నా "నా గొడవ " కవితను వింటూ ,చూడండి.....
Tata Rameshbabu,#14/161-2,station Road,Gudivada-521301,andhra pradesh. land line:08674244885,Cell:9441518715,email:rbtata60@gmail.com
My Blog List
Wednesday, May 30, 2012
Sunday, May 13, 2012
'ఎదురీత ' షూటింగ్ కబుర్లు
'ఎదురీత ' షూటింగ్ చేసి, ఈ రోజే గుడివాడ వచ్చాను. కొన్ని ఛాయా చిత్రాలు చూడండి.
వెంకట్రావు ,బుచ్చి , వీణ, సత్య లు మెట్ల మీద కుర్చుని ఆలోచనలో పడ్డారు . దేని గురించి?
వీణ, సత్య, వెంకట్రావు ల మెస్ కి సిఐ వచ్చాడు . ఎందుకు?
దర్శకులు వాసు.... షూట్ చేస్తున్న దృశ్యాన్ని మోనిటర్ లో చూస్తున్నారు .
కేసు వాదించటానికి కోర్ట్ కి వస్తున్న లాయర్ 'భగీరద' గా , ఈ సీరియల్ రచయిత పీ. చంద్రశేఖర ఆజాద్.
చాలా ఖరీదయిన లాయర్ . ఎవరి తరపున వాదిస్తాడు? రాజా తరపునా? మంత్రిగారి తరపునా?
వెంకట్రావు ఇక్కడ ఎందుకున్నాడు? లాయర్ భగీరధ ను 'నైవేద్యం ' మెస్ కి ఆహ్వానించటానికి వచ్చాడా? భాగీరధ మీద తిరగ బడతాడా ? అసలు ఎ సంబంధం లేదా ?
అరె ! జడ్జ్ గారు , వెంకట్రావు నమస్కారాలు చేసి కొంటున్నారు! పైగా వెంకట్రావు కళ్ళజోడు పెట్టుకొన్నాడు... కొంపదీసి మన వెంకట్రావు కూడా,రాజా కేసు గురించి 'లా ' చదివేశాడా ఏమిటి? అసలు ఎ సంబంధం లేదా ?
షాట్ గ్యాప్ లో సరదాగా .... వెంకట్రావు, భాగీరధ, దర్శకులు ఇంటూరి వాసు, బుచ్చి, మేనేజర్ సతీష్ లు
నిన్న సాయంత్రం హనుమాన్ జంక్షన్ లో నా 'గుడివాడ వైభవం' పుస్తకాన్ని పరిచయం చేసారు. 'రక్త కన్నీరు ' ఫేం దాసరి పూర్ణ - ఈ కార్యక్రమం చేసారు. అభయ ఆంజనేయ స్వామీ దేవాలయం పందిరిలో జరిగిన ఈ కార్యక్రమం తరవాత ' రక్త కన్నీరు' నాటక ప్రదర్శన జరిగింది.
వేదిక పై అమర్చిన బానర్
'గుడివాడ వైభవం ' పుస్తకాన్ని పరిచయం చేస్తున్న దాసరి పూర్ణ , ఆలయ చైర్మన్, తదితరులు ఎడమ నుండి 3వ వ్యక్తి గా నేను.
Monday, May 7, 2012
'కవిరాజు'జయంతి సభ -కొన్ని ఛాయాచిత్రాల
'కవిరాజు ' త్రిపురనేని రామస్వామి 125 వ జయంతి సభ చక్కని వాతావరణంలో జరిగింది. అర్థవంతమైన ప్రసంగాలు ఆహూతుల హృదయాలను అలరించాయి . సభను చలువ మందిరం లో ఏర్పాటు చేసినప్పటికీ సంకేతిక కారణాల వలన సభా మందిరాన్నిచల్లదనం పరచుకోక పోయినా, ప్రారంభ సమావేశంలో 'కవిరాజు' ఆలోచనలు, హేతువాదం తో సభ వాతావరణం అంతా నిండిపోయి - ఆ చల్ల దనాన్ని మించిన సౌఖ్యాన్ని పంచింది.
నేను ఈ రాత్రికే 'ఎదురీత ' సీరియల్ లో నటించటానికి హైదరాబాదు వెళ్ళవలసి రావటం తో కొన్ని చాయాచిత్రాలను ఇక్కడ ఉంచుతున్నాను .
సదస్సు జరిగిన ప్రదేశం ఇక్కడే ! ఆ కనిపించే భవనం 2వ అంతస్తులో
సభ మందిరాన్ని పర్యవేక్షిస్తూ...డా.వెలగ వెంకటప్పయ్య గారితో నేను .
ఇక్కడ ఒక విషయం చెప్పాలి . 1984 లో 'జనప్రభ' సాహిత్య మాస పత్రిక ఆవిష్కరణ సభలో మేము ఇద్దరం పాల్గొన్నం. ఆ పత్రిక సంపాదకుడిగా నేను, ఆవిష్కర్తగా డా. వెలగా . ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాం.
సభలో కవిరాజు మనవడు, సిని నటుడు సాయిచంద్ గారితో నేను
సదస్సును ప్రారంభిస్తూ ..... ఎడమ నుండి కేతు విశ్వనాధ రెడ్డి, త్రిపురనేని హనుమాన్ చౌదరి,యెర్నేని వెంకటేశ్వర రావు , ఎం. సి. మహేష్ [సాహిత్య అకాడెమి ప్రాంతీయ కార్యదర్శి ] , డా. వెలగా , తాతా రమేష్ బాబు[ కుడి చివర ]
మొదటి సమావేశానికి స్వాగతం పలుకుతూ నేను.
