My Blog List

Tuesday, December 31, 2013

"గంగతో రాంబాబు ' సీరియల్ లో నేను 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా హ్యాట్రిక్

"గంగతో రాంబాబు ' సీరియల్ లో నేను 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా హ్యాట్రిక్

         ' లయ ' సీరియల్ లో 'పెళ్లికాని వెంకట్రావు' గా


       'ఎదురీత ' సీరియల్ లో 'అంకుల్ వెంకట్రావు' గా 


ఇప్పుడు 'గంగ తో రాంబాబు' సీరియల్ లో 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా ,మల్లి మీ ముందుకు .....


సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా ఒక ఎపిసోడ్ లో ......
                                                 నేను, డూప్ కృష్ణ , రాంబాబు , పితాని , దాసన్న,

డూప్ లతో ............


సినిమా నిర్మాతగా ......... ఒక ఎపిసోడ్ లో ......


                                        నేను, ప్రక్కన ఎవరు? తెలుసుకోవాలంటే సీరియల్ చూడాలి




 

                                                              అరె ! గంగ తో నాకు పనేమిటి?



                                       
                                                                       క్లోజ్ లో ఒక షాట్

మరి కొన్ని ఫోటోలు , విశేషాలతో ...  తరవాత షెడ్యుల్ షూటింగ్ అయిన తర్వాత ..... 


' నా దేశం ' డివిడి ఆవిష్కరణ

         ' నా దేశం '  డివిడి ఆవిష్కరణ
          దేశాన్ని ప్రేమించేవారు నిరంతరం తమ విధులను , బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ , దేశ ప్రగతి గురించి ఆలోచిస్తుం టారని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య ఎల్లురి శివారెడ్డి అన్నారు. నేను రచించిన దీర్ఘ కవిత 'నాదేశం' డివిడి ని ఆయన హైదరాబాద్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు . ప్రముఖ రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్ మాట్లాడుతూ ,' కన్నతల్లి కంటే , స్వర్గం కంటే జన్మభూమి గొప్పదని, అందుకే ఎ దేసమేగిన , ఎందు కాలిడినా పొగడరా నీ తెల్లి భూమి భారతిని అని ప్రజలు చెప్పుకుంటార ని , చదువురాని , అంధులు వినడానికి అనువుగా శ్రీ కాట్రగడ్డ గళం నించి తయారయిన ఈ డివిడి లో భారత దేశం గతం, వర్తమానం , భవిష్యత్తు ల గురించి మదన పడుతూ , దేశం గొప్పగా వుండాలని ఆకాంక్షిస్తూ కవి తాతా రమేష్ బాబు కవిత్వికరిం చడం ఆయన దేసభాక్తిని తెలియచేస్తోం దన్నారు . కోపం, సంతోషం , బాధ స్పందన ప్రదర్శించలేని తనం నీలో ఇంకిపోయినపుడు , మల్లి తల్లి గర్భం లోకి ప్రయాణించు , తొమ్మిది నెలల చైతన్యాన్ని తనివి తీరా అనుభవించ మనే ఆలోచన కల్పించడం అభినందనీయమన్నారు .
          తన కవితా మార్గం ద్వారా జాతీయ భావాలు వెదజల్లుతున్న తాతా రమేష్ బాబు అభినంద నియుడని  పలువురు వక్తలు పెర్కొన్నారు.


               ఫోటో లో ఎడమ నుండి పి. చంద్ర శేఖర ఆజాద్ , తాతా రమేష్ బాబు , ఆచారి ఎల్లురి శివారెడ్డి