My Blog List

Saturday, May 4, 2013

'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ '

నేను నిర్వహించిన తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ ' లో నమోదు చేసారు . క్రింది లింక్ లో చూడండి    http://www.telugubookofrecords.com/home/category/find-record/page/5/

Friday, April 19, 2013

'జానపద కళాబంధు' తాతా రమేష్ బాబు

'జానపద కళాబంధు' తాతా రమేష్ బాబు
        ఏప్రిల్ 16 న గుడివాడ లో జరిగిన తెలుగు నాటక రంగ దినోత్సవం మరియు చార్లీ చాప్లిన్ జయంత్యుత్సవం వేదికగా తాతా రమేష్ బాబు కు 'జానపద కళాబందు' బిరుదు ప్రదానోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్ పాల్గొని , తాతా రమేష్ బాబు రచయితగా, కళాకారుడుగా చేస్తున్న కృషిని  కొని యాడారు .
ఎడమ నుండి పోలవరపు కోటేశ్వరరావు, బండారు రాధాకృష్ణ, దా. గుడిసేవ విష్ణు ప్రసాద్, చోడవరపు విజయ కుమార్ , పొన్నూరు రామకృష్ణ , కొల్లి మురళి, నరహరిసేట్టి ప్రసాద్ .
 తాతా రమేష్ బాబు ఇటివలి కాలంలో ప్రచురించిన 'తెలుగు జానపద కళ ', 'జ్ఞాపిక', 'గుడివాడ వైభవం' పుస్తకాల లోని విషయాలను ఉటంకిస్తూ డా . గుడిసేవ విష్ణు ప్రసాద్ , ఆజాద్ లతో కలిపి సత్కరిస్తున్న దృశ్యం .





పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు పావులూరి శ్రీనివాసరావు , ఆంధ్ర అకాడమి ఆర్ట్స్ వైస్ ప్రసిడెంట్ కొల్లి మురళి లు ఆజాద్ తో కలసి 'జానపద బంధు ' ను  అభినమ్దిస్తున్నారు.




                                                     తాతా రమేష్ బాబు, ఆజాద్ ల ఆనందం


 
ప్రముఖులు సుఖమంచి మల్లిక్, ప్రభాకర నాట్య మండలి కార్యదర్శి మట్టా రాజా, చార్లీ చాప్లిన్ క్లబ్ వ్యవస్థాపకులు నరహరిసేట్టి ప్రసాద్ లు

నాకు ప్రదానం చేసిన బిరుదు పత్రమ్. ఇందులో నేను నటించిన రంగస్థల, టివి, బొమ్మలాట, చిత్రలేఖనాలను అమర్చి తయారుచేయటం బాగుంది .



Friday, April 12, 2013

చార్లీ చాప్లిన్ కామెడి క్లబ్ ఆధ్వర్యం లో తెలుగు నాటక రంగ దినోత్సవ ఆహ్వానం

చార్లీ చాప్లిన్ కామెడి క్లబ్ ఆధ్వర్యం లో తెలుగు నాటక రంగ దినోత్సవ ఆహ్వానం








     నవ్వుకోవాలనుకునే వారందరికీ ........ నవ్వుతూ స్వాగతిస్తున్నాం  

కృష్ణా జిల్లా సాంస్కృతిక మండలి ఉగాది వేడుకలు

కృష్ణా జిల్లా సాంస్కృతిక మండలి  ఉగాది వేడుకలు 
శ్రీ విజయనామ  సంవత్సర ఉగాది వేడుకలు కృష్ణా జిల్లాసాంస్కృతిక మండలి ఆధ్వర్యం లో మచిలీ పట్నం  టౌన్ హాల్ లో జరిగాయి . 
కవిసమ్మేళన కార్యక్రమానికి నాకూ ఆహ్వానం .
'విజయ నామం .... నేనేనా' అంటూ నేను కవితా గానం చెసాను.
కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బుద్ధా ప్రసాద్ జ్యోతి , అదనపు జాయింట్ కలెక్టర్ రమేష్ కుమార్, ఎస్పి జె. ప్రభాకర్ రావు , జిల్లా విద్యా శాఖాధికారి దేవానంద రెడ్డి లు నన్ను సత్క రించారు .
ఆ ఫోటో


Thursday, March 21, 2013

తెలుగు జానపద కళ -పుస్తక సమీక్ష సభ

  తెలుగు జానపద కళ -పుస్తక సమీక్ష సభ
                       మార్చ్ 20 వ తేదిన గుడివాడ కెజిపిఆర్ ఏన్నార్ బి ఎడ్  కళాశాలలో తాతా రమేష్ బాబు రచించి,సంపాదకత్వం వహించిన  ' తెలుగు జానపద కళ ' - పుస్తక సమీక్ష సభ జరిగింది .
                ఎడమ నుండి ప్రిన్సిపాల్ డా . జె. షకీలా , అక్కినేని కళా పీటం , కో ఆర్డినేటర్ కె.ఎస్. అప్పారావు, రచయితా తాతా రమేష్ బాబు 