ప్రముఖ కవి బీరం సుందర రావు ,నేను
డా. ద్వానా శాస్త్రి ,నేను
మిగిలిన విశేషాలు తరువాత .......మన్నించండి
Thursday, May 3, 2012
గుడివాడలో కవిరాజు 'త్రిపురనేని రామస్వామి ' 125 వ జయంతి ఉత్సవం ఏర్పాట్లు
గుడివాడలో కవిరాజు 'త్రిపురనేని రామస్వామి ' 125 వ జయంతి ఉత్సవం ఏర్పాట్లు
ఈనెల 6 వతేదిన- గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ లో - కవిరాజు 'త్రిపురనేని రామస్వామి ' 125 వ జయంతి ఉత్సవం
కేంద్ర సాహిత్య అకాడమి
,న్యూ ఢిల్లీ యొక్క దక్షిణ ప్రాంత విభాగం,బెంగుళూరు వారి ఆధ్వర్యం లో
జరపాలని నిర్ణయించడం పట్ల ఇక్కడి సాహితీ మిత్రులు సంతోష పడుతున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ శ్రీ యెర్నేని వెంకటేశ్వర రావు పర్య వేక్షణలో టాటా రమేష్ బాబు,పావులూరి శ్రీనివాసరావు ,సత్యన్నారాయణ బాబు
,సోమసున్దరరావు లుఏర్పాట్లను చూస్తున్నారు.
ముందుగ సాహిత్య అకాడెమీ ప్రచురించి పంపిన కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.
6 వ తేది ఉదయం 10.30 కు ప్రారంభ సమావేశం జరుగే సభలోరచయిత కేతు విశ్వనాధ రెడ్డి ప్రస్తావనతో ప్రారంభమై ,
త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రారంభోపన్యాసం వుంటుంది
11.30 కి మొదటి సమావేశం లో పసల భీమన్న 'సూత పురాణం' , బీరం సుందర రావు 'భగవత్గీత' కే.యెన్ . మల్లీశ్వరి 'శంభుక వధ ' ,అమ్మంగి వేణుగోపాల ' కుప్పు స్వామి శతకం ', అనే కవిరాజు కృతులు పై ప్రసంగిస్తారు.
మ. 2.30 కి ద్వానా శాస్త్రి ,'ఖూని', శశిశ్రీ 'సూతాశ్రమ గీతాలు' , సోమసుందర రావు 'కురుక్షేత్ర నాటకం' , పాపినేని శివశంకర్,'శక పురుషుడు', గుమ్మ వీరన్న ' సంఘ సంస్కరణ ' , వెలగ వెంకటప్పయ్య,'కవిరాజు ప్రభావం' అనే అంశాలపై ప్రసం గిస్తారు.
సా. 4.30 కి జరిగే సమాపన సమావేశం లో , రావేల సాంబశివరావు అధక్షతన ,మంగళగిరి ఆదిత్య ప్రసాద్ , 'సమపనోప న్యాసాన్ని ఇస్తారు. గౌరవ అతిధిగా కవిరాజు మనవడు,త్రిపురనేని సాయిచంద్ పాల్గొంటారు.
ఈ సభకు వచ్చిన వారందరికి ఉదయం అల్పాహారం, మ. భోజనం , సా. టి , అల్పాహారం వుంటాయి.
కరపత్రం ఆవిష్కరణ
చలువ మందిరం లో జరిగే ఈ సమావేశం లో పాల్గొని' కవిరాజు ' ని మననం చేసుకొందాం రండి.
మ. 2.30 కి ద్వానా శాస్త్రి ,'ఖూని', శశిశ్రీ 'సూతాశ్రమ గీతాలు' , సోమసుందర రావు 'కురుక్షేత్ర నాటకం' , పాపినేని శివశంకర్,'శక పురుషుడు', గుమ్మ వీరన్న ' సంఘ సంస్కరణ ' , వెలగ వెంకటప్పయ్య,'కవిరాజు ప్రభావం' అనే అంశాలపై ప్రసం గిస్తారు.
సా. 4.30 కి జరిగే సమాపన సమావేశం లో , రావేల సాంబశివరావు అధక్షతన ,మంగళగిరి ఆదిత్య ప్రసాద్ , 'సమపనోప న్యాసాన్ని ఇస్తారు. గౌరవ అతిధిగా కవిరాజు మనవడు,త్రిపురనేని సాయిచంద్ పాల్గొంటారు.
ఈ సభకు వచ్చిన వారందరికి ఉదయం అల్పాహారం, మ. భోజనం , సా. టి , అల్పాహారం వుంటాయి.
కరపత్రం ఆవిష్కరణ
చలువ మందిరం లో జరిగే ఈ సమావేశం లో పాల్గొని' కవిరాజు ' ని మననం చేసుకొందాం రండి.
ఇలాంటివి 15 తాయారు చేయించాము . వీటిని పురవీధులలో ప్రదర్శించి , అనంతరం స్థానిక విద్యా సంస్థలకు బహుకరిమ్చాలనే ఆలోచన నాది .
Subscribe to:
Posts (Atom)