
కలుషితం
స్వచ్చమైన గుణం లో
అవినీతి వెల్లూనిండి
అడ్డదార్లు

సముద్రం
అలసట చెందక
ప్రయత్నం
అలల
జివలక్షణం

సమాజం
చట్రం
తన లోపలా బయటా
వ్యక్తిత్వాన్ని కాపాడు కుంటా ...

యవ్వనో ద్రేకం
మనసు రంగుల్లో
గుప్పెడు హృదయం
ఆలోచన ఆనందం

విస్పోటనం
చురుక్కున మెరసిన
ఆలోచన
విశ్వాభ్యుదయానికి
ఆలంబన

వలస
మూలాల
ప్రేమకు దూరమై
స్వప్న లోకం

సర్థుబాటు
ముఖాలు
వాతావరణం
సరికొత్తదనం
మనసా ఇమిడి పో

పరావర్తనం
మనసులోని భావం
నీచంగా
ప్రతిబింబం

పాటశాల
బుద్ది
సత్యాన్ని అన్వేషిస్తే
చైతన్యం

నకిలీ
పిట్ట పాట
గొంతు శ్రుతి చేస్తే
కృత్రిమం

జన్మస్థలం
చరించి
దర్శించి
తరించి

చిత్రం
కాన్వాస్ ప్రపంచం
రంగు
కుంచెకు ప్రాణం

భావ తరంగం
ఓ పరిచయం
ఓ మొబైల్
ఓ జ్ఞాపకం
ఆనందమే ఔషదం

అపసవ్యం
పెరిగిన టెక్నాలజీ
తరిగిన హ్యుమానిటి
పెకలిస్తాం
స "మూలం"

అన్వేషణ
విలక్షణ మార్గాల్లో
అందమైన లక్ష్యం
ఒంటరి గా

సబల
ఇష్టమైన నడక
ఆకాశం లో సగం
నింగినే వాసం

అనివార్యం
తాళి బతుకు
ముళ్ళ గతుకు
తరగని వికాసం
కట్ట నాలు
తాళిబొట్టు
తల ఓంపించిన అదను
గుండెల్ని తన్నింది

No comments:
Post a Comment