మా నాన్నగారు
ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం గా చరిత్ర పుటల కెక్కిన వూరు అది.గుంటూరు జిల్లా లో వున్న ఆ వూరు పేరు 'భట్టిప్రోలు'.
ఆ ఊర్లో ' వెంకటేశ్వర్లు' అనే రైతు ఇంట సెప్టెంబర్ 6 న 1929 సం.లో జన్మించారు శ్రీ తాతా బసవలింగం. అం.ప్ర.ప్రభుత్వ విద్యా శాఖ, కృష్ణా జిల్లాలో తన ఉద్యోగ జీవితాన్ని గడపి విశ్రాంతి పొంది మరల 'భట్టిప్రోలు' చేరుకొన్నారు. అనేక ఆరోగ్య సమస్యల మధ్య , వారి కోరిక మీద కుమారుడయిన నా దగ్గరకు వచ్చి వైద్యం చేయించు కొన్నారు. అలాగే ది.30 .11 .2011 న కూడా నా దగ్గరకు వచ్చారు. వారితో పాటు వారి శ్రీమతి అయిన మా అమ్మగారు 'లక్ష్మి నరసమ్మ' కూడా ఎప్పుడూ వుండి,వారిని కంటికి రెప్పలా చూస్తున్నారు. మా అమ్మగారు ఎప్పుడు జన్మించారో తెలియదు. అయితే మా నాన్న గారి కంటే 9 సం. చిన్న అని చెప్తారు.వారి కుటుంబంలో అందరు నిరక్ష రాస్యులే!
మా అమ్మ నాన్నలతో నూతన 2012 సం. వేడుకలను నిర్వహించారు, మా పిల్లలు.
2012 కేక్ కట్ చేస్తున్న 'బసవలింగం',లక్ష్మి నరసమ్మ
ఆనందంగా నూతన సంవత్సర శుభకామనలు తెలుపు కొంటున్న దంపతులు
ఇలా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం వీరికి జీవితం లో ఇదే మొదటిసారి కావటం విశేషం . అందువల్లనే ఈ విషయాన్ని మీతో పంచుకొంటున్నాను
మీకు నాన్న గారికి అమ్మ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteచాలా బాగుందండీ! ఇలా మీరు తల్లిదంద్రులతో కలసి నూతన సంవత్సరం చేసుకోవటం....
ReplyDeleteఈరోజుల్లో ఎంత మంది తలిదండ్రులు ఆ భాగ్యానికి నోచుకున్నారు?
మా హార్ధిక నూతన సంవత్సర శుభాకాంక్షలు!