              సమాజాన్ని చైతన్యం చేయడానికి ఉపకరిస్తున్న తెలుగు జానపద కళ లను పరి రక్షించి భావితరాలకు అందించవలసిన గురుతర బాద్యత గురువులపై వున్నదని కళాశాల కమిటి కోశాధికారి కే ఎస్ అప్పారావు అన్నారు.ఎంగిలి సంస్కృతులకు మనం బానిసలం కావడంతో తరతరాల మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే ఎన్నో జానపద కళలు  ఇప్పటికే అంతరించాయని అన్నారు.
             డా.  కొడాలి సోమసుందర రావు పుస్తకాన్ని సమీక్షిస్తు , జానపద కళలపై  చక్కని అవగాహన కలిగించే పుస్తకమని, భవిష్యత్తులో ఈ పుస్తకాన్ని సిలబస్ గా ప్రభుత్వం ప్రకటించే అవకాసం వున్నదని పెర్కొన్నారు . పుస్తకం లో పలు అంశాలు గురించి వివరించారు. పగటి వేషాలు సామాజిక అంశాలు వ్యాసం అద్భుతంగా వున్నదన్నారు. డా . బీరం సుందర రావు, డా .పేట శ్రీ, డా . కసిరెడ్డి, డా . పొద్దుటూరి, ఈటివి ఉదయ శంకర్ రాసిన వ్యాసాలు ' జానపద కళల వివరణలు చక్కగా వున్నాయన్నారు.
              రచయిత తాతా రమేష్ బాబు మాట్లాడుతూ , వివిధ జానపద కళలను అవగాహన చేసుకొని , వాటిని తరగతి గదిలో బోధనోపకర ణాలుగా    ఉపయోగించి విద్యార్థులకు విజ్ఞాన, వినోద , వికాసాలను అందించాలని సూచిమ్ చారు.
               తాతా రమేష్ బాబు ను కళాశాల బి ఎడ్  విద్యార్థులు , అధ్యాపకులు, యాజమాన్యం ఘనంగా సన్మానించారు.

                         ఎడమ నుండి బి. ఎడ్  కళాశాల ప్రిన్సిపాల్ డా . జె. షకీలా , కోశాధికారి కె ఎస్. అప్పారావు, తెలుగు విభాగాదిపతి డా . కొడాలి సోమ సుందర రావు, కళాశాల కోఅర్డినేటర్ కె ఫై ఎ చౌదరి
  







               విద్యార్ధి చిత్రించిన బొమ్మను తాతా రమేష్ బాబు కు బహుమతిగా ఇచ్చారు. 

                అక్కినేని కళా పీటం  మేమొంటో  ను రచయితకు .... 

               ఈ సందర్భంగా తాతా రమేష్ బాబు ప్రదర్శించిన బొమ్మలాట ' దురాశతో .... ' , అందరిని అలరించినది . 




                 బొమ్మలాటను ప్రదర్శిస్తున్న్న తాతా రమేష్ బాబు  
      ఇంకా అధ్యాపకులు ది.ఎస్. ప్రత్యూష , బి. ఆనందబాబు లు ప్రసంగించారు . 


    

Thursday, March 14, 2013

నా మరో పుస్తకం 'చిత్రకళ '

http://kinige.com/kbook.php?id=1568&name=chitrakaLa
నా మరో పుస్తకం 'చిత్రకళ '
పై 'కినిగె.కాం ' లో దొరుకుతుంది .
ఈ పుస్తకం మీద మీ అభిప్రాయాన్ని కోరుతూ ....... 

Thursday, February 7, 2013

జానపద కళా చైతన్య యాత్ర -దృశ్య రూపం -మొదటి భాగం

జానపద కళా చైతన్య యాత్ర -దృశ్య రూపం -మొదటి భాగం





ది . 07,08,09, ఆగష్టు 2012 లలో 'తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ' - కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో నిర్వహించాను. ఈ సందర్భం గా 'తెలుగు జానపద కళ ' పుస్తకాన్ని తీసుకు వచ్చాను.
కాగా,  ఈ యాత్ర 3 రోజులు దృశ్య రూపంగా , మొత్తం 13 డి.వి.డి లు తీసాము. అందు నుండి వీలు చేసుకుని కొన్ని అంశాలు ఇందులో పోస్ట్ చేస్తాను. మీ అభిప్రాయం చెప్పండి .
తాతా  రమేష్ బాబు