My Blog List

Friday, November 25, 2011

'మన ఊరి కథ '-తరతరాల చరిత్రకు అక్షర రూపం

తరతరాల చరితకు అక్షర రూప శిల్పుల పరిచయం -
'మన ఊరి కథ ' గా ఈరోజు ఈనాడు దిన పత్రిక లో ప్రచురించిన విషయాన్ని పొందు పరుస్తున్నాను.ఇందులో గుడివాడ, మచిలీపట్టణం , హనుమాన్ జంక్షన్ ల రచయితలను పరిచయం చేసారు.' గుడివాడ వైభవం ' పుస్తకాన్ని రాసింది నేనే నని మీకు తెలుసు. మీ అభిప్రాయాన్ని తెలియ చేయండి.

Sunday, November 20, 2011

"తెలుగు నిండుగ వెలుగు "


ది. 20.11..2011 న ఈనాడు దినపత్రిక కృష్ణా జిల్లా 8 వ పేజి లో "తెలుగు నిండుగ వెలుగు " శీర్షిక తో నా తెలుగు సాహిత్యం గురించిన వ్యాసం ప్రచురించింది. అది ఇక్కడ జత పరుస్తున్నాను.

Wednesday, November 2, 2011

సాహితీ ప్రియులకు , సాహితీ వేత్తలకు నమస్కారం.
"జ్ఞాపిక " తర తరాల గుడివాడ ప్రాంత శత కవితా సంపుటి ముద్రణ పూర్తి అయింది.
ఇందులో పదునాలుగవ శతాబ్దం నుండి నేటి వరకూ వందకవుల కవితలు ,వారి వివరాలు చేర్చటం జరిగింది.
నాటి కవులలో మాడయ్య కవి, దగ్గుపల్లి దుగ్గయ్య ,మాడయ్య గారి మల్లన ,సిరిప్రగడ ధర్మన్న, తుమ్మల పల్లి నాగభూషణం,దిట్టకవి రామచంద్రుడు, ఉప్పులూరి కనకయ్య, దాసు శ్రీరాములు , మొదలైన వారు.....
నేటి కవులలో పద్మశ్రీ అక్కినేని నాగేశ్వర రావు ,త్రిపురనేని రామస్వామి, గుడిపాటి వెంకట చలం, విశ్వనాధ సత్యనారాయణ , నార్ల వెంకటేశ్వర రావు , జోసుల సూర్యనారాయణ మూర్తి, బాలబందు బి.వి .,చలసాని ప్రసాద్, రుద్రజ్వాల, కే.జి. సత్యమూర్తి, అనామధేయుడు, ఆత్రేయ, వేలూరి,కాటూరు, జాలాది, ఏర్రోజు ,నండూరి, ద్వానా శాస్త్రి, పద్మశ్రీ ఎస్.వి. రామ రావు, మొదలైనవారు.....
రేపటి కవులలో తాతా జ్ఞాపిక { బి.ఇ, రెండవ సంవత్సరం}, తాతా అనామిక { బి.వి. ఎస్.సి , మొదటి సం. } చుక్కా నాగ దుర్గా ప్రసాద్ {పదవ తరగతి}, జేబు శ్వేతా పద్మావతి{పదవ తరగతి},తాతా వెంకటేశ్వర రావు {పదవ తరగతి}, వెలగడ పార్వతి {పదవ తరగతి} మొదలైన వారు ......
వెరసి వందమంది కవుల కవితలు ప్రచురించడం జరిగింది. డెమ్మీ సైజు లో నూట అరవై పేజీలతో పుస్తకాన్ని , పూర్తి రంగులలో అట్టను తొడగటం జరిగింది. అట్ట మీద ,వెనుక తైల వర్ణ చిత్రాలను నేను చిత్రించాను.

ఈ పుస్తకాన్ని ప్రత్యేక పద్ధతి లో ఆవిష్కరించాలని ఆలోచన .
అయితే ఎలా చేస్తే క్రొత్తదనం గా వుంటుంది? దయచేసి తెలుపగలరు.