్ ఇక్కడ ఇస్తున్నాను .
ఇందులో " అక్టోబర్ 2001 లో రమేష్ బాబు ఒక గొప్ప చారిత్రాత్మక సాహిత్య విజయాన్ని సాధించారు. తన సంపాదకత్వం లో 'జ్ఞాపిక ' పేరు తో 'తర తరాల గుడివాడ ప్రాంత శతకవితలు ' గ్రంధాన్ని ప్రచురించారు. దీనిలో మాదయ్య కవి నుండి రేపటి కవుల వరకు రాసిన రచనలను పొందు పరిచారు. కష్ట సాధ్య మయిన కార్యం ఇది. సాహితీ లోకమంతా అభినందించ వలసిన ప్రచురణ ఇది. " అని రాసారు విహారి గారు. . ఆ పుస్తకం కోసం నేను పడిన శ్రమ మరచి పోయేలా చేసిన పై వాక్యాలు , నాకు ఆనందాన్ని కలిగించాయి. .
శ్రీ విహారి గారికి ధన్యవాదాలు.